Telugu Bhasha Dinothsavam

Telugu Bhasha Dinothsavam

Telugu Bhasha Dinothsavam

త్రిమూర్త్యాత్మకమైన అమ్మ నడియాడిన అర్కపురి సరస్వతీ క్షేత్రం అని కందుకూరి సత్య సూర్యనారాయణ గారు అన్నారు.
ఆగస్టు 29 మంగళవారం ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గిడుగు రామ్మూర్తి పంతులు గారి 160 వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ సభా కార్యక్రమం జరిగింది.
ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యనారాయణ గారు ప్రసంగిస్తూ వేదవాఙ్మయాన్ని, లౌకిక వాఙ్మయాన్ని అందించిన ఋషుల జ్ఞాన భాండాగారాన్ని నన్నయ భారతాంథ్రీకరణంతో, ప్రబంధకవుల రచనలతో పండితులు తెలుగు పదజాలాన్ని జనావళిలోకి తీసుకురాగలిగారు.  పండిత పామర జనరంజకం గా ఉండేలా గిడుగు వారు చేసిన భాషా ఉద్యమం ఆందరికీ స్పూర్తిదాయకమని కొనియాడారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్ష భాషణ చేస్తూ భాషా పరిరక్షణ ఓరియంటల్ కళాశాలల పై ఉందని అందుకు తగిన వారసులు గా మన విద్యార్థులు విద్యను అభ్యసించాలని కోరారు.
అనంతరం తెలుగు అధ్యాపకులు పి. మధుసూదనరావు గారు మాట్లాడుతూ వ్యవహారభాష గ్రంథస్థం చేసిన ఘనత గిడుగు వారిదని చెప్పారు.
బి. శక్తిధర్ గారు ముఖ్య అతిథి సూర్యనారాయణ గారి సంక్షిప్త పరిచయం చేస్తూ పుంభావ సరస్వతి గా సంస్కృతాంధ్ర భాషా పండితులు గా వారు ఆంధ్ర నాట ఘన కీర్తిని పొందారని తెలిపారు.
అధ్యాపకులు ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు తెలుగు పద్యాలాపన తో, ప్రసంగాలతో, నృత్య ప్రదర్శనలతో గిడుగు వారి కృషిని తెలుగు లోని మాధుర్యాన్ని చవిచూపారు. తెలుగు శాఖ అధ్యక్షురాలు డాక్టర్ లక్కవరపు మృదుల సభానిర్వహణ చేయగా వీరాంజనేయులు వందన సమర్పణ చేశారు.
శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2023 ఆగస్టు 25,26 శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు Life Skills and Personality Development Program లో భాగంగా బెంగుళూరు Wavicle – Inner Holistic Solutions నుండి Nirav Advaya, Ananda Urja లు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్య కేవలం విద్యా విషయక ఙ్ఞానం మాత్రమే కాకుండా జీవితానికి సిద్ధం చేయడం అనే ఆలోచన తో కళాశాల మేనేజింగ్ కమిటీ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా వ్యక్తిగత అభివృద్ధి మెరుగైన కమ్యూనికేషన్, బెటర్ డెసిషన్ మేకింగ్  హోలిస్టిక్ అప్రోచ్ అంశాలతో ట్రైనింగ్ అందించారు.

Recent Events

అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

అంబేద్కర్ జయంతి వారోత్సవాలు అంబేద్కర్ 134వ జయంతి వారోత్సవాలు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు 'రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర' అనే అంశంపై వక్తృత్వం, వ్యాసరచన పోటీలు జరిగాయి. అనంతరం జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎ....

read more
CAREER OPPORTUNITIES AND STRATEGIES  FOR UPSC AND COMPITATIVE EXAMS

CAREER OPPORTUNITIES AND STRATEGIES FOR UPSC AND COMPITATIVE EXAMS

ది 07.04.2025 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి లో IQAC, Career guidance and placement cell ఆధ్వర్యంలో “CAREER OPPRTUNITIES AND STRATEGIES FOR UPSC AND COMPITATIVE EXAMS” అనే అంశంపై ప్రముఖ IAS OFFICER శ్రీ హెచ్.పీ. రాజు గారు మార్గదర్శనం చేశారు....

read more
DRUG AWARENESS PROGRAM

DRUG AWARENESS PROGRAM

DRUG AWARENESS PROGRAM మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి లో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో March 19 20 25 న డ్రగ్ పై అవగాహన మరియు దుర్వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సభలో ప్రిన్సిపల్ డా. A.హనుమత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్థుల మాదకద్రవ్యాలకు దూరంగా...

read more
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర COMMISSIONER OF COLLEGIATE EDUCATION మంగళగిరి వారి ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 15.03.2025 శనివారం AVOID SUPs PROMOTE REUSABLES...

