by admin | Dec 12, 2019 | Orientation Programm
“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో నిర్విరామంగా కొనసాగాలని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి.హనుమంతయ్య ఆశించారు. ప్రిన్సిపాల్ గారు నూతనంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్పందిస్తూ కొంతమంది కళాశాల పూర్వ విద్యార్థి సంఘం తరపున వారి సహకారాన్ని అందిస్తామని మాట ఇస్తూ తొలుతగా రూ. 2000/ నగదును ప్రిన్సిపాల్ గారికి అందజేశారు
by admin | Sep 18, 2019 | Orientation Programm
18.09.2019న కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న చి. మృదుల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి శ్రీకొండముది రామకృష్ణగారి సాహిత్యం – సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పట్టాను పొందారు. ఈ సందర్భంగా విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు యమ్. దినకర్ గారు, కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుధామవంశీ, అధ్యాపకులు తమ అభినందనలు తెలియజేశారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులుగారు మరియు కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి. వై. యన్. బాబుగారు శ్రీమతి మృదులగారికి శుభాకాంక్షలను తెలియజేశారు. అమ్మ శేషవస్త్రాలను అందించి ఆశీర్వదించారు.
by admin | Aug 15, 2019 | Orientation Programm
73 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఆగష్టు 15 వ తేదీన ఘనంగా జరిగాయి. అమ్మ చిత్రపటానికి మరియు భరతమాత చిత్ర పటానికి ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య పుష్పమాల అలంకరణ నిర్వహించగా, కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్.బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభలో ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామ వంశీ మాట్లాడుతూ పెద్దలు సంపాదించి పెట్టిన స్వాతంత్య్రాన్ని అనుభవిస్తూ మన సంస్కృతిని భావితరాలవారికి కూడా అందివ్వాలని తెలిపారు. కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబుగారు మాట్లాడుతూ బాధ్యతలను గుర్తించి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో శ్రమించాలని తెలిపారు. శ్రీ బొప్పూడి రామబ్రహ్మం మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో కలిసి కట్టుగా కృషి చేయాలని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.ప్రేమక్కుమార్, శ్రీ ప్రసాదవర్మ కామఋషి తదితరులు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమం ఆసాంతం విద్యార్థినులే నిర్వహించడం విశేషము. ఇదే వేదికపై పలువురు దాతలు అందించిన ప్రోత్సాహక నగదు బహుమతులను సంస్థ పెద్దలు విద్యార్థినీ విద్యార్థులకు అందించారు. దాతలకు కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.
by admin | Jun 3, 2019 | Orientation Programm
విద్యారంగం పురోగతిలో నాక్ (NAAC) పాత్ర ప్రగతి ప్రదాయకమని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.ఎన్.బాబు వివరించారు. ఓరియంటేషన్ కార్యక్రమం జూన్ 3 వ తేది సోమవారంగుంటూరులోని హిందూ కళాశాలలో జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, గుంటూరు హిందూ కళాశాలలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యాపకులు శ్రీ కె.వి.ఎస్.దుర్గాప్రసాద్ (హిందూ కళాశాల), డా॥ కె.విజయబాబు, IQAC కో-ఆర్డినేటర్, ప్రభుత్వ మహిళా కళాశాల, ఎమ్. వేనుబాబు తాడికొండ, డా|| ఎ. లీలామోహన్ విజ్ఞాన్ యూనివర్సిటీ, డా॥ పి.వేణుగోపాల్ హిందూ కళాశాల, డా॥ డి.ఎన్. దీక్షిత్, డా॥ ఎ.సుధామ వంశీ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ పలువురు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఉభయ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్, పురుషోత్తమ పుత్ర భార్గవ శ్రీ పి.ఎస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్, (విశ్వజననీ సంపాదకులు) మాతృశ్రీ విద్యా పరిషత్ కన్వీనర్ బొప్పూడి. రామబ్రహ్మం గారు, పలువురు అధ్యాపకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనలోను NAAC పాత్ర కీలకమని పలువురు వక్తలు వివరించారు. NAAC న్యూ మెథడాలజి ఓవర్ వ్యూ ను డా॥ విజయాబ్బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేసారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డా॥ ఎ. సుధామ వంశీ NAAC ప్రోగ్రామ్ కై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. NAACకు సంబంధించిన అనేక అంశాలను సోదాహరణంగా వివరించడం పట్ల మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది తమ కృతజ్ఞతలు తెలిపారు.
by admin | Sep 7, 2018 | Library
Planning Library Catalogue with Faculty …
by admin | Jan 1, 2018 | Book Exhibition
విజయవాడలో జనవరి 1 నుంచి 11 వరకు జరిగిన ’30వ విజయవాడ బుక్ ఫెస్టివల్’ లో శ్రీ విశ్వజననీ పరిషత్ తరఫున ఒక స్టాలును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగముగా కొత్తగా విడుదలైన మాతృశ్రీ జీవిత మహోదధితో పాటు అమ్మ సాహిత్యం అందరికి అందేలా ఏర్పాటు చేయడమైంది. బుక్ ఫెస్టివల్కి వచ్చిన పుస్తక ప్రియులకు, ఆధ్యాత్మిక సాహిత్య అభిలాషకులకు పలు గ్రంథాలను డిస్కౌంట్ ధరకు కూడా అందించడమైంది. ఈ పుస్తక ప్రదర్శనను మాతృశ్రీ పాఠశాల సంస్కృత అధ్యాపకులు శ్రీ వల్లూరి త్రయంబకం గారు, పీడీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హనుమత్ సాయి, గోవింద్ అనే విద్యార్థుల సహాయంతో సమర్థవంతంగా నిర్వహించారు. వీరందరికి వసతి, భోజన సదుపాయాలను ప్రెసిడెంట్ రామబ్రహ్మంగారు వారి స్వగృహమునందే ఏర్పాటు చేయడమే కాక, ఎంతగానో సహకరిస్తూ, ఈ కార్యక్రమ నిర్వహణలో వీరికి మార్గనిర్దేశనం చేశారు. కాగా ఈ బుక్ ఫెస్టివల్ సందర్భంగా ‘అమ్మ యొక్క తత్త్వ ప్రచారమునకు, అలానే ఫిబ్రవరి 17న జరిగే ‘ధాన్యాభిషేకం’ కార్యక్రమం గురించి, అమ్మను తెలిసిన వారికి, తెలియని వారికీ కూడా తెలియపరిచే ఒక చక్కని అవకాశం లభించినట్లుగా త్రయంబకంగారు తెలిపారు.