by admin | Mar 8, 2022 | Women Empowerment
ఎంచుకున్న రంగంలో పురోగతిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి పేర్కొన్నారు. 8.3.22. మంగళవారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల-జిల్లెళ్ళమూడి, రోటరీ క్లబ్ బాపట్ల సంయుక్తంగా సభను ఏర్పాటు చేశారు. మహిళలు చైతన్యవంతులుగా ఉంటే సమాజం పురోభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం. జరిగింది. ఈ కార్యక్రమంలో ఎ. శివ కుమారి గారు ఉమెన్స్ సెల్ ఆఫ్ రోటరీ క్లబ్ మాట్లాడుతూ లింగ భేదం లేకుండా అన్ని రంగాలలో స్త్రీలు ప్రవేశించినట్లైతే ఆర్థిక ప్రగతిని సాధించవచ్చునని గణాంకాలతో వివరించారు. రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసు గారు సంస్కృతం, తెలుగులో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ప్రమాణ పత్రాలను అందించారు. విశ్వజననీ కార్యవర్గ సభ్యులు డి. కామరాజు గారు, పి.గిరిధర్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వజననీ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కె. రామకృష్ణగారు మాట్లాడుతూ స్త్రీ, తల్లిగా, చెల్లిగా, సేవామూర్తిగా నేడు అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తోందని వివరించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
by admin | Mar 8, 2022 | International Commemorative Days
మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని మనం ఎంచుకున్న రంగంలో పురోగతిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి పేర్కొన్నారు. 08.03.22 మంగళవారంనాడు మహిళాదినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి మరియు రోటరీ క్లబ్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో డాక్టర్ మృదుల స్వాగత వచనాలతో సభ ప్రారంభం అయింది. ఆ సభలో శ్రీమతి రమాదేవి మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులుగా ఉంటే సమాజం పురోభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అన్నె శివకుమారి గారు ఉమెన్స్ సెల్ ఆఫ్ రోటరీ క్లబ్ మాట్లాడుతూ లింగభేదం లేకుండా అన్ని రంగాలలో స్త్రీలు ప్రవేశించినట్లైతే ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చునని గణాంకాలతో వివరించారు. రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసుగారు మంచి సంస్కారంతో ఉన్న విద్యార్థులను చూసి ఆనందించి సంస్కృతం మరియు తెలుగులో ఎక్కువ మార్కులు సాధించినవారికి ప్రమాణ పత్రాలను అందించారు. పి.గిరిధర్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ ఐ. రామకృష్ణగారు మాట్లాడుతూ స్త్రీ తల్లిగా చెల్లిగా సేవామూర్తిగా నేడు అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళుతుందని వివరించారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిగా సంస్కృతోపన్యాసకురాలు డా॥ వి.పావని వందన సమర్పణ గావించారు. శాంతిమంత్రాలతో కార్యక్రమం ముగిసింది.
by admin | Dec 12, 2021 | Uncategorized
12.12.2021 ఉదయం యువసినీ గేయకవి శ్రీ అనంత శ్రీరాం వచ్చి తనూ అమ్మవద్దకు రావటంలోని అదృష్టాన్ని వివరించి సంస్కృతం చదువుకోకపోయాననే బాధ ఉన్నదనీ, ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పారు. సభాధ్యక్షులుగా డాక్టర్ దామోదరం గణపతిరావు, ఆత్మీయ అతిధిగా శ్రీ వారణాసి ధర్మసూరి ఉచితరీతిన ప్రసంగించారు. శ్రీ మాజేటి రామకృష్ణాంజనేయులు సభా నిర్వహణ చేశారు. శ్రీ గోలి రామచంద్రరావు ఆహ్వానం పలుకగా డాక్టర్. బి.శ్యామల వందన సమర్పణ చేశారు.
