by admin | Aug 13, 2018 | Awarness Programs
లక్ష్య సాధనకోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్.మూర్తి వివరించారు. ఆగస్టు 13 వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని వివరించారు. దేశాభ్యుదయం కోసం, మానవ మనుగడ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మహనీయులు అహర్నిశలు శ్రమించిన తీరు తెన్నులను వి.యస్.ఆర్. మూర్తిగారు సోదాహరణంగా వివరించారు. ఇదే వేదికపై విద్యార్థినీ విద్యార్థులను ఆహ్వానించి, వారి జీవిత లక్ష్యాలు ఏమిటి? అని ప్రశ్నించి జవాబులు రాబట్టటం అందరినీ అలరించింది. ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్థినులు మనీషా, నాగలక్ష్మి సంతృప్తికరంగా సమాధానాలు చెప్పి శ్రోతల మన్ననలు పొందారు.
by admin | Aug 13, 2018 | Awarness Programs
లక్ష్య సాధన కోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్ మూర్తి వివరించారు. ఆగస్టు 13వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని వివరించారు. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బి.రామబ్రహ్మం గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ యల్. సుగుణగారు పర్యవేక్షించారు. సంస్థ చీఫ్ ప్యాట్రన్ డా. బ్రహ్మాండం రవి,ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. దేశాభ్యుదయం. కోసం, మానవ మనుగడ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో. మహనీయులు అహర్నిశలు శ్రమించిన తీరు తెన్నులను వి.యస్. ఆర్. మూర్తి గారు సోదాహరణంగా వివరించారు. అధ్యక్షులు శ్రీ బొప్పడి రామబ్రహ్మం గారు మాట్లాడుతూ, విద్యార్థులు దేశభక్తి, దైవభక్తి, మానవసేవ, అభివృద్ధి సాధన లక్ష్యాలుగా కృషి వివరించారు. కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ మాట్లాడుతూ ఆకలి, పేదరికం, అసమానతలు సమాజంలో తొలగిపోవాలని ఇది అమ్మ లక్ష్యమని సోదాహరణంగా తెలిపారు. యస్. ఆర్. మూర్తి గారిని నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. సంస్థ పెద్దలు శ్రీ.యమ్. దినకర్ , యమ్.శరచ్చంద్ర. యన్. లక్ష్మి, శ్రీరామ్మూర్తి, డి రామచంద్ర, వసుంధరక్కయ్య, ప్రధానో పాధ్యాయులు, కె ప్రేమకుమార్ అధ్యాపక సిబ్బంది. విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
by admin | Aug 7, 2018 | Awarness Programs
చరిత్రను విస్మరించిన జాతికి భవిష్యత్తు ఉండదని శ్రీనాధ సాహితీ పరిషత్ (నర్సరావుపేట) నిర్వాహకులు శ్రీ స్వర్ణ చినరామిరెడ్డి ఆగష్టు 7 వ తేదీన వివరించారు. సీనియర్ ఫాకల్టీ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ సమాజస్థితిగతులను చరిత్ర ఎప్పటికప్పుడు వివరిస్తుందని పేర్కొన్నారు. ఇదే వేదికపై కళాశాల చరిత్ర అధ్యాపకులు శ్రీ కాశీభట్ట సత్యమూర్తి మాట్లాడుతూ చరిత్ర గమనాన్ని పరిశీలించి ఉత్తమ విధానాలను అలవరచుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి చరిత్ర అధ్యాపకులు శ్రీ జి. రాంబాబు గారు స్వాగతం పలికి శాసనాలు, తాళపత్ర గ్రంథాలు దేశవిదేశీ ప్రముఖుల రచనలు చారిత్రక సత్యాలను చాటి చెబుతాయని పేరొన్నారు.
