by admin | Apr 1, 2020 | Samskrutha Sibhiram
సంస్కృతభాష మృతభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం తెలుసు కానీ సంభాషణ ద్వారానే భాష – అభివృద్ధి చెందుతుందని సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు అధ్యక్ష భాషణ చేస్తూ భూమినుండి ఆకాశం వరకు సంస్కృతం అణువణువునా వ్యాపించిందని, కళాశాలలో ప్రతి విద్యార్థి సంస్కృతంలో మాట్లాడగలగాలని అందుకు తగిన ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. కార్యక్రమానికి బెంగుళూరు నుండి సంభాషణ సందేశః అనే సంస్కృత మాసపత్రిక సంపాదకులు జనార్దన హెగ్దే గారు విచ్చేశారు.
by admin | Dec 2, 2019 | Samskrutha Sibhiram
సంస్కృత భాషను దశదిశలా వ్యాపింపజేయాలని, అందుకు సంస్కృతాన్ని అధ్యయనం చేసే మనమంతా. కృషిచేయాలని, ‘సంస్కృత భారతి’ ప్రాంత అధ్యక్షులైన శ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు పిలుపునిచ్చారు. 2.12.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో జరిగిన సభలో సంస్కృతభాషా ప్రాశస్త్యం గురించి విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంస్కృతంలో మాట్లాడాలని కోరారు. ఒక్కొక్క విద్యార్ధి ఐదుగురికి సంస్కృతం నేర్పుతూ అలా గ్రామంలోని వారందరిచేత సంస్కృతంలో మాట్లాడించాలని తద్వారా జిల్లెళ్ళమూడిని ‘అర్కపురి’ అని పిలిచేలా చేయాలనీ, పిలుపునిచ్చారు. అందుకు తమ సహాయ సహకారాలను అందించాలని డా॥ హనుమంతయ్య గారిని ఈ కార్యక్రమంలో కోరారు. సంస్కృత విభాగంలోని విద్యార్థులు పాల్గొన్నారు.

by admin | Jul 12, 2019 | Samskrutha Sibhiram
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సంస్కృత భాషదే అని విశ్వజననీ సంపాదకులు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులు గారు వివరించారు. జులై 12వ తేది శుక్రవారం కళాశాల ప్రార్థనా మందిరంలో జరిగిన సంస్కృత భాషా విబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ భాషలలో సంస్కృతానికి సముచిత స్థానం లభించడానికి ఆనాటి సంస్కృత వాఙ్మయమే ప్రధాన కారణము అని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ అయిన డాక్టర్ ఎ.వి సుధామవంశీ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబు మాట్లాడుతూ సంస్కృత భాషా శిబిరాలను తరచుగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రపంచాన్నే ఆకట్టుకన్న వేదాలు, ఉపనిషత్తులు సారస్వత వాఙ్మయం సంస్కృత భాషలోనే ఉందని వివరించారు. విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో సంస్కృతభాషను సమగ్రంగా నేర్చుకోవడానికి కృషి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు సంస్కృతంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తదనంతరం జరిగిన సంస్కృత శిబిర నిర్వహణ సభ్యులు పలువురు అభినందించారు. శిబిరంలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన విద్యార్థులందరికి శ్రీ ఆంజనేయప్రసాద్ గారు నగదు బహుమతి ఇచ్చారు.
by admin | Jun 8, 2019 | Samskrutha Sibhiram
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత భాషా శిబిరం జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంస్కృతపాఠశాల ఉపాధ్యాయులు శ్రీ పోలూరి శ్రీకాంత్ (సంస్కృత భారతి కార్యకర్త) సంస్కృత భాషా బోధకునిగా శిబిర చాలకునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యారంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సంస్కృత భాషను ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు. మహోన్నతమైన సంస్కృతభాష ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు గౌరవిస్తున్నాయని వివిధ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత అధ్యయన శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇదే వేదికపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేవభాషగా, మధురభాషగా, ప్రపంచభాషగా మహోన్నత స్థానంలో ఉన్న సంస్కృతానికి గత వైభవాన్ని సంతరించే బాధ్యత అందరిదీ అని ఆయన హితవు పలికారు. శ్రీ పోలరి శ్రీకాంత్ అధ్యయనం తరగతులు నిర్వహించారు.
by admin | Nov 2, 2018 | Samskrutha Sibhiram
జాతీయస్థాయి పోటీకి విద్యార్థిని ఎంపిక
2.11.2018 : తిరుపతి రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠంలో జరిగిన జాతీయ స్థాయి శాస్త్ర స్పర్ధలో జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల II పి.డి.సి (సంస్కృతం) విద్యార్థిని శ్యామాలిక ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామ వంశీ అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. అఖిల భారత శాస్త్ర స్పర్ధలో ఈనెల 2, 3 తారీకులలో తిరుపతిలో జరిగిన ఎంపిక పోటీలో శ్యామాలిక 2019 జనవరి 5 వ తేది నుండి త్రిపుర రాజధాని అగర్తలలో ప్రరంభమయ్యే ఈ పోటీలకు శ్యామాలిక ఎంపిక పట్ల సంస్థ పెద్దలు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు హర్షం వ్యక్తం చేశారు. కావ్య కంఠపాఠం (కుమార సంభవము) పై ఈ పోటీ జరగనున్నట్లు తిరుపతి సంస్కృతి విద్యాపీఠం వారు స్పష్టం చేశారు.