by admin | Nov 19, 2019 | Plastic Awarness
ప్లాస్టిక్ నివారణపై మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలోని అధ్యాపకులు, విద్యార్థులు అంతా కలసి జిల్లెళ్ళమూడి గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు “ప్లాస్టిక్ ను వీడండి – ప్రకృతిని కాపాడండి”, ప్లాస్టిక్ వద్దు – పేపర్ ముద్దు” అనే నినాదాలతో గ్రామ ప్రజల్లో చైతన్యం కలిగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఈ కార్యక్రమం మన కళాశాలలో నిర్వహించాయి.
by admin | Nov 12, 2019 | Awarness Programs
“కనిపించే ఈ దేవుళ్లను ప్రేమతో ఆరాధించండి” అని అమ్మ చెప్పిన మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ గారు. వీరు మెడికల్ ఫీల్డ్లో ఉంటూ తమ దగ్గరకు వచ్చిన రోగులను ఆదరించి వైద్యం చేయడం విశేషం. వీరు ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అమ్మ భక్తులైన శ్రీ బ్రహ్మాండం. రంగసాయి (అమెరికా) గారి సహాధ్యాయిని. అమ్మ గురించి రంగసాయి గారి మాటల్లో విని అమ్మను దర్శించాలనే కోరికతో జిల్లెళ్ళమూడి విచ్చేశారు. అంతేకాక అమ్మ స్వయంగా స్థాపించిన కళాశాలకు వచ్చి అధ్యాపకులతో కలిసి ఇక్కడ విశేషాలను గురించి తెలుసుకొన్నారు. విద్యార్థులతో మమేకమై వారితో సంభాషించారు. విద్యార్థులకు వివిధ రకాల వైద్య సలహాలు ఇచ్చారు. అమ్మ సేవలో ఉంటూ నిరంతరం విద్యనభ్యసించడం మీ పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభావేదికపై విశ్వజననీ పరిషత్ సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు మాట్లాడుతూ అమ్మపట్ల రంగసాయి గారికి అచంచలమైన భక్తి విశ్వాసాలకు నిదర్శనమే ఈ రోజు జ్ఞానప్రసూనాంబ గారి ఆగమనం అని తెలియజెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
by admin | Aug 9, 2019 | Awarness Programs
సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో శబ్దకాలుష్యం నానాటికీ అధికమవుతూ అగ్రస్థానంలో ఉందని కాలుష్య నివారణలోనూ, ఆరోగ్య సాధనలోనూ యోగ విభాగానికి ప్రాధాన్యము లభిస్తున్నట్లు వివరించారు. శబ్దం శ్రవణ సుఖంగా సుభగంగా ఉండాలని సంగీతశాస్త్రం మానవజాతి వికాసంలో భాగం కావాలని ఆయన హితవు పలికారు. కర్ణభేరిని బ్రద్దలు చేసే విపరీత శబ్దాలకు మాధుర్యం ఉండదని సోదాహరణంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
by admin | Jun 9, 2019 | Awarness Programs
సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డా॥కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లాళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో శబ్ద కాలుష్యం నానాటికీ అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ సుధామ వంశీ అధ్యక్షత వహించారు. కాలుష్య నివారణలో, ఆరోగ్య సాధనలో యోగా విభాగానికి ప్రాధాన్యము లభిస్తున్నట్లు డా॥ కె. సత్యమూర్తి వివరించారు. సంగీతశాస్త్రం మానవ జాతి వికాసంలో భాగం కావాలని ఆయన హితవు పలికారు. కర్ణభేరిని బద్దలు చేసే విపరీత శబ్దాలకు మాధుర్యం ఉండదని డా.కె. సూర్యమూర్తి సోదాహరణంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు
by admin | Feb 23, 2019 | Awarness Programs
23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఫిబ్రవరి 23వ తేదీన శనివారం జరిగిన సభలో శ్రీ దినకర్ సంస్థ ప్రెసిడెంట్ బి. రామబ్రహ్మంగారు కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ జయంత్ చక్రవర్తి ఈ సభలో పిల్లలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ ఎ.హనుమత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ డిగ్రీస్థాయి విద్యార్థులు ప్రతీ అంశాన్నీ కంఠస్థం చేస్తేనే దేనికైనా సమాధానాన్ని వ్రాయగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
by admin | Feb 23, 2019 | Awarness Programs
23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పేద విద్యార్థులకు ఉచిత విద్య భోజన సదుపాయాలను కల్పించడమే కాకుండా వారికి ఉజ్జ్వలమైన భవిష్యత్తును అందించే విధంగా ప్రయత్నిస్తుంది. విద్యనభ్యసించి పై చదువులు చదవలేని వారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తమ స్వయం ప్రతిపత్తితో చదువుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. దీనిలో భాగంగా గుంటూరు మాస్టర్మైండ్స్ కళాశాల నుండి అకాడమిక్ ఇన్చార్జ్ విజయకుమార్, ప్రిన్సిపాల్ పి.సుబ్రహ్మణ్యం గారు Earn while learning కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులు జూనియర్ కళాశాలలో పనిచేస్తూ పి.జి. చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకుగాను Final year విద్యార్థులను campus selection లా తీసుకోవడం జరుగుతోంది అన్నారు.