Our Student received Certificate and Cash Prize from S.C.I.M. Government College, Thanuku

Our Student received Certificate and Cash Prize from S.C.I.M. Government College, Thanuku

 శ్రీ చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల, తణుకు వారు నిర్వహించిన  జాతీయస్థాయి కథల పోటీల్లో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిని చిII E. వనజ l BA Telugu తృతీయ బహుమతి సాధించింది. అందుకుగాను 2000 రూపాయలు, సిల్వర్ మెడల్, సర్టిఫికెట్ను అందజేశారు.

Telugu Bhasha Dinothsavam in Association with Andhra Viswakala Parishat & Samaikya Bharathi

Telugu Bhasha Dinothsavam in Association with Andhra Viswakala Parishat & Samaikya Bharathi

తెలుగు భాషా దినోత్సవం

ఆగష్ట్ 29 , 2024 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల-జిల్లెళ్ళమూడి , ఆంధ్ర విశ్వ కళాపరిషత్ మరియు సమైక్య భారతి వారి సంయుక్త ఆధ్వర్యంలో వాత్సల్యాలయ ప్రాంగణంలో వ్యవహారిక భాషోద్యమ పితామహుడైన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి 161వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముందుగా గౌరవ అతిథి గిడుగు రామమూర్తి గారి ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. గిడుగు వారి భాష మరియు సాహిత్య సేవను, గ్రాంథిక వ్యవహార భాషల వ్యత్యాసమును పండితుల తిరస్కారమును , వ్యవహార భాషోద్యమ చరిత్రను వారి జీవిత ఇతివృత్తాన్ని తెలియపరిచారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా: అన్నదానం. హనుమత్ ప్రసాద్ గారు నేడు ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు భాషకు మనమందరం పూర్వవైభవం పొందే విధంగా కృషి చేయాలనే సందేశం అందించారు. తదనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వపు రెక్టార్ డాక్టర్ పి .వరప్రసాద మూర్తి గారు వ్యవహార భాషా ఉద్యమంలో భాగంగా గిడుగు వారితో పాటు గురజాడ వారి సేవలను వివరించి, మన కర్తవ్యాన్ని తెలియజేశారు. తర్వాత ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం, విశాఖపట్నం నుండి విచ్చేసిన డాక్టర్ :వెంకటేశ్వర యోగి గారు యథారాజా తథాప్రజా అనే ఆర్యోక్తిని యథారాజా తథాభాషా అని అన్వయం చేస్తూ , పరభాషని అభిమానిస్తూ మాతృభాషను మరిస్తే మన భాష మనుగడ కష్టం అని గుర్తించి మాతృభాషా సేవ చేయాలని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాన సూత్రధారులు సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త , మన విశిష్ట అతిథి శ్రీ పి. కన్నయ్య గారు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన జిల్లెళ్ళమూడిలో నేటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా నేను కూడా అమ్మ బిడ్డను అయ్యానని, తెలుగు భాషకు మీరందరూ కూడా మరింత సత్కీర్తిని కలిగించాలని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. తదుపరి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ ప్రసాద వర్మ కామ ఋషి గారు ఆంధ్రభాష సేవను గూర్చి తెలియజేస్తూ , మన భాష అభివృద్ధికి కృషి చేయాలని సందేశం ఇచ్చారు. అనంతరం ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు మానసిక ఉల్లాసాన్ని కలిగించే హాస్య రసాన్ని జోడించి తెలుగు భాష విశిష్టతను తెలియపరిచారు. అటు తర్వాత మరో ఆత్మీయ అతిథి శ్రీ వర్రే నాంచారయ్య గారు విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు. మరో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆంజనేయులు నాయుడు గారు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని స్మరించడం మన కర్తవ్యం అని, తెలుగు వెలుగులను పంచిన మహనీయులందరిని మనం గుర్తుంచుకోవాలని వారి అడుగుజాడల్లో నడవాలని అమూల్యమైన సందేశాన్ని అందించారు. తెలుగు శాఖ అధ్యక్షురాలు డాక్టర్: లక్కవరపు మృదుల సభా నిర్వహణ చేయగా, తెలుగు అధ్యాపకులు కె. హేమంత్ గారు వందన సమర్పణ చేశారు. కళాశాల విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను ఆనంద పరిచారు. ఈ కార్యక్రమం శాంతి మంత్రంతో విజయవంతంగా ముగిసింది

 

 

