by admin | Mar 5, 2020 | Programs
5.3.2020 సాయంత్రం ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావుగారి సంస్మరణసభ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజిలో నిర్వహింపబడినది. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు, బ్రహ్మాండం రవీంద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ హనుమంతయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ఆచార్యులు శ్రీ కె.కోటయ్య, శ్రీ కె.సత్యమూర్తి, పొత్తూరి వారి విశిష్టతను వివరించారు. విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.కరోనా జాగ్రత్తలపై డాక్టర్ ఇనజకుమారి సూచనలు 4.9.2020 కళాశాల పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అతిభయంకరమైన కరోనవ్యాధి వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు విపులంగా వివరించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తే వెంటనే వైద్యశాలకు వచ్చి పరీక్ష చేయించుకోమని చెప్పారు.కార్యక్రమంలో ప్రెసిడెంట్ దినకర్, ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు, కాలేజి అధ్యాపకులు డాక్టర్ సుధామవంశీ పాల్గొన్నారు.కెరీర్ గైడ్ సెల్ 2020 15.3.2020 ఆదివారం కళాశాల విద్యార్థులకు డిగ్రీ అయిన తర్వాత టీచర్ ట్రయినింగ్ ఎంట్రన్సు వ్రాయటానికి తగిన తర్ఫీదు ఇవ్వటానికి ప్రిన్సిపాల్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ జి. వెంకటచారి ప్రవేశ పరీక్షలకు T.P.T. B.Ed పరీక్షలకు సంసిద్ధులయ్యందుకు తగిన శిక్షణ ఇచ్చారు.సంస్థ పెద్దలు సర్వశ్రీ దినకర్, వై.వి.శ్రీరామమూర్తి యం. శరత్చంద్రకుమార్ పాల్గొని కొన్ని సూచనలిచ్చారు. శరశ్చంద్ర పోటీపరీక్షలకు కావలసిన పుస్తకాలు కొనటానికి కొంత ధనం ఉదారంగా ఇచ్చారు.
by admin | Dec 15, 2019 | Programs
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణాలు సైతం లెక్కచేయక అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 15.12.19 ఆదివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్య గారు మాట్లాడుతూ అంతరాలు లేని జీవితం అందరికీ అందాలని కలలుకన్న ప్రాణత్యాగి పొట్టి శ్రీరాములు గారని తెలియజేశారు. లక్షమందిని ఏక పంక్తిన భోజనం చేస్తే చూడాలనుకున్న అమ్మ ఆశయం మహాద్భుతమైనదని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. విశ్రాంత ప్రిన్సిపల్ గారు డా॥ బి.ఎల్.సుగుణ, అధ్యాపకులు డా॥ కె.వి.కోటయ్యగారు భక్తిప్రపత్తులతో శ్రీరాములుగారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
by admin | Sep 18, 2019 | Programs
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నందు లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీమతి యిల్ మృదులగారికి నాగార్జున విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ పట్టాను పంపిణీశారు. శ్రీ కొండముది రామకృష్ణ గారి సాంగత్యం- పరిశీలన అనే అంశంపై ఈ పట్టాను పొందారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు యం. దినకర్ గారు, ప్రిన్సిపాల్ సుదామ వంశీ, అధ్యాపకులు అభినందించారు. శ్రీ పియస్ఆర్ అంజనేయులు గారు, బాబు గారు శుభాకాంక్షలను తెలియజేశారు. అమ్మ శేష వస్త్రాలను అందించి సత్కరించారు. కొండముది ప్రేమ కుమార్ గారు రామకృష్ణగారి రచనలపై డాక్టరేట్ పట్టాను పొందటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి పరిశోధనలు మరెన్నో చేయాలని అభిప్రాయపడ్డారు.
by admin | Aug 31, 2019 | Programs
“నీ సేవలోనే నా జీవితం సాగనీ నీధ్యాసలోనే నాశ్వాస ఆగనీ ” అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ గారి 21 వ సంస్మరణ సభ 31-8-2019 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్ధనా మందిరంలో రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ అధ్యక్షత వహించారు. సభలో రామకృష్ణ అన్నయ్య పెద్ద కుమారుడు కొండముది సుబ్బారావు, సంస్థ రెసిడెన్సియల్ సెక్రటరి రావూరి ప్రసాద్, కమిటీ సభ్యులు చక్కా శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ అన్నయ్య ఒక అడ్మినిస్ట్రేటర్ గా తన బాధ్యతలను సజావుగా నెరవేర్చారని కళాశాల ప్రిన్సిపాల్ కొనియాడారు. ఆర్. ప్రసాద్ అన్నయ్య మాట్లాడుతూ అమ్మ ఆంతరంగిక కార్యదర్శిగా, కవిగా, తత్వ ప్రచారకునిగా నిర్విరామంగా కృషి చేశారని వివరించారు. చక్కా శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ అన్నయ్యతో గల అనుబంధాన్ని, ఆదరణను, అన్నయ్యలోని కార్యదీక్ష, అంకిత భావాన్ని గుర్తు చేసుకున్నారు. కొండముది సుభారావు గారు మాట్లాడుతూ రచయితగా అనేక ప్రక్రియలను, అమ్మ సాహిత్యాన్ని ముందు తరాలవారికి అందించారని తెలియజెప్పారు. లెక్చరర్ గా పనిచేస్తున్న మృదులగారిని సభాముఖంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కొండముది ప్రేమ కుమార్ మాట్లాడుతూ అన్నయ్య నిర్వహించిన సేవా కార్యక్రమలలో తాము కూడా పాల్గొని సంస్థ అభివృద్ధికై తమ వంతు కృషిచేస్తామని తెలియజెప్పారు. కొండముది రవి అన్నయ్య రాసిన పాటలను గానం చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్. ప్రవీణ్, దుర్గా ప్రసాద్ లకు ఒక్కొక్కరికి 1,116 చొప్పున నగదు మరియు కొండముది స్మారక పురస్కారం అందించారు. ఇదే వేడుకలో చక్కా శ్రీమన్నారాయణ గారు ఫైనల్ ఇయర్ చదువుతున్న వి.శ్రావణి, కృష్ణ లకు బహుమతులను అందజేసారు. అంతేకాక సంబూరి చిరంజీవిగారు హైస్కూల్లో చదువుతున్న యమ్.నవ్య, భరత్ సాయిలకు బహుమతులను అందజేసారు. డా.యల్.మృదులగారు సభను నిర్వహించారు. అనంతరం సభలోని వారంతా కొండముది రామకృష్ణగారికి నివాళులర్పించారు.
by admin | Jan 5, 2019 | Programs
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలో మాలిక ఎంపికైంది. జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.సుధామ వంశీ, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎంపికైన అనంతరం మాలిక 2019 జనవరి 5వ తేదీన అగర్తలలో నిర్వహించే పోటీలో పాల్గోనున్నందుకు అభినందించారు. సంస్థ పెద్దలు, కళాశాల కరస్పాండెంట్ వి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు విద్యార్థిని ఎంపికపై వర్షం వ్యక్తం చేశారు. కుమార సంభవంపై ఈ పోటీ జరగనున్నట్లు తిరుపతి సంస్కృత విద్యా పీఠం వారు స్పష్టం చేశారు.
by admin | Sep 5, 2018 | Human Values, Programs
సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానంద గిరి స్వామి తెలిపారు.5/9/2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురు మహత్సవంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామ వంశీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువని, తాను ఆచరిస్తూ, ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపాధ్యాయులు డా.కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురు ప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరించి ఒక్కొక్కరుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఎస్. లక్ష్మణ రావు, ఎ, దినకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండముది ప్రేమ్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.