by admin | Jan 7, 2020 | Sports
నాన్నగారికి ఎంతో ఇష్టమైన క్రీడలను ప్రతి ఏడాది కళాశాలలో నిర్వహిస్తూ ఉండడం విదితమే. అందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 7,8,9 తేదీలలో ఆటలపోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి దేశరాజు కామరాజు గారు, వై.వి. శ్రీరామ్మూర్తి గారు ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు ఆధ్వర్యం వహించారు.నెల్లూరు- ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణరాజు పోటీ విధానాలను సూచించారు. ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు విజేతలైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులందరూ ఆటలలో పాల్గొనాలని చెప్పారు. మానసిక, శారీరక ఆరోగ్యం క్రీడల వల్ల పెంపొందుతుందని తెలిపారు.
by admin | Jan 7, 2020 | Sports
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్లమూడిలో జనవరి 7,8,9తేదీలలో విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి వై.వి. శ్రీరామమూర్తిగారు ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు లక్కరాజు. సత్యన్నారాయణలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అధ్యాపకులు రాంబాబు, ఎ. హనుమత్ ప్రసాద్, వి.రోషన్, మురళీ, వర ప్రసాద్ గారు తమ సహకారం అందించారు. విజేతలకు ప్రిన్సిపాల్ గారు బహుమతులను అందజేశారు.
by admin | Jan 7, 2020 | Sports
నాన్నగారికి ఎంతో ఇష్టమైన క్రీడలను ప్రతి ఏడాది కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 7,8,9 తేదీలలో ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి దేశిరాజు కామరాజు గారు, వై. వి. శ్రీరామ్మూర్తి గారు ప్రారంభించారు. ఈ పోటీలకు నెల్లూరు ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణరాజు గారు పోటీ విధానాలను సూచించారు. ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి పోటీలను నిర్వహించారు.
by admin | Dec 20, 2019 | Student Competions
ప్రపంచీకరణంలో పరుగులు తీస్తున యువత అన్ని రంగాలలో జ్ఞానాన్ని సంపాదించాలని ప్రతి సంవత్సరం. డిసెంబర్ నెలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులలో దాగివున్న విద్యుత్ కాంతులను ప్రశ్నల ద్వారా బహిర్గతం చేసి వారిని పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండేలాగా చేయాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య గారు పిలుపునిచ్చారు. ఈ క్విజ్ పోటీలను 20.12.19 వ తేది శుక్రవారం ప్రిన్సిపాల్ గారు ప్రారంభించగా అధ్యాపకులు దానిని కొనసాగించారు. కార్యక్రమం చివరన విజేతలను ప్రకటించారు.
by admin | Dec 20, 2019 | Awarness Programs