read more
అంతర్జాతీయ మహిళా దినోత్సవం | International Women’s Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం | International Women’s Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం             అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది 7.3.2025 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభా కార్యక్రమం జరిగింది. ఈ సభకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ Dr. L. మృదుల అధ్యక్షత వహించారు. మహిళా సాధికారతను గురించి వివరించారు. ముఖ్య అతిథిగా కళాశాల...

read more
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం

అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం

అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభాకార్యక్రమం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అయినాల...

read more
బాలికల మరియు బాలుర వసతి గృహములలో అమ్మ ఆగమనోత్సవం

బాలికల మరియు బాలుర వసతి గృహములలో అమ్మ ఆగమనోత్సవం

బాలికల మరియు బాలుర వసతి గృహములలో అమ్మ ఆగమనోత్సవం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో ఫిబ్రవరి 20, 2025 బుధవారం అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది. విద్యార్థినులు పచ్చని తోరణాలతో రంగవల్లులతో పుష్పాలతో అలంకరణలు చేసి అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. కార్యక్రమంలో...

read more
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు commissioner of Collegiate Education మంగళగిరి వారు స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా పరిశుభ్రత, పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించేలా ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు చేపట్టవలసిందిగా...

read more
National Deworming Day

National Deworming Day

10.02.2025 సోమవారం National Deworming Day సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో WOMEN EMPOWERMENT CELL తరపున Health Care Program జరిగింది. జిల్లెళ్ళమూడి గ్రామ ఆశావర్కర్ శ్రీలక్ష్మి మరియు నర్స్ మానసలు విద్యార్థులకు నులిపురుగు మందు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా....

read more
క్రీడోత్సవాలు

క్రీడోత్సవాలు

క్రీడోత్సవాలు ఫిబ్రవరి 17, నాన్నగారి ఆరాధనోత్సవాల సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు నాన్నగారికి ఎంతో ఇష్టమైన క్రీడలలో జనవరి 30,31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో వివిధరకాల ఆటలపోటీలను నిర్వహించారు. జనవరి 30 వ తేదీ గురువారం SVJP TRUST సభ్యులు శ్రీ...

read more

ఆగస్టు 15, విద్యార్థులకు ఉపకార వేతనముల పంపిణీ – 2023 2024

I. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి స్మారక బహుమతి:
Ist PDC, IInd PDC లలో సంస్కృతంలో అత్యధిక మార్కులు వచ్చిన వారికి రూ. 1000/- ల నగదు బహుమతి. (ఒక్కొక్కరికి 500, రూ.లు చొప్పున) (2,500)
PDC II Sub Skt – I = R.Sasi Rekha = 500/-
PDC II Sub Tel – I = S.Devi = 500/-
శ్రీ అధరాపురపు శేషగిరి రావు స్మారక బహుమతి 1000/- రూ.లు. చొప్పున. – పేద విద్యార్థికి మరియు ఉత్తమ విద్యార్థికి
P. Lakshmaiah PDC II Telugu – 1000/-
III. శ్రీమతి గొట్టిపాటి విజయలక్ష్మి భవాని మరియు హరి గార్లు పేద విద్యార్థుల కొరకు – 900/- రూ.ల నగదు బహుమతి. Ph.No = 7337526951
1) BA II Sem Skt – Chari = 450/-
2) B.AI Sem Tel = Rama = 450/-
IV. తల్లాప్రగడ వెంకట్రావు శ్రీమతి సావిత్రమ్మ గార్ల స్మారక విశేష ప్రతిభా పురస్కారమునకుగాను తల్లాప్రగడ లక్ష్మీపతి గారు 50000/- రూ.ల పై వచ్చే వడ్డీ ఫైనలియర్ పూర్తి అయ్యి అత్యధిక మార్కులు సాధించిన
విద్యార్థులకు. కేటాయించబడినది. (2 x 1250) – Ph.No = 9440661960
III – Total First Telugu = I M. Sravani = 1250/-
III – Total First Sanskrit = I K. Vasantha Kumari = 1250/-
V. గిరీష్ కుమార్ గారు రూ.20,000 ల పై వచ్చే వడ్డీని అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్ధినీ విద్యార్థులకు కేటాయించారు. (1000/-) Ph.No = 9820216148
IInd Year Total First Telugu – I = K. Thulasi = 500/-
IInd Year Total First Sanskrit – I= B. Satyavani =500/-

VI. శ్రీ తంగిరాల సత్యనారాయణగారు, శ్రీమతి దమయంతిగారు, మరియు శ్రీ సోమయాజుల రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్ల స్మారక చిహ్నంగా, శ్రీయుతులు తంగిరాల రామమోహనరావు గారు విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే బహుమతి. 2500/- (416 × 3) Ph. No = 9848591981.
1) PDC — II Tel = Shahit = 416/-
2) B.A II Sem Skt = G. Haresh Guptha = 416/-
3) B.A IV Sem Skt = Mani Kumar = 416/-
VII. శ్రీమతి ఆకెళ్ల మాణిక్యాంబ గారి స్మారక చిహ్నంగా వారి కుమారుడు ఆకెళ్ల రవి శంకర్ గారు 25000/- రూ.ల పై వచ్చే వడ్డీ పేద మరియు విధేయ విద్యార్థినీ, విద్యార్థులకు ఇచ్చే నగదు. (416 × 3)=1250/- Ph.No = 9848591981.
1) B.A I Sem Tel = MastanBee = 416/-
2) B.A II Sem Tel = Sk. Muktharunnisa = 416/-
3) B,A II Sem Tel = Jhansi = 416/-

