by admin | Apr 1, 2020 | Seminar
సంస్కృతభాష మాతృభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం పరిచయం ఉంటుందని, సంభాషణ ద్వారానే భాష అభివృద్ధి చెందుతుందని సంస్కృతభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారు అధ్యక్ష, భాషణ చేస్తూ భూమినుండి ఆకాశం వరకు సంస్కృతం అణువణువునా వ్యాపించిందని, కళాశాలలో ప్రతి విద్యార్ధి సంస్కృతంలో మాట్లాడగలగాలని అందుకు తగిన ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరు నుండి ’’సంభాషణ సందేశం‘‘ అనే సంస్కృత మాసపత్రిక సంపాదకులు జనార్దనహెగ్దే గారు విచ్చేశారు. వారు మాట్లాడుతూ సంస్కృతంలో కేవలం వేద వేదాంగ ఇతిహాస పురాణ కావ్యాలే కాక విజ్ఞానశాస్త్రం కూడా ఉందనీ ఇది సర్వ విదితమని ఉపదేశించారు. అంతేకాక సంస్కృతం భారతదేశానికి కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేస్తుందని కొనియాడారు. భాష యొక్క సౌందర్యం సంభాషణ ద్వారా తెలుస్తుందని సంస్కృత సంభాషణకు సంస్కృత మాసపత్రికలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ీ కార్యక్రమంలో సంస్కృత విభాగంలోని అధ్యాపకులు డా. ఎ. సుధామ వంశీ, డా. అన్నదానం హనుమత్ ప్రసాద్, డా. ఆర్. వరప్రసాద్, డా. వి. పావని. యమ్. వాహిని లు పాల్గొని విద్యార్ధులు సంస్కృతం మాట్లాడేలాగా ఉత్తేజపరిచారు.
by admin | Jun 8, 2019 | Seminar
సంస్కృత భాషా శిబిరం జూన్ 8 వ తేది సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డా. సుధామ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం. వారి సంస్కృత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీపోయారి శ్రీకాంత్ (సంస్కృత భారత కార్యకర్త) సంస్కృత భాషా బోధకునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యా రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సంస్కృత భాషను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు మన ధర్మాన్ని గౌరవిస్తున్నాయని వివిధ విశ్వ విద్యాలయాల్లో సంస్కృత అధ్యయన శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇదే వేదికపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేవ భాషగా, మధుర భాషగా, ప్రపంచ భాషగా సంస్కృతానికి గత వైభవాన్ని సంతరించే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. విద్యార్థులు సంస్కృతంలో సంభాషించారు. అధ్యాపకులు డా. కె.వి కోటయ్య డా. పావని డా. ఆర్ వర ప్రసాద్ సంస్కృత ప్రత్యేకతను, ప్రాముఖ్యాన్ని వివరించారు.
by admin | Feb 15, 2019 | Seminar
15.02.2019 న సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రముఖకవి విశ్రాంత జిల్లా ప్రభుత్వ ఖజానా సహాయాధికారి అల్లం జగపతిబాబు వివరించారు. శుక్రవారం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో ప్రజాజీవితం ప్రతిబింబించాలని తెలిపారు. కాళాశాల ప్రిన్సిపాల్ డా॥ సుధామ వంశీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా “షోడశి” తదితర గ్రంథాలను విద్యార్థులకు బహూకరించారు. ఉత్తమ సాహిత్యానికి దిశా నిర్దేశం చేసే శక్తి ఉంటుందని అల్లం జగపతిబాబు సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై విద్యార్థులకు వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం జరిగింది. “అమ్మ సందేశం సమాజాభ్యుదయం” సమాజ ప్రగతిలో విద్యార్థుల పాత్ర, “మాతృభాషా మాధుర్యము”, “విశ్వజనిగా అమ్మ” అనే అంశాలపై వివిధ స్థాయిలలో వక్తృత్వపు పోటీ జరిగింది. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.