+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

13.2.2020 గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి – గుంటూరులో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో H.I.V, AIDS మరియు రక్తదానం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. నిర్మలాజ్యోతి RRC Master Trainer, JMJ College, Tenali విద్యార్థులకు AIDS పై అవగాహన కలిగించారు. H.I.V. అనేది అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని వివరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈవ్యాధి సోకదని తెలియజెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. హనుమంతయ్య గారు అధ్యక్ష భాషణం చేస్తూ నివారణ కంటే నిరోధన ఉత్తమం కాబట్టి తెలిసి తెలిసి ఇంత భయంకరమైన వ్యాధి రాకుండా ఉండటానికితగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని, అది మనందరి కర్తవ్యమనీ సూచించారు. ఈ సదస్సులో శ్రీమతి కె. అపర్ణ DAPCU Co-Ordinator – Health H.I. V., Aids, Sex పట్ల సంపూర్ణమైన అవగాహనను కల్పించారు. పాజిటివ్ స్పీకర్గా బాపట్ల నుండి యమ్. సుబ్బమ్మ గారు వచ్చి H.I.V. బారిన పడినవారు అధైర్యపడకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళాలని తాను అనుభవించిన బాధలని మరెవరూ అనుభవించకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. కళాశాల NSS Co-Ordinator జి.రాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సందేహాలకు సమాధానాలిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.