హేమవతీ దేవి జయంతి వేడుకలు

హైమవతీదేవి 77వ జయంతి ఉత్సవాలు ది. 18-11-2019న కన్నులపండుగగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా  లలితా కోటి నామ పారాయణ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 7 గంటలకు లలితా కోటి నామ పారాయణను రామాయణ రసభారతి బ్రహ్మ శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు సభలో ఆరంభించారు. పలువురు భక్తులు గ్రామాలనుండి  విచ్చేసి లలితా కోటిలో పాల్గొన్నారు. పారాయణ యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. అంతకుముందు ది. 14-11-2019 నుండి హైమవతీదేవికి వివిధ అలంకారాలు చేసి పూజలు నిర్వహించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఏకాంతంగా అన్నపూర్ణార్ణాలయంలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేశారు.

పూర్వపు విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం

మెరుగుపెట్టకుండా రత్నం కూడా ప్రకాశవంతం కాదనీ, మా గురువులు మమ్మల్ని, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపకవృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా 14.11.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభలో కళాశాల పూర్వ విద్యార్థులు తమ గురువులు సంస్కారవంతమైన చదువుతో మమ్మల్ని తీర్చిదిద్దారని తెలియజేశారు. డా॥ యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అథ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు విచ్చేశారు. విద్యార్థులతో తాము చదువుతున్న విద్య ఎంతవరకు ఉపయోగిస్తుంది. ఎలా వారు పోటీ పరీక్షలలో పాల్గొని తమ జీవనోపాధిని పొందవచ్చు అనే అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన 14 మందికి గౌరవ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండముది ప్రేమ్కుమార్కు పూర్వవిద్యార్థులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం

మెరుగు పెట్టకుండా రత్నం ప్రకాశవంతంకాదనీ, గురువులు మమ్మల్ని సానబెట్టి, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపక వృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు.  డా. యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు శ్రీయమ్ దినకర్ గారు విచ్చేశారు. విద్యార్థులకు తాము చదువుతున్న విద్య ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎలా వారు పోటీ పరీక్షల్లో పాల్గొని తమ జీవనోపాధిని పొందవచ్చు అన్న విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన 14 మందికి గౌరవ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రివెంటివ్ డిసీజ్ ఎవేర్నెస్ ప్రోగ్రాం

“కనిపించే ఈ దేవుళ్లను ప్రేమతో ఆరాధించండి” అని అమ్మ చెప్పిన మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ గారు. వీరు మెడికల్ ఫీల్డ్లో ఉంటూ తమ దగ్గరకు వచ్చిన రోగులను ఆదరించి వైద్యం చేయడం విశేషం. వీరు ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అమ్మ భక్తులైన శ్రీ బ్రహ్మాండం. రంగసాయి (అమెరికా) గారి సహాధ్యాయిని. అమ్మ గురించి రంగసాయి గారి మాటల్లో విని అమ్మను దర్శించాలనే కోరికతో జిల్లెళ్ళమూడి విచ్చేశారు. అంతేకాక అమ్మ స్వయంగా స్థాపించిన కళాశాలకు వచ్చి అధ్యాపకులతో కలిసి ఇక్కడ విశేషాలను గురించి తెలుసుకొన్నారు. విద్యార్థులతో మమేకమై వారితో సంభాషించారు. విద్యార్థులకు వివిధ రకాల వైద్య సలహాలు ఇచ్చారు. అమ్మ సేవలో ఉంటూ నిరంతరం విద్యనభ్యసించడం మీ పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభావేదికపై విశ్వజననీ పరిషత్ సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు మాట్లాడుతూ అమ్మపట్ల రంగసాయి గారికి అచంచలమైన భక్తి విశ్వాసాలకు నిదర్శనమే ఈ రోజు జ్ఞానప్రసూనాంబ గారి ఆగమనం అని తెలియజెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మృదులకు అభినందన కార్యక్రమము

18.09.2019న కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న చి. మృదుల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి శ్రీకొండముది రామకృష్ణగారి సాహిత్యం – సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పట్టాను పొందారు. ఈ సందర్భంగా విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు యమ్. దినకర్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధామవంశీ, అధ్యాపకులు తమ అభినందనలు తెలియజేశారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులుగారు మరియు కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి. వై. యన్. బాబుగారు శ్రీమతి మృదులగారికి శుభాకాంక్షలను తెలియజేశారు. అమ్మ శేషవస్త్రాలను అందించి ఆశీర్వదించారు.