12.12.2021 సాయంత్రం ముగింపు సమావేశానికి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి.యల్.సుగుణ అధ్యక్షత వహించారు. గౌరవ అతిధి ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి అమ్మ తనకు. ఏలా విద్యగనిపి పైకి తెచ్చింది చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వరప్రసాదమూర్తి ప్రసంగించారు. శ్రీ ఆర్.వరప్రసాద్ సభానిర్వహణ చేశారు. శ్రీ బౌరోతు శంకరరావు ఆహ్వానం పలుకగా శ్రీ ఐ.వి.సుబ్రహ్మణ్య శాస్త్రి వందన సమర్పణ చేశారు.
అందరింటి సభ్యులందరినీ పూర్వవిద్యార్థుల సమితి నూతన వస్త్రాలతో సత్కరించారు. ఈ స్వర్ణోత్సవ వైభవం జిల్లెళ్ళమూడి అందరింటి విశిష్టతకు తగ్గట్టుగా అందరి మన్ననలు అందుకుంది.
by admin | Dec 11, 2021 | Uncategorized
11.12.2021 ఉదయం కళాశాల ప్రాంగణంలో “అంత నామకోటిస్థూప” ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థూపాన్ని యానాది రాముడు ఆవిష్కరించగా శ్రీ బ్రహ్మాందం రవీంద్రరావు, శ్రీ బొప్పూడి రామబ్రహ్మం వంటి పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు. స్థూపానికి ధనదాతలుగా ఉన్న శ్రీ శిష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ గారు వారి కుటుంబం విచ్చేశారు. శ్రీ ప్రసన్నాంజనేయశర్మగారు తాము కళాశాలలో ఆచార్యులుగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు అమ్మతో అనుబంధాలు, విద్యార్థుల దీక్షాదక్షతులు జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా ప్రసంగించారు.
ఉదయం జరిగిన సభాకార్యక్రమానికి గన్నవరం భువనేశ్వరీ పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీస్వామి. వారు ఈ జాతి వైభవానికి ఆలయాలు- సంస్కృత భాషాబోధన ఏలా మూలకందలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ ఛైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి సంస్కృతాంధ్రభాషల విశిష్టత దానికి ప్రజలు ప్రభుత్వము చేయవలసిన కృషి వివరించారు. అకాడమీ పాలకమండలి సభ్యులు శ్రీ కప్పగంతు రామకృష్ణ తన విద్యాభ్యాసం నాటి విశేషాలు సంస్కృత కళాశాలల సాధన బోధనలు వివరించారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్ధి శ్రీ యం. జగన్నాధం రాగా సభానిర్వహణ పూర్వవిద్యార్ధి శ్రీ గంటేడు చిన్నంనాయుడు సమర్ధవంతంగా నిర్వహించారు. శ్రీ యం. నాగరాజు పూర్వవిద్యార్థి వందన సమర్పణ చేశారు. కళాశాల పూర్వ ప్రస్తుత గురువులను పూర్వవిద్యార్ధి సమితి సత్కరించింది. వారు సందేశాలిచ్చారు ఉచిత రీతిలో,
by admin | Dec 11, 2021 | Uncategorized
11.12.2021 మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ఛీఫ్ సెక్రటరీ శ్రీ యల్.వి.సుబ్రహ్మణ్యంగారు. వచ్చి అమ్మతో అనుభవాలు చెప్పి కళాశాలకు తన చేతనైన సాయంచేయటానికి ఎప్పుడూ సిద్ధమే నన్నారు. సభాధ్యక్షులుగా పూర్వవిద్యార్థిని శ్రీమతి పి.వి. రామశర్మ ముఖ్యఅతిధిగా కృష్ణాజిల్లా ఉపాధ్యాయ యం.యల్.సి. శ్రీమతి టి. కల్పలత వచ్చారు. సభానిర్వహణ డాక్టర్ వై.నాగేంద్రమ్మ చేయగా, ఆహ్వానం కుమారి ఎ.మనీషా, వందన సమర్పణ శ్రీ పి.సత్యనారాయణ చేశారు. విద్యార్థులచే అమ్మ నామ సంకీర్తన – సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప బడ్డాయి.