అమ్మ అమృత హస్తాల తో స్థాపించబడిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల 6/8/2025 బుధవారం నాడు  55  వ్యస్థాపక దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిగాయఈ వేడుకలలో భాగంగా టీ టీ డీ కళ్యాణ మండపం ప్రాంగణం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభకుమాతృశ్రీ ప్రాచ్య కళాశాల కరస్పాండెంట్   శ్రీజన్నాభట్ల కుమార చంద్రశేఖర్ గారు అధ్యక్షోపన్యాసం  లో  1971   ఆగష్టు  6 ప్రారంభించబడి  ఎన్నో ఘన విజయాలు సాధించినది.ఆనాటి గురు శిష్యుల సంబంధాలను గురించి పిల్లలకు తెలియజేశారు .కాలేజీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్డా.  బొడ్డపాటి సుబ్బలక్ష్మి గారు   మునుముందు సంస్కృతం, తెలుగు భాషలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు.  తన ఎదుగుదలకు కారకులైన అమ్మ గురించి, తన గురువు శ్రీ కొండమూది శ్రీహర్ష గురించి విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ మరకాని దినకర్ గారు మాట్లాడుతూ తాను జిల్లెళ్లమూడి వచ్చిన మరునాడే కళాశాల ప్రారంభమైనదనీ,అప్పటి స్థితిగతులను వివరించారు.  శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు మాట్లాడుతూ  కళాశాలలో విద్యార్థులు బాగా శ్రద్ధగా చదువుకోవాలని   తెలియజేశారు. మన కళాశాల విద్యార్థులు ఎక్కడ ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో , విద్యార్థులు ఎలా ఉండాలో తెలియజేశారు పూర్వ విద్యార్థిసమితి కార్య నిర్వాహక సభ్యులు శ్రీ కాసులనాటి  శేషాద్రి గారు. కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారు కళాశాల  (2024 –   25  ). వార్షిక నివేదిక ను అందించారు  ఈ సందర్భంగావిద్యార్థినులు గీతాలాపన చేశారు ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వక్తృత్వం, వ్యాసరచన, శ్లోకపఠనం, పద్య పఠనం, గద్య పఠనం,అంత్యాక్షరి(శ్లోకాలు,పద్యాలు)పోటీల్లో    బహుమతులు సాధించిన విద్యార్థులకు ఎంతో విలువైన పుస్తకాలను  పూర్వ విద్యార్థుల సమితి పక్షాన అందించటం జరిగింది. పూర్వ విదార్థి డాక్టర్ జయంతి చక్రవర్తి ఈ సభా నిర్వహణ చేశారు. డా. వి. త్రియంబకం వందన సమర్పణ చేశారు. శాంతి మంత్రం తో కార్యక్రమం ముగిసింది. వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.