Orientation program on Institutional Values and Best Practices

Orientation program on Institutional Values and Best Practices

Orientation program on Institutional Values and Best Practices

ది. 23 – 9 – 2024 సోమవారం కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. డాక్టర్ బి వరలక్ష్మి గారు రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. డాక్టర్ వరలక్ష్మి గారు సంస్థాగత విలువలను పాటించడము మరియు ఉత్తమ విధివిధానాలను ఏర్పాటు చేసుకోవడం, వాటి ప్రాముఖ్యతను గురించి కీలకమైన ప్రసంగాన్ని చేశారు. అనంతరం కళాశాల అభివృద్ధిలో నిరంతరం పాలుపంచుకుంటున్న బొప్పూడి రామబ్రహ్మంగారు విద్యాపరమైన పురోగతిని సాధించడంలో సంస్థ యొక్క విధివిధానాలను ఎలా రూపొందించుకోవాలో సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమము కళాశాల IQAC ద్వారా విజయవంతంగా నిర్వహించబడింది.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారు బి వరలక్ష్మి గారిని మరియు బొప్పూడి రామబ్రహ్మం గారిని కళాశాలకు స్వాగతించారు. వరలక్ష్మి గారు విద్యార్థులతో మాట్లాడుతూ సంస్థ యొక్క విలువలను పెంచే మార్గాలను అనుసరిస్తూ సంస్థ అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని ఆశీర్వదించారు. అనంతరం బి. వరలక్ష్మి, శ్రీరామచంద్ర మూర్తి దంపతులకు అమ్మ ప్రసాదంతో అధ్యాపకులందరూ సత్కరించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

Workshop on Student Centered Methods by Dr. K Vijaya Babu

Workshop on Student Centered Methods by Dr. K Vijaya Babu

31, ఆగష్టు 2024 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో Student centered teaching methods పై workshop నిర్వహించారు. కమీషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ నుండి డా. కె. విజయబాబు గారు resource person గా విచ్చేశారు.  అధ్యాపకులకు రెండు sessions గా ఈ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా తరగతి గదిలో విద్యార్థులు అభ్యాసం చేయడానికి అనుకూలమైన వాతావారణాన్ని ఎలా సృష్టించాలి, విద్యార్థులను ఎలా భాగస్వాములను చేయాలో సవివరంగా తెలిపారు. విద్యార్థి కేంద్రిత అధ్యాపన జరిగినప్పుడే వారికి విమర్శనాత్మక ఆలోచన, సమస్యను పరిష్కరించే విధానం అలవడతాయని తెలిపారు. వీటన్నిటికంటే ముందుగా అధ్యాపకుడు సరైన ప్రణాళికను రూపొందించుకొని విద్యార్థులను ప్రోత్సహించి విద్యావిధానాన్ని మెరుగుపరచుకొని తరగతి గదిలో వర్తింపచేయవలెనని సూచించారు. ఈ వర్క్ షాప్ ద్వారా అధ్యాపకులు తమ బోధనా విలువలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తామని అందుకు ఈ వర్క్ షాప్ మరింతగా ఉపకరించిందని తెలిపారు.

 

స్వామివారి అనుగ్రహభాషణ

సకల మానవాళి శ్రేయస్సు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దైవభక్తి, విశ్వమానవ సౌభ్రాతృత్వంతో మనుగడ సాగించాలని కృష్ణాజిల్లా పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సీతారామ్ స్వామీజీ వివరించారు. ఆగష్టు 14 మంగళవారము కళాశాలలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన అనుగ్రహభాషణం చేశారు. ఈ సభలో అధ్యక్షులు శ్రీ రామబ్రహ్మంగారు పాల్గొన్నారు.స్వామీజీ మాట్లాడుతూ సంస్కృతాంధ్రలలోని వివిధ సూక్తులను, పద్యాలను ఉదాహరించి శ్రోతలను అలరించారు. సన్మార్గంలో జీవించడం, సాటి మానవులకు సహాయ సహకారాలు అందిచడం, విజ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని పారద్రోలడం విద్యావంతుల కర్తవ్యం అని కార్యక్రమంలో హితవు పలికారు.

జీవన నైపుణ్యాలు – వ్యక్తిత్వ వికాసం

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూన్ 23 శనివారం ‘జీవన నైపుణ్యాలు – వ్యక్తిత్వ వికాసం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణగారు అధ్యక్షత వహించగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గాదిరాజు పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యక్తిత్వ వికాసంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. మనో విజ్ఞానశాస్త్రవేత్తగా, యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆమె తమ అనుభవాలు వివరించారు. సరైన ఆరోగ్యం, ఆలోచనలు, అధ్యయనం సత్ప్రవర్తన వల్ల ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతాయని డాక్టర్ జి. పద్మజ సోదాహరణంగా వివరించారు. మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో అవసరమని తెలిపారు. వాగ్భూషణం భూషణం అంటూ మాటతీరు, ఆచరణ విధానం సవ్యంగా ఉండాలని సోదాహరణంగా వివరించారు. మానవ సంబంధాలు ఆదర్శవంతంగా, ఆరోగ్యకరంగా, ఆలోచనాత్మకంగా ప్రగతిదాయకంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జరిగిన పవర్ పాయింట్ ప్రజంటేషన్, ఆమె సంధించిన ప్రశ్నావళి విద్యార్థులను ఉత్తేజపరిచాయి. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ యం. శరచ్చంద్ర మాట్లాడుతూ సంగీతం సకల మానవాళికి మానసిక ఆనందం కలిగిస్తుందని వివరించారు.