పేరెంట్స్ – టీచర్స్ మీట్

ఎవరు లక్ష్యసిద్ధిని కలిగిస్తే వాడే గురువు అనే అమ్మ వాక్యాన్ని అక్షరసత్యం చేస్తూ ప్రతి విద్యార్థీ ఎదగడానికి కావలసిన పునాదిని మొగ్గ దశలోనే ఏర్పడేటట్లు చేయాలని ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు పేర్కొన్నారు. అమ్మ- నాన్నల ప్రేమే ప్రగతికి మూలం అన్న, అమ్మ సూక్తికి అనుగుణంగా వారి అడుగు జాడలలో నడుస్తూ ప్రతి ఒక్క విద్యార్థీ ఎదగాలని కాంక్షించారు. 10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్ధనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్ కమిటీ సభ్యులు బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సభ ప్రారంభంలో ఒక్కో విద్యార్థిని వారి తల్లిదండ్రులతో కలిసి వేదికపైకి రావాలని ఆహ్వానించారు. మనకు రెండురకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండు ఎలా జీవించాలో నేర్పేది. అలాంటి ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యను అందిస్తున్నామని బొప్పూడి రామబ్రహ్మం గారు తెలియజేశారు. విద్యార్ధినీ, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇక్కడ చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కళాశాలలో  ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుందనే విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్ గారు దానికి స్పందిస్తూ పేరెంట్స్ సూచించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్ధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

విద్యాపరిషత్ కరస్పాండెంట్గా

శ్రీ జి.వై.యన్.బాబు విద్యాపరిషత్ కరస్పాండెంట్ గా చేస్తూ ఆకస్మికంగా 12.8.2000న అమ్మలో కలసిపోయిన సందర్భంలో శ్రీ విశ్వజననీపరిషత్ ఎగ్జిక్యూటీవ్ బాడీ 26 8. 2020 బుధవారం సమావేశమై కాలేజి పూర్వవిద్యార్థిని కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణను కరస్పాండెంట్గా పరిషత్ మిగిలిన సమయానికి ఏకగ్రీవంగా ‘నిర్ణయించడమైనది. గమనించగలరు.

పొత్తూరి సంస్మరణ సభ

ప్రముఖ పత్రికా సంపాదకులు, సాహితీవేత్త,  శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి సంస్మరణ సభ 5-08-2020 లో జిల్లెళ్లమూడిలో జరిగింది. విశ్వజననీ పరిషత్ మాజీ ప్రెసిడెంట్ గా ఆయన గురుతర బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారని, ఆయన లోటు తీరనిదని బ్రహ్మాండం రవిగారు ఆవేదన వ్యక్తం చేశారు.   డిగ్రీ పట్టా లేకపోయినా, తన యొక్క (ప్రతిభా పాటవ ప్రదర్శనలో, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.  సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య మాట్లాడుతూ పొత్తూరి వారు నైతిక విలువలు కల్గిన పాత్రికేయులనడో సంశయం లేదన్నారు.  సాహిత్య అభివృద్ధికి విశేష సేవలు అందించిన వారుగా పేర్కొన్నారు. ఈ సభలో సంస్థ ప్రెసిడెంట్ దినకర్ గారు మాట్లాడుతూ అమ్మ భక్తుడైన పొత్తూరి వారు సంస్థ శ్రేయోభిలాషిగా మనందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలియజేశారు. భారతదేశ ప్రధానియైన పి.వి నరసింహరావు గారు తన విదేశీ పర్యటన విశేషాలను తెలియజేయడానికి పొత్తూరి వారే సమర్థులుగా పేర్కొనడం వారి ప్రతిభకు నిదర్శనం అని తెలియచేశారు.పొత్తూరి వారికి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలతో, సంస్థతో విడదీయలేని అనుబంధం ఉందని వారి మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.  నైతికతకు, వ్యక్తిత్వానికి పొత్తూరి వారు జీవితం నిదర్శనం అని కె. వి. కోటయ్య గారుఅన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది. మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

K.J.V మరియు AIDS పై అవగాహన సదస్సు

దేశానికి యువత వెన్నముక లాంటిదని భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని నిర్వాహకులు తెలిపారు. సరైన విద్య, ఆరోగ్యం సమాజానికి ఎంతో అవసరమని గుర్తించిన ప్రభుత్వం  యువతను మేల్కొల్పడానికి అనేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేసింది. 11.07.2020 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి, గుంటూరు లో రెడ్ క్రాస్ క్లబ్ అధ్వర్యంలో WAY, AIDS మరియు రక్తదానం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలాజ్యోతి విద్యార్థులకు AIDS పై అవగాహన కలిగించారు. హెచ్.ఐ.వి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని వివరించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి సోకదని తెలియజెప్పారు. హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిన యం.సుల్కమ్మ (బాపట్ల)  హెచ్.ఐ.వి వచ్చినవారు ధైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంస్కృత సంభాషణ సమావేశం

సంస్కృతభాష మాతృభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం పరిచయం ఉంటుందని,  సంభాషణ ద్వారానే భాష అభివృద్ధి చెందుతుందని సంస్కృతభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారు అధ్యక్ష, భాషణ చేస్తూ భూమినుండి ఆకాశం వరకు సంస్కృతం అణువణువునా వ్యాపించిందని, కళాశాలలో ప్రతి విద్యార్ధి సంస్కృతంలో మాట్లాడగలగాలని అందుకు తగిన ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరు నుండి ’’సంభాషణ సందేశం‘‘ అనే సంస్కృత మాసపత్రిక సంపాదకులు జనార్దనహెగ్దే గారు విచ్చేశారు. వారు మాట్లాడుతూ సంస్కృతంలో కేవలం వేద వేదాంగ ఇతిహాస పురాణ కావ్యాలే కాక విజ్ఞానశాస్త్రం కూడా ఉందనీ ఇది సర్వ విదితమని ఉపదేశించారు. అంతేకాక సంస్కృతం భారతదేశానికి కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేస్తుందని కొనియాడారు. భాష యొక్క సౌందర్యం సంభాషణ ద్వారా తెలుస్తుందని సంస్కృత సంభాషణకు సంస్కృత మాసపత్రికలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ీ కార్యక్రమంలో సంస్కృత విభాగంలోని అధ్యాపకులు డా. ఎ. సుధామ వంశీ, డా. అన్నదానం హనుమత్ ప్రసాద్, డా. ఆర్. వరప్రసాద్, డా. వి. పావని. యమ్. వాహిని లు పాల్గొని విద్యార్ధులు సంస్కృతం మాట్లాడేలాగా ఉత్తేజపరిచారు.