by admin | Jul 10, 2023 | Uncategorized
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 27 వరకు విద్యార్థినీ, విద్యార్థులకు సంగీత శిక్షణా కార్యక్రమం జరిగింది. సంస్థ పెద్దలు, అమ్మభక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాదరావు ఈ సంగీత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా. జూలై 28 వ తేదీన అన్నపూర్ణాలయం సమావేశ మందిరంలో విద్యార్థినీ, విద్యార్థులు సంగీత కార్యక్రమం నిర్వహించి అమ్మ భక్తి గీతాలను గానం చేశారు. సంగీతం శ్రోతలను అలరించడంతో పాటు ఆనందాన్ని అనుభూతిని అందిస్తుందని సంగీత శిక్షకులు రావూరి ప్రసాదరావు వివరించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, సంస్థ పెద్దలు, వసుంధరక్కయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.యల్ సుగుణ, శ్రీ యమ్. దినకర్, శ్రీ వి. రామచంద్ర, కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ శిక్షణ ఇచ్చిన అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాదును “ఘనంగా సత్కరించారు. ఈ సంగీత శిక్షణను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్ సుగుణ, సంస్థ స్థానిక కార్యదర్శి శ్రీ.వి.రావు- “చంద్రను అభినందించి ఘనంగా సత్కరించారు
by admin | Jun 30, 2023 | Awarness Programs
2022-23 faculty development program లో భాగంగా కళాశాల అధ్యాపకులకు (1st బ్యాచ్) కంప్యూటర్ నాలెడ్జ్ కోసం MS OFFICE తరగతులు ది 30.06.2023 సాయంత్రం గం 4.30 లకు మన కళాశాల కంప్యూటర్ లాబ్ లో ఇచ్చారు. కంప్యూటర్ లెక్చరర్ శ్రీ డి.ప్రవీణ్ గారు శిక్షణ ఇచ్చారు.
by admin | Jun 15, 2023 | Orientation Programm
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ (ఇన్ ఛార్జ్) పదవికి సంస్కృత అధ్యాపకులు డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారిని నియమిస్తూ కళాశాల పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకం 2023 జూన్ 5వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.
కళాశాల కరస్పాండెంటుగా మన కళాశాల పూర్వ విద్యార్థి (1980-1985), పూర్వ విద్యార్ధి సమితి అధ్యక్షులు శ్రీ గోగినేని రాఘవేంద్ర రావుగారిని పాలక వర్గం ఎంపిక చేసింది. శ్రీ రాఘవేంద్రరావుగారు 2023 జూన్ 26వ తేదీన ఈ బాధ్యతను స్వీకరించారు.
అమ్మ దివ్యానుగ్రహంతో డా. హనుమత్ ప్రసాద్ గారి సారథ్యంలో, శ్రీ రాఘవేంద్రరావుగారి నాయకత్వంలో కళాశాల అభ్యుదయపథంలో పురోగమించ గలదని ఆకాంక్షిస్తూ..
హనుమత్ ప్రసాద్ గారికీ శ్రీ రాఘవేంద్ర రావుగారికీ అభినందన పూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాము.
by admin | Jun 5, 2023 | Plastic Awarness
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6వ తేదీ మంగళవారం *ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ* అనే నినాదంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల NSS UNIT తరపున జరిగిన ఈ సభను NSS కో ఆర్డినేటర్ జి. రాంబాబు గారు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదానం. హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ గారు అధ్యక్ష భాషణను చేస్తూ పాంచభౌతికమైన ఈ శరీరం ప్రకృతితో మమేకమై ఉన్నదని కనుక ప్రకృతి పరిరక్షణ మనందరి కర్తవ్యం అని తెలిపారు. జి. రాంబాబు గారు మాట్లాడుతూ 1972 నుండి జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవంగా మనం గత ఐదు దశాబ్దాలుగా జరుపుకుంటున్నామని కనుక ఈ రోజున ప్రతిపాదించిన అంశాలను మనందరం ఆచరణలో పెట్టగలిగితేనే భావితరాల వారికి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని తెలిపారు. అనంతరం కె. సత్యమూర్తి గారు మాట్లాడుతూ పర్యావరణానికి సంబంధించిన అధ్యయనాలు యూజీ స్థాయి విద్యార్థులకు 2005 నుండి అమలు పరచడం ముదావహమని అవి సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయని వివరించారు. డా. యల్. మృదుల గారు మాట్లాడుతూ ఏదైనా సందర్భంలో మనం ఒక చెట్టు నరకవలసి వస్తే పది చెట్లను నాటాలని అప్పుడే ప్రకృతి విధ్వంసానికి అడ్డుకట్ట వేయగలమని సూచించారు. ఎం. కవిత గారు ప్రసంగిస్తూ ప్రతి ఏడాది జరుపుకునే పర్యావరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం *ఎ సొల్యూషన్ టు ప్లాస్టిక్* అనే Theam తో UNED సంస్థ ముందుకు వెళుతుందని తెలిపారు. ఆర్. వరప్రసాద్ గారు మానవున్ని అల్పాయుష్కునిగా చేయడంలో పర్యావరణం ప్రధాన పాత్ర వహిస్తుందని కలుషిత పర్యావరణంయ అనేది ప్రాణికోటి మనుగడకు ముప్పు తీసుకురాబోతుందని కనుక మనమంతా పర్యావరణాన్ని రక్షించడంలో మన వంతు కృషి చేయాలని చేద్దామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నినాదాల తో కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లెళ్ళమూడి గ్రామ ప్రజలకు చైతన్యాన్ని కలిగించేలా ముందుకు సాగారు.
by admin | Jun 5, 2023 | Orientation Programm
కళాశాల పునఃప్రారంభం : 2023-24 విద్యా సంవత్సరంకి గాను 5-06-2023 సోమవారం ఉదయం అమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్వజననీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర కుమార్ గారు, టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ యమ్. దినకర్ గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారు మరియు అధ్యాపక బృందం విద్యార్థినీ విద్యార్థులతో కలిసి లలితా సహస్రనామ పారాయణ చేశారు. అమ్మ తీర్థప్రసాదాలు స్వీకరించి కళాశాల పురోభివృద్ధికి అందరి తోడ్పాటు అవసరమని ప్రిన్సిపాల్గారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ : జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6వ తేదీ మంగళవారం ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ అనే నినాదంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల NSS UNIT తరపున జరిగిన ఈ సభను NSS కో ఆర్డినేటర్ జి. రాంబాబు గారు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్గారు అధ్యక్ష భాషణను చేస్తూ పాంచభౌతికమైన ఈ శరీరం ప్రకృతితో మమేకమై ఉన్నదని కనుక ప్రకృతి పరిరక్షణ మనందరి కర్తవ్యం అని తెలిపారు. శ్రీ జి. రాంబాబు, శ్రీ కె.సత్యమూర్తి, డా.యల్.మృదుల, శ్రీమతి ఎమ్.కవిత, శ్రీ ఆర్.వరప్రసాద్ ప్రభృతులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను విశదీకరించారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నినాదాలతో కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లెళ్ళమూడి గ్రామ ప్రజలకు చైతన్యాన్ని కలిగించేలా ముందుకు సాగారు