Independence Day

79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెలమూడి లో ఆగస్టు 16వ తేదీన ఘనముగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా SVJP Trust Honorary   chairman శ్రీ  M. దినకర్ గారు విచ్చేసి పతాకావిష్కరణ చేయడం జరిగింది. సభాధ్యక్షులైన కళాశాల అకడమిక్ & అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ శ్రీ జి. గోవిందరాజులు గారు మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల  త్యాగాలను కొనియాడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ ఎం. దినకర్ గారు తమ ప్రసంగంలో ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న విధానాన్ని కొనియాడారు .అనంతరం విద్యార్థిని విద్యార్థులు స్వీయ స్వాతంత్ర దినోత్సవ అభిప్రాయాలను తెలియజేశారు. కళాశాల చారిత్రక అధ్యాపకులు శ్రీ పి సుందర్ రావు గారు భారత  దేశం స్వాతంత్ర్యమును పొందిన విధానాన్ని వివరించారు. అనంతరం ఎకడమిక్ పరంగా ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు దాతలు అందించిన నగదు పురస్కారములను అందించుట జరిగింది. ఈ  కార్యక్రమంలో SVJP Trust managing Trustee శ్రీ V. ప్రేమ్ రాజుగారు , SVJP ట్రస్ట్ పూర్వ సభ్యులు శ్రీ డి కామరాజు గారు, శ్రీ I .రామకృష్ణ గారు, జిల్లెలమూడి ex VRO  శ్రీ డి. శ్యాం ప్రసాద్ గారు, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సబానిర్వహణ సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ RVNSS వరప్రసాద్ గారు నిర్వహించగా వందన సమర్పణ తెలుగు అధ్యాపకులు శ్రీ టి. జయకృష్ణ గారు నిర్వహించగా శాంతి మంత్రముతో కార్యక్రమం జరిగింది.