డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం

నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న “పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో, గురువుల క్రమశిక్షణలో విద్యాధికులై దశదిశలా వ్యాపించి అమ్మ తత్త్వ సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న (అ) పూర్వ విద్యార్థులు మాతృసంస్థలకు మూలస్థంభాలు లాంటివారని కొనియాడారు

డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం

నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న “పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో, గురువుల క్రమశిక్షణలో విద్యాధికులై దశదిశలా వ్యాపించి అమ్మ తత్త్వ సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న (అ) పూర్వ విద్యార్థులు మాతృసంస్థలకు మూలస్థంభాలు లాంటివారని కొనియాడారు.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మానవతా విలువలు

చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం ‘ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న’ అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు మానవతా విలువలకు అద్దం పట్టేవనేకం జిల్లెళ్ళమూడిలో దర్శనమిస్తుంటాయి.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మానవతా విలువలు

చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం ‘ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న’ అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు మానవతా విలువలకు అద్దం పట్టేవనేకం జిల్లెళ్ళమూడిలో దర్శనమిస్తుంటాయి

అమరజీవికి ఘన నివాళులు

ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణాలు సైతం లెక్కచేయక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 15.12.19 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాట్లాడుతూ అంతరాలు లేని జీవితం అందరికీ అందాలని కలలుకన్న ప్రాణత్యాగి పొట్టి శ్రీరాములు గారని తెలియజేశారు. లక్షమందిని ఏక పంక్తిన భోజనం చేస్తే చూడాలనుకున్న అమ్మ ఆశయం మహాద్భుతమైనదని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. విశ్రాంత ప్రిన్సిపల్ గారు డా॥ బి.ఎల్.సుగుణ, అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్యగారు భక్తిప్రపత్తులతో శ్రీరాములుగారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు