by admin | Apr 1, 2020 | Samskrutha Sibhiram
సంస్కృతభాష మృతభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం తెలుసు కానీ సంభాషణ ద్వారానే భాష – అభివృద్ధి చెందుతుందని సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు అధ్యక్ష భాషణ చేస్తూ భూమినుండి ఆకాశం వరకు సంస్కృతం అణువణువునా వ్యాపించిందని, కళాశాలలో ప్రతి విద్యార్థి సంస్కృతంలో మాట్లాడగలగాలని అందుకు తగిన ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. కార్యక్రమానికి బెంగుళూరు నుండి సంభాషణ సందేశః అనే సంస్కృత మాసపత్రిక సంపాదకులు జనార్దన హెగ్దే గారు విచ్చేశారు.
by admin | Mar 15, 2020 | Career Guidence
ఓరియంటల్ కళాశాల ఉన్నతప్రయోగాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తుందని విశ్వజనని సంస్థ అధ్యక్షులు దినకర్ సగర్వంగా తెలియజేశారు. 15.3-2020 ఆదివారం, జిల్లెళ్ళమూడి వాత్సల్యాలయం ప్రాంగణంలో ‘కెరీర్ గైడెన్స్ సెల్-2020″ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుభాష అభివృద్ధికి ఓరియంటల్ కళాశాలలు మూలస్థంబాల లాంటివనీ, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తప్పనిసరిగా లభిస్తున్నాయని దినకర్ గారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులకు టీచర్ ట్రైనింగ్ ఎంట్రన్స్ వ్రాయడానికి తగిన తర్ఫీదు ఇవ్వడం కోసం కళాశాల ప్రిన్పిపాల్ డా. వి. హనుమంతయ్య గారు ఈ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. SVIP వారి సహకారంతో విద్యార్థులకు ఉచితంగా ఈ కోచింగ్ ఇస్తున్నట్లుగా హనుమంతయ్య గారు తెలిపారు. కోచింగ్ తీసుకున్నవారు ప్రభుత్వ టీచరు ఉద్యోగాన్ని సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కారక్రమంలో సంస్థ పెద్దలు వై.వి.శ్రీరామ్మూర్తి గారు, శరచ్చంద్రగారు పాల్గొన్నారు.
by admin | Mar 5, 2020 | Programs
5.3.2020 సాయంత్రం ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావుగారి సంస్మరణసభ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజిలో నిర్వహింపబడినది. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు, బ్రహ్మాండం రవీంద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ హనుమంతయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఆచార్యులు శ్రీ కె.కోటయ్య, శ్రీ కె.సత్యమూర్తి, పొత్తూరి వారి విశిష్టతను వివరించారు. విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.కరోనా జాగ్రత్తలపై డాక్టర్ ఇనజకుమారి సూచనలు 4.9.2020 కళాశాల పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అతిభయంకరమైన కరోనవ్యాధి వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు విపులంగా వివరించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తే వెంటనే వైద్యశాలకు వచ్చి పరీక్ష చేయించుకోమని చెప్పారు.కార్యక్రమంలో ప్రెసిడెంట్ దినకర్, ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, కాలేజి అధ్యాపకులు డాక్టర్ సుధామవంశీ పాల్గొన్నారు.కెరీర్ గైడ్ సెల్ 2020 15.3.2020 ఆదివారం కళాశాల విద్యార్థులకు డిగ్రీ అయిన తర్వాత టీచర్ ట్రయినింగ్ ఎంట్రన్సు వ్రాయటానికి తగిన తర్ఫీదు ఇవ్వటానికి ప్రిన్సిపాల్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ జి. వెంకటచారి ప్రవేశ పరీక్షలకు T.P.T. B.Ed పరీక్షలకు సంసిద్ధులయ్యందుకు తగిన శిక్షణ ఇచ్చారు.సంస్థ పెద్దలు సర్వశ్రీ దినకర్, వై.వి.శ్రీరామమూర్తి యం. శరత్చంద్రకుమార్ పాల్గొని కొన్ని సూచనలిచ్చారు. శరశ్చంద్ర పోటీపరీక్షలకు కావలసిన పుస్తకాలు కొనటానికి కొంత ధనం ఉదారంగా ఇచ్చారు.
by admin | Feb 21, 2020 | Orientation Programm
అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21:2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్ళమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజనని పరిషత్ కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. కళాశాల కరస్పాండెంట్ జి.వై.యస్.బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవానికి ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారు అధ్యక్షత వహించారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ మన సంప్రదాయాలను కాపాడుతూ అమ్మతత్త్వాన్ని దశదిశలా వ్యాప్తి చేసి, భావితరాలకు అందించాలని కోరారు. విద్యార్థి జీవితంలో ఈ వార్షికోత్సవాలు ఒక మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని, భవిష్యత్తులో ఈ సంస్థ అభివృద్ధికి అమ్మ ఆశయాలకు అనుగుణంగా పూర్వవిద్యార్థి సంఘం నిలుస్తుందని ప్రిన్సిపాల్ హనుమంతయ్య గారు ఆశాభావం వ్యక్తం చేశారు. నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని జనవరి నెలలో జరిగిన ఆటలపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ట్రోఫీలను సంస్థ పెద్దలు అందజేశారు. యమ్. చంద్రమోహన్ గారు (రిటైర్డ్) అమ్మ ఫోటోలతో ముద్రించిన మోడల్స్ ను, ట్రోఫీలను ఆదరంగా నెల్లూరునుండి పంపించారు. రెసిడెన్షియల్ సెక్రటరీ లక్కరాజు సత్యనారాయణ గారు ఆటల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని విద్యార్ధులకు తెలియజేశారు. శ్రీ యమ్. శరచ్చంద్రగారు మాట్లాడుతూ కళాశాల 1971 నుండి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో సంస్థపెద్దలు వై.వి. శ్రీరామ్మూర్తిగారు, మోహనకృష్ణ గారు, చక్కా శ్రీమన్నారాయణగారు పాల్గొని తమ ఆశీస్సులను విద్యార్థులకు అందించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
by admin | Feb 21, 2020 | Local Functions
అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21.2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజననీపరిషత్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. నాన్నగారి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని జనవరి నెలలో జరిగిన ఆటలపోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ ట్రోఫీలను సంస్థ పెద్దలు అందజేశారు. అమ్మ భక్తులైన శ్రీ యమ్. చంద్రమోహన్ గారు పిడి (రిటైర్డ్) అమ్మ ఫోటోలతో ముద్రించిన మెడల్స్ను, ట్రోఫీలను ఆదరంగా నెల్లూరు నుండి పంపించారు. రెసిడెన్షియల్ సెక్రటరీ లక్కరాజు సత్యనారాయణగారు ఆటల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ యమ్. శరచ్చంద్రగారు మాట్లాడుతూ కళాశాల 1971 నుండి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.