VIII. కీ.శే శ్రీమతి పమిడిబోయిన లీలా వెంకట ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు రోషన్ కుమార్ గారు కంప్యూటర్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సంపాదించిన తెలుగు -I, II సంస్కృత -I,II విభాగములోని ఇద్దరు విద్యార్థులకు నగదు బహుమతి.
(4 x 750)=3000 – Ph.No 9963395311.
Telugu – 1) M. Sravani = 750/-
Sanskrit – 1) S. Anil = 750/-
2) K. Anjani = 750/-
2) K.Simha Reddy = 750/-

కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవం

ది 15.08.2023 న మన కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి SVJP మేనేజింగ్ ట్రస్టీ శ్రీ గిరిధర్ అన్నయ్య గారు, కరస్పాండెంట్ శ్రీ రాఘవేంద్ర అన్నయ్య గారు, డా.రామకృష్ణ ఆంజనేయులు అన్నయ్య గారు, కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డా. సుధామ వంశీ అన్నయ్య గారు విచ్చేశారు. శ్రీ గిరిధర్ అన్నయ్య గారు పతాకావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభాకార్యక్రమంలో పెద్దలు ప్రసంగించారు. ప్రతిభావంతులు మరియు పేద విధేయ విద్యార్థులకు అమ్మభక్తులు ప్రతీ ఏటా ఇచ్చే ఉపకార వేతనాలు పెద్దలచే అందజేయబడ్డాయి. విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. స్వాతంత్య్ర దినోత్సవ విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. శాంతి మంత్రంతో మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.
ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. సంస్కృతం లోనే సంభాషిస్తామని విద్యార్థులు పలికారు.

కళాశాల వ్యవస్థాపక దినోత్సవం

2023 ఆగస్టు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం టిటిడి కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారు, శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు సభ్యులు శ్రీమతి బ్రహ్మాండం హైమ, శ్రీమతి బి.వి. సుబ్బలక్ష్మి గారు, శ్రీ ఎం. దినకర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ కొండముది సుబ్బారావు గారు సంకలనం చేసిన ‘అమ్మ వెలిగించిన దివ్య దీపం’ అనే గ్రంథమును శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారు ఆవిష్కరించారు. శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు, శ్రీ కొండముది సుబ్బారావు గారు, శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు, కాలేజీ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ శ్రీమతి సుబ్బలక్ష్మి అక్కయ్యగారు, ఆల్ ఇండియా రేడియో విశ్రాంత మ్యూజిక్ ప్రొడ్యూసర్ శ్రీ మోదుమూడి సుధాకర్ గారు, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర కుమార్ గారు తమ సందేశాలు అందించారు.
ఈ కళాశాల విశిష్టతను గుర్తించి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా రూపొందాలనీ, ఈ కళాశాల విశ్వ విద్యాలయంగా అభివృద్ధి చెందాలనీ, పూర్వ విద్యార్థుల అపూర్వ కృషి సాటిలేనిదనీ రామకృష్ణన్నయ్య సేవలు మరపురానివనీ ఈ కళాశాలను అభివృద్ధి చేయటమే అమ్మసేవ అనీ వక్తలు వివరించారు.
పెద్దలు శ్రీ తూనుగుంట్ల త్రిలోక అప్పారావు గారిని పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా సత్కరించారు. పూర్వవిద్యార్థి సమితి పక్షాన సర్వశ్రీ కె. శేషాద్రి, డి. భాస్కర రావు, డి.జగదీష్, ఎమ్. శివప్రసాద్, యస్.భవానీశంకర శర్మ గార్లు తమ అనుభవాలను తెలియజేశారు.
మాన్య సోదరులుశ్రీ అప్పారావుగారు సముచితరీతిలో తమ స్పందన తెలియచేశారు. ఈ సందర్భంగా కళాశాలలో వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు సభాకార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్కృత ఉపన్యాసకులు డా. ఆర్. వరప్రసాద్ గారు వందన సమర్పణ చేశారు.
సాయంత్రం విద్యార్థులు సమర్పించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విశిష్ట అతిథి శ్రీ మోదుమూడి సుధాకర్ గారి సంగీత విభావరి రసరంజకంగా సాగాయి.
శ్రీ సుధాకర్ దంపతులకు సహకార వాద్య బృందానికి పరిషత్తువారు అమ్మ ప్రసాదాన్ని అందించారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.