Guest Lecture on Goal Setting By Dr. G Padmaja Garu

Guest Lecture on Goal Setting By Dr. G Padmaja Garu

   24-08-2024 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో Dr. G. పద్మజ Professor & Head School of Medical Sciences – University of Hyderabad గారు Goal setting (లక్ష్య నిర్ధారణ) అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు విద్యార్థులకు
1. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రోత్సహించారు.
2. లక్ష్యాలను సాధించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం మరియు క్రమం తప్పకుండా పురోగతిని అంచనా వేయడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
వారి ప్రసంగం విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించే దిశగా పని చేయడానికి మరియు వారి విద్యా మరియు వ్యక్తిగత జీవితాల్లో విజయం సాధించేందుకు ప్రేరణనిచ్చింది.
అనంతరం అధ్యాపకులను ఉద్దేశించి సంభాషణ చేస్తూ విద్యార్థి యొక్క అభివృద్ధి మరియు అభ్యాసాన్ని పెంపొందించడానికి మెంటార్ – మెంటీ విధానం మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ విధానం అనుసరించడం వలన విద్యార్థులు తమలో అంతర్గతంగా ఉన్న భావాలను కూడా వెలికి తీసి కొత్త నైపుణ్యాలలో వారి పురోగతికి కీలకమైన పాత్ర పోషించవచ్చు. ఈ విధంగా మెంటార్ కు కూడా సరికొత్త ఆలోచనలు కలిగి సంతృప్తిని పొందవచ్చునని వివరించారు. కనుక మన కళాశాలలో ఉన్న విద్యార్థులందరినీ విభజించి మెంటార్స్ ను ఏర్పాటు చేసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు సహకరిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల పక్షాన ప్రిన్సిపాల్ డా.హనుమత్ప్రసాద్ గారు, College Magement Committee పక్షాన శ్రీమతి మాధవీలత గారు పద్మజ గారికి ధన్యవాదములు తెలిపారు

 

Viswa Samskrutha Bhasha Dinothsavam | విశ్వ సంస్కృతభాషా దినోత్సవం

Viswa Samskrutha Bhasha Dinothsavam | విశ్వ సంస్కృతభాషా దినోత్సవం

అమృతభాష పునరుద్ధరణకై ప్రపంచవ్యాప్తంగా శ్రావణపూర్ణిమ పర్వదినం రోజున విశ్వ సంస్కృతభాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. మాతృశ్రీ ప్రాచ్య కళాశాల లో జనని సంస్కృతంబు జగతి భాషలకెల్ల అని చాటి చెప్పే విధంగా సంస్కృతభాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ అధ్యక్షభాషణ చేస్తూ పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా అనే నినాదంతో విద్యార్థులను సంస్కృతం లో మాట్లాడే ప్రయత్నం నేటినుంచే ప్రారంభించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సంస్కృతభాష ప్రాచారానికై అహర్నిశం కృషి చేస్తున్న సంస్కృతభారతి సంస్థ తరుపున చీరాల జనపదం లో బాలకేంద్రాలను నిర్వహిస్తున్న శ్రీమతి సి.హెచ్. గీత గారు ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరు సంస్కృతభాషా ప్రచార సాధకులుగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఉండాలని అలా మీరు ప్రయత్నం చేయాలని చెప్పారు. అంతేకాక విద్యార్థులకు బాలకేంద్రాన్ని స్వయంగా నిర్వహించి సులభ శైలిలో సంస్కృతంలో మాట్లాడడం నేర్పించారు. కళాశాల విద్యార్థులు సంస్కృతగీతాలాపన, శ్లోకపఠనం ఛేశారు. సంస్కృతభాషా ప్రాశస్త్యాన్ని చాటి చెప్తూ నృత్యప్రదర్శన గావించారు. సంస్కృతవిభాగం తరుపున జరిగిన ఈ కార్యక్రమంలో సంస్కృతశాఖాధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు సభానిర్వహణ చేయగా, డా. వి. త్రయంబకం గారు వందనసమర్పణ చేశారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతిమంత్రంలో కార్యక్రమం ముగిసింది.

 

Organic Seed Plantation at Jillellamudi Village

Organic Seed Plantation at Jillellamudi Village

On Independence Day, Yogada Charitable Trust, Guntur, presented organic Tree Flags to our Matrusri Oriental College to raise awareness about environmental protection. All the college faculty members wore these organic Tree Flags and later planted them as saplings. Additionally, an awareness program was conducted for the residents of Jillellamudi village, where seeds were planted in the surrounding areas under the leadership of the village sarpanch, G. Lakshmi Garu. 5 staff Members and 15 students participated in this program.