World Environment Day/ప్రపంచ పర్యావరణ దినోత్సవం

World Environment Day/ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి NSS UNIT తరఫున అధ్యాపకులు మరియు విద్యార్థులు కలసి జిల్లెళ్ళమూడి గ్రామపరిసర ప్రాంతాలైన జమ్ములపాలెం, రేటూరు, కాకుమాను, అప్పాపురం, కర్లపాలెం,యాజలి గ్రామాలలోని అంగన్‌వాడి కేంద్రాలు, హైస్కూల్స్, పశువైద్యశాలల వద్ద పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నివారించి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జ్యూట్ బ్యాగులు వాడుకోవాలని ప్రజలకు సూచించారు. పర్యావరణాన్ని సంరక్షించడం మన అందరి బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.
అదేవిధంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో Principal డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు, SVJP TRUST MANAGING TRUSTEE శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, జిల్లెళ్ళమూడి గ్రామసర్పంచ్, అధ్యాపకులు, విద్యార్థులు పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషించారు.
కళాశాల క్యాంపస్ లో వివిధ రకాల మొక్కలను నాటడం ద్వారా హరిత శోభను పెంచారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించి, సమాజానికి మంచి సందేశాన్ని అందించింది.