by admin | Dec 28, 2018 | Awarness Programs
పాఠ్యగ్రంథాలతో పాటు నైతిక, ధార్మిక విలువలను పెంపొందించే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా విద్యార్థులు సాధించుకోవాలని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు హితవు పలికారు. డిసెంబరు 28న జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా నానాటికీ అభివృద్ధి చెందుతున్నదని ఆయన తెలిపారు. ఈ సభలో విజయవంతంగా విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన రామబ్రహ్మంగారికి శ్రీ సుధామ వంశీగారు అభినందనలు తెలిపారు.
by admin | Dec 28, 2018 | Awarness Programs
ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని, దాని ఆవశ్యకతను తెలుసుకోవాలని బొప్పూడి రామబ్రహ్మంగారు సూచించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, ఉభయపరిషత్తుల అభ్యర్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. డిసెంబరులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో బి.రామబ్రహ్మంగారికి అభినందనలు తెలిపారు.
by admin | Dec 6, 2018 | Vanam - Manam
కార్తీక వనమహోత్సవ సందర్భంగా డిసెంబరు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశి మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకల సంప్రదాయాల పరిరక్షణ పరస్పరం సహకారం, మైత్రీభావాలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్.సుగుణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సంస్థ పెద్దలు వల్లూరి రమేష్ తదితరులు తమ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలంకారణ, శ్రీ దామోదర గణపతికి పుష్పమాలాంకరణ నిర్వహించి నమస్కృతులు సమర్పించారు. ఉత్తమ ఫలితాలు సాధించడం లక్ష్యంగా విద్యార్థులు నిరంతర అధ్యయనానికి పూనుకోవాలని హితవు పలికారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు మాట్లాడుతూ అందరికీ తమ ధన్యవాదాలు తెలిపారు.
by admin | Dec 6, 2018 | Vanam - Manam
కార్తీక వనమహోత్సవం సందర్భంగా డిసెంబరు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధాము వంశీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను వివరించారు. ఇలాంటి వేడుకలు సంప్రదాయ, పరస్పర సహకార, మైత్రి భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ డా. బి.ఎల్. సుగుణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సంస్థ పెద్దలు రమేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి సమస్కృతులు సమర్పించారు. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు
by admin | Nov 24, 2018 | Student Competions
24.11.2018: గుంటూరు జిల్లా ఖాజీపాలెం K.V.R, K.V.R & M.K.R కళాశాలలో నవంబర్ 24 వ తేదీన జరిగిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీలలో జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాళాశాల విద్యార్ధినులు ఎ. మనీషా, టి.వి.ఎస్.నాగలక్ష్మి, కె. శోభనా సులభాగతి, వి. శ్రావణి పాల్గొని శ్రోతల ప్రశంసలు పొందారు. ఈ వేదిక పై మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి ఎల్.మృదుల పాల్గొని జ్యోతి ప్రజ్వలన నిర్వహించి తమకు సహకరించటం పట్ల ఖాజీపాలెం ప్రిన్సిపాల్ శ్రీ కృష్ణంరాజు, విశ్రాంత ప్రిన్సిపాల్ రామరాజు పలువురు అధ్యాపకులు తమ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి బహుమతి ప్రదాతగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి. బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని జిళ్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినుల పద్యగానాన్ని ప్రత్యేకంగా అభినందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కళాశాల I B.A Tel. విద్యార్ధిని కె. శోభనా సులభాగతి పద్యగానాన్ని అభినందిస్తూ పుష్పగుచ్ఛాన్ని ఉపసభాపతి అందించి శుభాశీస్సులు తెలిపారు.