by admin | Aug 4, 2018 | Awarness Programs
ఉత్తమ ఫలితాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యార్థులు ముందుకు సాగాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ డి. పద్మజ గారు ఆగష్టు 4 వ తేదీన వివరించారు. డా|| పద్మజ మాట్లాడుతూ లక్ష్యంలేని విద్యాభ్యాసం నిష్ప్రయోజనమని స్పష్టం చేశారు. ఆశయ సాధనకోసం ఉన్నతమైన లక్ష్యాలతో ప్రగతిపథంలో పయనించాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. వివిధ ప్రశ్నలు సంధిస్తూ విద్యార్థుల నుండి సమాధానం రాబడుతూ డా॥ పద్మజ చేసిన ప్రసంగం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఆమె నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విద్యార్థులను ఆకట్టుకుంది. ఇదే వేదికపై పెద్దలు శ్రీ యన్. లక్ష్మణరావు, తెలుగు అధ్యాపకులు మధుసూదనరావు తదితరులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పద్యాలను గానం చేసి అందరినీ అలరించారు.
by admin | Jul 16, 2018 | Awarness Programs
మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఉపగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరాఘవ మూర్తిగారు వివరించారు. జులై 16వ తేదీన కళాశాల ప్రార్థనామందిరంలో ఆయన మాట్లాడుతూ ఏ దేశానికి తీసిపోని విధంగా అంతరిక్షప్రయోగాలలో భారతదేశం తన ప్రత్యేకతను నిలుపుకున్నట్లు ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్.సుగణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఉపగ్రహప్రయోగాల తీరుతెన్నులను సోదాహరణంగా ప్రదర్శించారు. అలాగే రాఘవమూర్తిగారు శిక్షణ ఇచ్చిన ఫైనలియర్ విద్యార్థినులు ఎ. మనీషా, టి. నాగలక్ష్మి పవర్ పాయింట్ ప్రజంటేషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రిన్సిపాల్ డా|| బి.యల్.సుగుణగారు, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయక విద్యలతోపాటు శాస్త్రీయ, సాంకేతిక రంగాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం లభించడం ఎంతో అవసరమని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య రాఘవమూర్తిగారు ప్రకటించారు. ఈ రంగాలలో భారతదేశానికి సముచితస్థానం లభించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే వేదికపై తాను శిక్షణ యిచ్చిన విద్యార్థినులు సమర్ధవంతంగా పవర్పాయింట్ ప్రజంటేషన్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగదు బహుమతితో అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, సంస్థ పెద్దలు శ్రీ ఎమ్. దినకర్, శ్రీ ఎన్. లక్ష్మణరావు, శ్రీ ఎమ్. శరచ్చంద్రకుమార్, శ్రీ రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
by admin | Jul 16, 2018 | Awarness Programs
మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఉపగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని ఇస్రో ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీ రాఘవమూర్తిగారు వివరించారు. జులై 16వ తేదీన కళాశాల ప్రార్థనా మందిరంలో ఆయన మాట్లాడుతూ మన దేశం, ఏదేశానికీ తీసిపోనిదన్నారు. అంతరిక్ష ప్రయోగాలలో భారతదేశం తన ప్రత్యేకతను నిలుపుకున్నట్లు ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్.సుగుణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉపగ్రహ ప్రయోగాల తీరు తెన్నులను సోదాహరణంగా ప్రదర్శించారు. అలాగే రాఘవమూర్తిగారు శిక్షణ ఇచ్చిన చివరి సంవత్సరం విద్యార్థినులు మనిషా, నాగలక్ష్మి పవర్ పాయింట్ ప్రజంటేషన్ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్ సుగుణ గారు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయాలతోపాటు శాస్త్రీయ, సాంకేతిక రంగాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం లభించడం. అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో భారత దేశానికి సముచిత స్థానం దక్కినట్లు చెప్పారు. వేదికపై తాను శిక్షణ యిచ్చిన విద్యార్థినులు స్టేజీపై సమర్థవంతంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. వారికి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్రగారు, సంస్థ పెద్దలుచేస్తూ నగదు బహుమతితో ఫోన్ కమ్మా రవింద్ర రావు గారు, సంస్థపెద్దలు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు