by admin | Aug 15, 2023 | Book Donations
I. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి స్మారక బహుమతి:
Ist PDC, IInd PDC లలో సంస్కృతంలో అత్యధిక మార్కులు వచ్చిన వారికి రూ. 1000/- ల నగదు బహుమతి. (ఒక్కొక్కరికి 500, రూ.లు చొప్పున) (2,500)
PDC II Sub Skt – I = R.Sasi Rekha = 500/-
PDC II Sub Tel – I = S.Devi = 500/-
శ్రీ అధరాపురపు శేషగిరి రావు స్మారక బహుమతి 1000/- రూ.లు. చొప్పున. – పేద విద్యార్థికి మరియు ఉత్తమ విద్యార్థికి
P. Lakshmaiah PDC II Telugu – 1000/-
III. శ్రీమతి గొట్టిపాటి విజయలక్ష్మి భవాని మరియు హరి గార్లు పేద విద్యార్థుల కొరకు – 900/- రూ.ల నగదు బహుమతి. Ph.No = 7337526951
1) BA II Sem Skt – Chari = 450/-
2) B.AI Sem Tel = Rama = 450/-
IV. తల్లాప్రగడ వెంకట్రావు శ్రీమతి సావిత్రమ్మ గార్ల స్మారక విశేష ప్రతిభా పురస్కారమునకుగాను తల్లాప్రగడ లక్ష్మీపతి గారు 50000/- రూ.ల పై వచ్చే వడ్డీ ఫైనలియర్ పూర్తి అయ్యి అత్యధిక మార్కులు సాధించిన
విద్యార్థులకు. కేటాయించబడినది. (2 x 1250) – Ph.No = 9440661960
III – Total First Telugu = I M. Sravani = 1250/-
III – Total First Sanskrit = I K. Vasantha Kumari = 1250/-
V. గిరీష్ కుమార్ గారు రూ.20,000 ల పై వచ్చే వడ్డీని అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్ధినీ విద్యార్థులకు కేటాయించారు. (1000/-) Ph.No = 9820216148
IInd Year Total First Telugu – I = K. Thulasi = 500/-
IInd Year Total First Sanskrit – I= B. Satyavani =500/-
VI. శ్రీ తంగిరాల సత్యనారాయణగారు, శ్రీమతి దమయంతిగారు, మరియు శ్రీ సోమయాజుల రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్ల స్మారక చిహ్నంగా, శ్రీయుతులు తంగిరాల రామమోహనరావు గారు విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే బహుమతి. 2500/- (416 × 3) Ph. No = 9848591981.
1) PDC — II Tel = Shahit = 416/-
2) B.A II Sem Skt = G. Haresh Guptha = 416/-
3) B.A IV Sem Skt = Mani Kumar = 416/-
VII. శ్రీమతి ఆకెళ్ల మాణిక్యాంబ గారి స్మారక చిహ్నంగా వారి కుమారుడు ఆకెళ్ల రవి శంకర్ గారు 25000/- రూ.ల పై వచ్చే వడ్డీ పేద మరియు విధేయ విద్యార్థినీ, విద్యార్థులకు ఇచ్చే నగదు. (416 × 3)=1250/- Ph.No = 9848591981.
1) B.A I Sem Tel = MastanBee = 416/-
2) B.A II Sem Tel = Sk. Muktharunnisa = 416/-
3) B,A II Sem Tel = Jhansi = 416/-
VIII. కీ.శే శ్రీమతి పమిడిబోయిన లీలా వెంకట ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు రోషన్ కుమార్ గారు కంప్యూటర్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సంపాదించిన తెలుగు -I, II సంస్కృత -I,II విభాగములోని ఇద్దరు విద్యార్థులకు నగదు బహుమతి.
(4 x 750)=3000 – Ph.No 9963395311.
Telugu – 1) M. Sravani = 750/-
Sanskrit – 1) S. Anil = 750/-
2) K. Anjani = 750/-
2) K.Simha Reddy = 750/-
by admin | Oct 1, 2020 | Regular Practice
ఎవరు లక్ష్యసిద్ధిని కలిగిస్తే వాడే గురువు అనే అమ్మ వాక్యాన్ని అక్షరసత్యం చేస్తూ ప్రతి విద్యార్థీ ఎదగడానికి కావలసిన పునాదిని మొగ్గ దశలోనే ఏర్పడేటట్లు చేయాలని ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు పేర్కొన్నారు. అమ్మ- నాన్నల ప్రేమే ప్రగతికి మూలం అన్న, అమ్మ సూక్తికి అనుగుణంగా వారి అడుగు జాడలలో నడుస్తూ ప్రతి ఒక్క విద్యార్థీ ఎదగాలని కాంక్షించారు. 10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్ధనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్ కమిటీ సభ్యులు బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సభ ప్రారంభంలో ఒక్కో విద్యార్థిని వారి తల్లిదండ్రులతో కలిసి వేదికపైకి రావాలని ఆహ్వానించారు. మనకు రెండురకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండు ఎలా జీవించాలో నేర్పేది. అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యను అందిస్తున్నామని బొప్పూడి రామబ్రహ్మం గారు తెలియజేశారు. విద్యార్ధినీ, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇక్కడ చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కళాశాలలో ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుందనే విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్ గారు దానికి స్పందిస్తూ పేరెంట్స్ సూచించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్ధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
by admin | Aug 26, 2020 | Alumni Interaction
శ్రీ జి.వై.యన్.బాబు విద్యాపరిషత్ కరస్పాండెంట్ గా చేస్తూ ఆకస్మికంగా 12.8.2000న అమ్మలో కలసిపోయిన సందర్భంలో శ్రీ విశ్వజననీపరిషత్ ఎగ్జిక్యూటీవ్ బాడీ 26 8. 2020 బుధవారం సమావేశమై కాలేజి పూర్వవిద్యార్థిని కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణను కరస్పాండెంట్గా పరిషత్ మిగిలిన సమయానికి ఏకగ్రీవంగా ‘నిర్ణయించడమైనది. గమనించగలరు.
by admin | Dec 19, 2019 | Alumni
నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న “పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో, గురువుల క్రమశిక్షణలో విద్యాధికులై దశదిశలా వ్యాపించి అమ్మ తత్త్వ సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న (అ) పూర్వ విద్యార్థులు మాతృసంస్థలకు మూలస్థంభాలు లాంటివారని కొనియాడారు
by admin | Dec 19, 2019 | Alumni Interaction
నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న “పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో, గురువుల క్రమశిక్షణలో విద్యాధికులై దశదిశలా వ్యాపించి అమ్మ తత్త్వ సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న (అ) పూర్వ విద్యార్థులు మాతృసంస్థలకు మూలస్థంభాలు లాంటివారని కొనియాడారు.
by admin | Dec 12, 2019 | Alumni Interaction
“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగాలని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య ఆశించారు. ప్రిన్సిపాల్ గారు నూతనంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందిస్తూ కొంతమంది కళాశాల పూర్వ విద్యార్థి సంఘం తరపున వారి సహకారాన్ని అందిస్తామని మాట ఇస్తూ తొలుతగా రూ. 2000/ నగదును ప్రిన్సిపాల్ గారికి అందజేశారు.