కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

యోగసాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగసేవా కేంద్రం (తెనాలి) నిర్వాహకులు శ్రీ సాళ్వయోగి గురూజీ వివరించారు. ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణగారు అధ్యక్షత వహించారు. పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగవిధానాలు ప్రపంచానికి ఎంతో మేలు చేశాయని సాళ్వయోగి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో వివిధ ఆసనాలు వేయించి వాటిప్రయోజనాలను తెలియజేశారు. యోగప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతామని స్పష్టం చేశారు. ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు, సంస్థ పెద్దలు శ్రీ ఎమ్. దినకర్గారు, శ్రీ టి.టి.అప్పారావుగారు యోగప్రాధాన్యతను వివరించారు.

వైద్య శిబిరం

13.11.2018 : జిల్లెళ్లమూడిలో నవంబరు 13 న వైద్య ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత. జ్వరములు, స్వైన్ ఫ్లూ లపై అవగాహన కార్యక్రమమునకు హాజరైన నరసాయపాలెం వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, HEO పి. వెంకటరావు, డా॥ రామారావు (రాజమండ్రి) M.B.B.S, D.C.H పిల్లల వైద్య నిపుణులు H.S. పి. నాగేశ్వరరావు, A.N.M.D. ద్వారక, బి. లావణ్య గ్రామ ఆశాకార్యకర్త జి.శ్రీలక్ష్మీ (మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్ధిని) పాల్గొన్నారు. జి.శ్రీలక్ష్మి కళాశాలలో 14 వ తేది ఉదయం ప్రత్యేకించి విద్యార్థినులకు ఉచితంగా వ్యాధినిరోధక మందులను పంచారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ.సుధామ వంశీ మరియు పాఠశాల ప్రధానో పాధ్యాయులు కె.ప్రేమకుమార్ గారి పర్యవేక్షణలో జరిగింది.

జనవరి 13న ఆరోగ్య శిబిరం

నవంబరు 13 న జిల్లెళ్లమూడిలో వైద్య ఆరోగ్య శిబిరం ముగిసింది. పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత, జ్వరాలు, స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, పి. వెంకటరావు, డా. రామరావు రాజమండ్రి J N.B.B.S, BCH పిల్లల వైద్యనిపుణులు నాగేశ్వరరావు, ఎన్.ఎమ్.ద్వారక. గ్రామ కార్యకర్త బి.లాస్య, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండడంపై పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు ఉచితంగా వ్యాధినిరోధక మందులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ప్రేమకుమార్ పాల్గొన్నారు.

ఘనంగా గురు మహోత్సవం

సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానంద గిరి స్వామి తెలిపారు.5/9/2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురు మహత్సవంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామ వంశీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువని, తాను ఆచరిస్తూ, ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపాధ్యాయులు డా.కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురు ప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరించి ఒక్కొక్కరుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఎస్. లక్ష్మణ రావు, ఎ, దినకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండముది ప్రేమ్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

సమాజంలో మానవీయ విలువలు (స్ఫూర్తి కార్యక్రమము)

ప్రభాకరస్వామివారు (హైదరాబాద్) కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవాభావము, పరస్పర సహకారం, త్యాగభావనవల్లనే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కారవంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యంగా ప్రబోధించారు.

జిల్లెళ్ళమూడి కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేది శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ పరిషత్ల అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ గారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తొలగించుకోవటానికి శారీరక శక్తిని పొందడానికి మానవుడు మహోన్నతుడు కావడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని సోదాహరణంగా తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగాచార్యులు డా॥ కె. సత్యమూర్తి మాట్లాడుతూ అష్టాంగ యోగా విధానాలు ఆరోగ్యప్రదాయకమని తెలిపారు. శరీరాన్ని మనసుతో సమన్వయం చేసే ప్రక్రియ యోగా అని వివరించారు. ద్యాసే ధ్యానం అని, మౌనం అంటే సంకల్ప వికల్ప రహిత స్థితిలో ఉండడమని అమ్మ సూత్రీకరించినట్లు వివరించారు. ద్వంద్వమును ద్వంద్వముతో జయించటం యోగమని ద్వంద్వము నుండి ఏకత్వము సాధించటానికి యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ వేదికపై యోగా శిక్షకురాలు ఎమ్. వాహిని మాట్లాడుతూ ఆసనాలు ధ్యానం ప్రాశస్త్యాన్ని సోదాహరణంగా తెలిపారు. వేదికపై విద్యార్ధినీ విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి అందరిని అలరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల సంస్కృత అధ్యాపకులు డా॥ ఎ. హనుమత్ ప్రసాద్ గారు స్వాగతం పలికి వివిధ అంశాలను వ్యాఖ్యానించి వందన సమర్పణ నిర్వహించారు. యోగసాధనను నిరంతర ప్రక్రియగా పాటించి ప్రతిఒక్కరూ ఆరోగ్యవంతులుగా వర్థిల్లాలని కళాశాల ఆంధ్రోపన్యాసకురాలు శ్వేత హితవు పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.