గురుపూర్ణిమ/Gurupoornima

గురుపూర్ణిమ/Gurupoornima

ఘనంగా గురుపౌర్ణమి కార్యక్రమం

ది 10.07.2025 గురువారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో గురుపౌర్ణమి సందర్భంగా సభాకార్యక్రమం ఘనంగా జరిగింది. గుంటూరు  హిందూ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గురు పరంపర ద్వారానే భారతదేశం విశ్వగురువుగా నిలిచిందని, గురువు జీవితానికి మార్గదర్శకుడే కాక సంస్కృతి పరిరక్షకుడుగా కూడా ఉండాలని తెలిపారు. ఎంతోమంది శిష్యులను తయారు చేయడం వలన వ్యాసభగవానుడి పేరుతో ఈ పర్వదినము వ్యాసపూర్ణిమగా పేరొందిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, Honorary Chairman శ్రీ M.దినకర్ గారు, కోశాధికారి శ్రీ జన్నాభట్ల సుబ్రహ్మణ్యం గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథికి ఘనంగా గురుసత్కారం చేశారు. అనంతరం గురుపాదుకాస్తోత్ర పారాయణ జరిగింది. కళాశాల విద్యార్థినీ విద్యార్థులే సభానిర్వహణ చేశారు. కళాశాల సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ ఆర్ వరప్రసాద్ గారు వందనసమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో  కళాశాల అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

Guru Purnima | గురు పూర్ణిమ

Guru Purnima | గురు పూర్ణిమ

గురు పూర్ణిమ

వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని 2024, జూలై 20 వ తేదీ శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ప్రత్యేక సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షభాషణ చేస్తూ గురువు యొక్క ప్రాముఖ్యతను తెలిపే పురాణ గథలలోని కథలను ఉట్టంకించి సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దడంలో గురువుదే కీలకపాత్ర అని విద్యార్థులకు సవివరంగా తెలియజెప్పారు. అనంతరం గుంటూరు TJPS కళాశాల నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. పి. దేవేందర్ గుప్తా గారు ఆషాడ పూర్ణిమ రోజన వేదవ్యాసుల వారి జన్మదినాన్ని గురుపూర్ణిమ గా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అనీ, పంచమవేదం గా కీర్తింపబడిన మహాభారతంలో గురువు ప్రాముఖ్యత ను స్థానాన్ని కర్తవ్యాన్ని సయుక్తికంగా ఉపదేశించారని వివరించారు. మానవజాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన వ్యాసుల వారి ఆశీర్వాదం మనందరికీ లభించాలని తెలిపారు. సర్వభూతముల యందు దయ కలిగి యుండుట, సత్యమార్గంలో నడుచుట, శాంతగుణాన్ని కలిగి యుండుట ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలని వ్యాసులవారు అందించిన సందేశాన్ని ప్రతి గురువు శిష్యునకు ఉపదేశించాలని వివరించారు. అంతేకాక గురువును పూజించే సంస్కారం తరువాతి తరాల వారికి అందించడం మనధర్మం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని కె. నిత్యసంతోషిణి (తెలుగు లో), కె పూజిత(సంస్కృతం లో) గురువు ప్రాశస్త్యాన్ని తమ మాటలలో చక్కగా వివరించారు. సంస్కృత విభాగం తరుపున జరిగిన ఈ సభను అధ్యక్షులు డా. ఆర్. వి.యన్.యస్.యస్ వరప్రసాద్ గారు సంచాలకులుగా వ్యవహరించగా సంస్కృత ఉపన్యాసకులు డా. వి. త్రయంబకం ధన్యవాద సమర్పణ గావించారు. కళాశాల మరియు యాజమాన్యం పక్షాన ముఖ్య అతిథికి అమ్మ ప్రసాదాన్ని అందించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం జరిగింది.