అధ్యాపకులకు కంప్యూటర్ శిక్షణా తరగతులు

2022-23 faculty development program లో భాగంగా కళాశాల అధ్యాపకులకు (1st బ్యాచ్) కంప్యూటర్ నాలెడ్జ్ కోసం MS OFFICE తరగతులు ది 30.06.2023 సాయంత్రం గం 4.30 లకు మన కళాశాల కంప్యూటర్ లాబ్ లో ఇచ్చారు. కంప్యూటర్ లెక్చరర్ శ్రీ డి.ప్రవీణ్ గారు శిక్షణ ఇచ్చారు.

ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ

జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6వ తేదీ మంగళవారం *ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ* అనే నినాదంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల NSS UNIT తరపున జరిగిన ఈ సభను NSS కో ఆర్డినేటర్ జి. రాంబాబు గారు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదానం. హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ గారు అధ్యక్ష భాషణను చేస్తూ పాంచభౌతికమైన ఈ శరీరం ప్రకృతితో మమేకమై ఉన్నదని కనుక ప్రకృతి పరిరక్షణ మనందరి కర్తవ్యం అని తెలిపారు. జి. రాంబాబు గారు మాట్లాడుతూ 1972 నుండి జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవంగా మనం గత ఐదు దశాబ్దాలుగా జరుపుకుంటున్నామని కనుక ఈ రోజున ప్రతిపాదించిన అంశాలను మనందరం ఆచరణలో పెట్టగలిగితేనే భావితరాల వారికి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని తెలిపారు. అనంతరం కె. సత్యమూర్తి గారు మాట్లాడుతూ పర్యావరణానికి సంబంధించిన అధ్యయనాలు యూజీ స్థాయి విద్యార్థులకు 2005 నుండి అమలు పరచడం ముదావహమని అవి సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయని వివరించారు. డా. యల్. మృదుల గారు మాట్లాడుతూ ఏదైనా సందర్భంలో మనం ఒక చెట్టు నరకవలసి వస్తే పది చెట్లను నాటాలని అప్పుడే ప్రకృతి విధ్వంసానికి అడ్డుకట్ట వేయగలమని సూచించారు. ఎం. కవిత గారు ప్రసంగిస్తూ ప్రతి ఏడాది జరుపుకునే  పర్యావరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం *ఎ సొల్యూషన్ టు ప్లాస్టిక్* అనే  Theam తో UNED సంస్థ ముందుకు వెళుతుందని తెలిపారు. ఆర్. వరప్రసాద్ గారు మానవున్ని అల్పాయుష్కునిగా చేయడంలో పర్యావరణం ప్రధాన పాత్ర వహిస్తుందని కలుషిత పర్యావరణంయ అనేది ప్రాణికోటి మనుగడకు ముప్పు తీసుకురాబోతుందని కనుక మనమంతా పర్యావరణాన్ని రక్షించడంలో మన వంతు కృషి చేయాలని చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నినాదాల తో కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లెళ్ళమూడి గ్రామ ప్రజలకు చైతన్యాన్ని కలిగించేలా ముందుకు సాగారు.

K.J.V మరియు AIDS పై అవగాహన సదస్సు

దేశానికి యువత వెన్నముక లాంటిదని భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని నిర్వాహకులు తెలిపారు. సరైన విద్య, ఆరోగ్యం సమాజానికి ఎంతో అవసరమని గుర్తించిన ప్రభుత్వం  యువతను మేల్కొల్పడానికి అనేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేసింది. 11.07.2020 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి, గుంటూరు లో రెడ్ క్రాస్ క్లబ్ అధ్వర్యంలో WAY, AIDS మరియు రక్తదానం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలాజ్యోతి విద్యార్థులకు AIDS పై అవగాహన కలిగించారు. హెచ్.ఐ.వి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని వివరించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి సోకదని తెలియజెప్పారు. హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిన యం.సుల్కమ్మ (బాపట్ల)  హెచ్.ఐ.వి వచ్చినవారు ధైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

H.I.V. మరియు AIDS పై అవగాహన సదస్సు

13.2.2020 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి – గుంటూరులో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో H.I.V, AIDS మరియు రక్తదానం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. నిర్మలాజ్యోతి RRC Master Trainer, JMJ College, Tenali విద్యార్థులకు AIDS పై అవగాహన కలిగించారు. H.I.V. అనేది అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని వివరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈవ్యాధి సోకదని తెలియజెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. హనుమంతయ్య గారు అధ్యక్ష భాషణం చేస్తూ నివారణ కంటే నిరోధన ఉత్తమం కాబట్టి తెలిసి తెలిసి ఇంత భయంకరమైన వ్యాధి రాకుండా ఉండటానికితగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని, అది మనందరి కర్తవ్యమనీ సూచించారు. ఈ సదస్సులో శ్రీమతి కె. అపర్ణ DAPCU Co-Ordinator – Health H.I. V., Aids, Sex పట్ల సంపూర్ణమైన అవగాహనను కల్పించారు. పాజిటివ్ స్పీకర్గా బాపట్ల నుండి యమ్. సుబ్బమ్మ గారు వచ్చి H.I.V. బారిన పడినవారు అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలని తాను అనుభవించిన బాధలని మరెవరూ అనుభవించకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. కళాశాల NSS Co-Ordinator జి.రాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సందేహాలకు సమాధానాలిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోటీ ప్రపంచం-పరుగుల విజ్ఞానం

ప్రపంచీకరణంలో పరుగులు తీస్తున యువత అన్ని రంగాలలో జ్ఞానాన్ని సంపాదించాలని ప్రతి సంవత్సరం. డిసెంబర్ నెలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులలో దాగివున్న విద్యుత్ కాంతులను ప్రశ్నల ద్వారా బహిర్గతం చేసి వారిని పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండేలాగా చేయాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య గారు పిలుపునిచ్చారు. ఈ క్విజ్ పోటీలను 20.12.19 వ తేది శుక్రవారం ప్రిన్సిపాల్ గారు ప్రారంభించగా అధ్యాపకులు దానిని కొనసాగించారు. కార్యక్రమం చివరన విజేతలను ప్రకటించారు.

ప్లాస్టిక్ నివారించండి భూమిని కాపాడండి

ప్లాస్టిక్ నివారణపై మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థులు అంతా కలసి జిల్లెళ్ళమూడి గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు “ప్లాస్టిక్ ను వీడండి – ప్రకృతిని కాపాడండి”, ప్లాస్టిక్ వద్దు – పేపర్ ముద్దు” అనే నినాదాలతో గ్రామ ప్రజల్లో చైతన్యం కలిగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఈ కార్యక్రమం మన కళాశాలలో నిర్వహించాయి.