సంస్కృతాన్ని పరిరక్షించండి

సంస్కృత భాషను దశదిశలా వ్యాపింపజేయాలని, అందుకు సంస్కృతాన్ని అధ్యయనం చేసే మనమంతా. కృషిచేయాలని, ‘సంస్కృత భారతి’ ప్రాంత అధ్యక్షులైన శ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు పిలుపునిచ్చారు. 2.12.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో జరిగిన సభలో సంస్కృతభాషా ప్రాశస్త్యం గురించి విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంస్కృతంలో మాట్లాడాలని కోరారు. ఒక్కొక్క విద్యార్ధి ఐదుగురికి సంస్కృతం నేర్పుతూ అలా గ్రామంలోని వారందరిచేత సంస్కృతంలో మాట్లాడించాలని తద్వారా జిల్లెళ్ళమూడిని ‘అర్కపురి’ అని పిలిచేలా చేయాలనీ, పిలుపునిచ్చారు. అందుకు తమ సహాయ సహకారాలను అందించాలని డా॥ హనుమంతయ్య గారిని ఈ కార్యక్రమంలో కోరారు. సంస్కృత విభాగంలోని విద్యార్థులు పాల్గొన్నారు.

కార్తీక వనమహోత్సవము

కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు అడవుల దీవి మధు అన్నయ్యగారు, వై.వి.శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజు గారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మన్నవ నరసింహారావు గారు పలువురు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. విద్యార్థులను నిరంతరం అధ్యయనం చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని పెద్దలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

కార్తీక వనమహోత్సవము

కార్తీక వనమహోత్సవం సందర్భంగా నవంబర్ 26-11-19న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణం -లో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు, కళాశాల ప్రిన్సిపల్ డా. ఎ. సుదామ వంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు మనశయ్య గారు, వై.వి. శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజుగారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మనవ నరసింగారావుగారు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్ర పటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు

కార్తీక వనమహోత్సవము

కార్తీక వనమహోత్సవము సందర్భంగా నవంబరు 26-11-2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. పరస్పర సహకారం, మైత్రీ భావములను పెంపొందించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ పెద్దలు అడవుల దీవి మధు అన్నయ్యగారు, వై.వి.శ్రీరామమూర్తిగారు, దేశిరాజు కామరాజు గారు, చక్కా శ్రీమన్నారాయణ గారు, ఎమ్. శరశ్చంద్రగారు, బూదరాజు శ్యామ్ దంపతులు, మన్నవ నరసింహారావు గారు పలువురు కళాశాలకు విచ్చేశారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలు అలంకరించి, నమస్కృతులు సమర్పించారు. విద్యార్థులను నిరంతరం అధ్యయనం చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని పెద్దలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

ప్లాస్టిక్ నివారించండి భూమిని కాపాడండి

ప్లాస్టిక్ నివారణపై మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థులు అంతా కలసి జిల్లెళ్ళమూడి గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు “ప్లాస్టిక్ ను వీడండి – ప్రకృతిని కాపాడండి”, ప్లాస్టిక్ వద్దు – పేపర్ ముద్దు” అనే నినాదాలతో గ్రామ ప్రజల్లో చైతన్యం కలిగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఈ కార్యక్రమం మన కళాశాలలో నిర్వహించాయి.