by MOC IQAC | Aug 12, 2024 | National Commemorative Days
గ్రంథాలయాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే సోపానాలు. నేటి విద్యార్థులు సాంకేతికతతో ముందడుగు వేస్తూ స్వమేధస్సును మరచిపోతున్నారు. ఈ తరుణంలో గ్రంథాలయ పితామహుడైన డా. యస్. ఆర్. రంగనాథన్ గారి జన్మదినం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ లో ఓరియంటల్ కాలేజ్ డిజిటల్ క్లాస్ room లో గ్రంథాలయాధికారిదినోత్సవం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా నిర్మల్ గవర్నమెంటు డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ డా. ఆర్. నాగేశ్వర్ గారు ప్రసంగించారు, పుస్తకపఠనం యొక్క ఆవశ్యకత తెలుసుకొని అభిరుచి పెంచుకుంటే పుస్తకమే నిజమైన స్నేహితుడిగా ఉంటుందని, గ్రంథాలయాలను ఒక ప్రణాళికా బద్ధంగా నిర్వహించడం ద్వారా అందరికీ ఆసక్తి కలిగించవచ్చునని చెప్పారు. సాంఘిక సంస్కర్తలనుండి సాహిత్యవేత్తల వరకు ప్రజాచైతన్యాన్ని పుస్తక రచనల ద్వారానే తీసుకురాగలిగారని కనుక విద్యార్థులు పుస్తకపఠనం అలవరచుకోమని ఈ సందర్భంగా వివరించారు. కళాశాల లైబ్రేరియన్ ఆర్. రమ్య ఈ గెష్ట్ లెక్చర్ ను గూగుల్ మీట్ ద్వారా ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులందరూ మా విరామ సమయాలలో తప్పనిసరిగా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ & అధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది, మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.
by MOC IQAC | Aug 6, 2024 | Special Days
06 08 2024 మంగళవారం 54వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లెళ్ళమూడి వాత్సల్యాలయ ప్రాంగణంలో జరిగాయి. కళాశాల జాతీయస్థాయి గుర్తింపు పొందిన సందర్భంగా ఈ సభ మరింత విశిష్టతను సంతరించుకుంది. SVJP TRUST CHAIRMAN శ్రీ V S R మూర్తి గారు ఈ సభకు అధ్యక్షత వహించి అధ్యక్షభాషణ చేస్తూ అమ్మ భావ సంపదకు రూపకల్పనయే. కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం అనీ తద్ద్వారా ఈ కళాశాల మరో ముందడుగు వేసి విశ్వజనీనం కావాలని మంగళాశాసనం చేశారు. అనంతరం మాతృశ్రీ ప్రాచ్య పాఠశాల కళాశాలల పూర్వ విద్యార్థిసమితి వారు కళాశాల పూర్వకరెస్పాండెంట్ అయిన శ్రీ. M. S శరశ్చంద్ర గారిని విశేషంగా సత్కరించారు. College Management Committee Convener శ్రీమతి సుబ్బలక్ష్మి గారు, పెద్దలు శ్రీ బొప్పూడి రామ బ్రహ్మంగారు ఈ సభలో పాల్గొన్నారు. SVJP TRUST MANAGING TRUSTEE శ్రీ పి. గిరిధర కుమార్ గారు అవిశ్రాంతంగా పనిచేసిన కళాశాల అధ్యాపక బృందాన్ని అభినందించి రజత పతకాలతో సత్కరించారు. పూర్వ విద్యార్థి సమితి తరఫున గోగినేని రాఘవేంద్రరావు గారు, రామకృష్ణ గారు అధ్యాపకులందరికీ వస్త్రాలను బహూకరించారు. PRINCIPAL డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ కళాశాల 2023 – 24 వార్షిక నివేదికను అందించారు. శరశ్చంద్ర గారి ఆధ్వర్యంలో BASICS IN CARNATIC MUSIC అనే సర్టిఫికెట్ కోర్సుపూర్తిచేసిన విద్యార్థులు గీతాలాపన చేశారు. వీరికి trust పెద్దలు ప్రమాణ పత్రాలను అందించారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు జరిపిన సాహితీ పరమైన పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలను పొందిన వారికి పూర్వ విద్యార్థి సమితి పుస్తకాలను బహూకరించింది. కార్యక్రమంలో నందగోపాలం అంటూ విద్యార్థినిలు ప్రదర్శించిన కోలాటం అందరినీ అలరించింది. కళాశాల సంస్కృతశాఖాధ్యక్షులు R వరప్రసాద్ సభానిర్వహణ చేశారు. తెలుగు శాఖాధిపతి డా. L. మృదుల వందన సమర్పణ చేశారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by MOC IQAC | Dec 27, 2023 | Student Awards & Achievement's
“ఆధునిక సాహిత్య ప్రక్రియలు వాడుక భాష ప్రయోగం” అనే అంశం పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీల్లో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిని చి!! బి. సత్యవాణి lll BA Sanskrit రాసిన పాలంగి కథలు అనే వ్యాసం ద్వితీయ బహుమతి సాధించింది. అందుకుగాను 2000 రూపాయలు, సిల్వర్ మెడల్, సర్టిఫికెట్ డా. లకిరెడ్డి హనిమి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం అందజేశారు.
by MOC IQAC | Oct 2, 2023 | Student Awards & Achievement's
కెవిఆర్ కెవిఆర్ అండ్ ఎంకెఆర్ కళాశాల ఖాజీపాలెం వారు నిర్వహించిన వివిధ పోటీలలో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ విద్యార్థినులు పాల్గొని ప్రమాణపత్రములను మరియు నగదు బహుమతులను పొందారు.