Viswa Samskrutha Basha Dinothsavam

విశ్వసంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సంస్కృత భారతి అఖిల భారత బాలకేంద్ర ప్రముఖులు, విజయవాడ SSR&CVR కళాశాల సంస్కృత ఉపన్యాసకులు శ్రీ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

సంస్కృతం అనేది ప్రాచీన భాష మాత్రమే కాదు నిత్య నూతనమైన భాష అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో, జన జీవనంలో సంస్కృతం ఎలా ఇమిడిపోయి వున్నదో వివరించి విద్యార్థులకు భాషపై మక్కువ ఆసక్తి కలిగించారు.

కార్యక్రమంలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు సంస్కృతంలో ప్రసంగాలను, శ్లోకపఠనాన్ని చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే నృత్య ప్రదర్శనలు జరిగాయి.

సభాకార్యక్రమాన్ని ఆసాంతం సంస్కృత భాషలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.అన్నదానం హనుమత్ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. సంస్కృతోపన్యాసకులు డా.ఆర్ వరప్రసాద్ గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు