by MOC IQAC | Jul 3, 2025 | Drug Awareness, International Commemorative Days, Uncategorized
విద్యార్థుల సంక్షేమం, సమాజ పట్ల బాధ్యతను అవగాహన కల్పించేందుకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి వారు 26-06-2025 గురువారం EAGLE CLUB మరియు NSS UNIT సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేటూరు గ్రామ సచివాలయం మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి గారు విచ్చేసి మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన పరిణామాలు, సమాజంపై ప్రభావం వంటి విషయాలను వివరించారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించి, యువత మత్తుమందులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలన్న సందేశాన్ని ఇచ్చారు. సంస్కృత విభాగాధిపతి Dr. RVNSS వరప్రసాద్ గారు విద్యార్థులను ఉద్దేశించి భారతీయ జ్ఞానపరంపరలోని నైతిక విలువలు, మానసిక స్థైర్యం గురించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని NSS Convener శ్రీ T.జయకృష్ణ గారు నిర్వహించారు. NSS స్వచ్ఛంద సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొని మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ఈ అవగాహనను పెంపొందించాలనే ప్రతిజ్ఞ చేశారు. శాంతిమంత్రం తో కార్యక్రమం ముగిసింది.

by MOC IQAC | Jan 22, 2025 | Uncategorized
ప్రమాణపత్ర ప్రదానోత్సవం
ది. 22-01-2025 బుధవారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల Seminar Hall నందు Functional & Situational language (Spoken English) Certificate Course యొక్క ప్రమాణ పత్ర ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు Saints & Scientists Society వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కోర్స్ కన్వీనర్ శ్రీమతి మాధవి మధురకవి గారు మరియు Saints & Scientists Society General secretary శ్రీమతి మాధవీలత గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సుమారు 70వేలు విలువ చేసే సంస్కృత ఆంధ్ర గ్రంథాలను కళాశాల లైబ్రరీకి అందించారు. వారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఇలాంటి ఎన్నోవిధాలైన కోర్సులను Saints & Scientists సంస్థ అందించడానికి సిద్ధంగా ఉందనీ, కనుక తప్పనిసరిగా వినియోగించుకొని అన్ని రంగాలలోనూ నిష్ణాతులు కావాలని తెలిపారు. అనంతరం కోర్స్ కన్వీనర్ మాధవి మధురకవి గారు Certificate Course పూర్తి చేసిన విద్యార్థులను అభినందించి మున్ముందు కోర్సులలో మరింత చురుగ్గా పాల్గొని ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించారు. విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ ను అందించారు. చివరిగా అతిథులను అమ్మప్రసాదంతో సత్కరించారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by MOC IQAC | Dec 7, 2024 | Uncategorized
BASIC LIFE SUPPORT
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సమాజంలో తాము ఒకరమని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని బాధ్యత కలిగి ప్రవర్తించాలనే ఉద్దేశంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మాతృశ్రీ మెడికల్ సెంటర్ మరియు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వారు 7-12-2024 , 8-12-2024 శని ఆదివారాలలో రెండు రోజుల పాటు Basic Life Support అనే అంశంపై వర్క్ షాప్ జరిగింది. Assistant Professor Dr. Y Ashok (Anesthesiology) Educational Consultant, Ramesh Hospitals and team ఈ వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ వర్క షాప్ లో 120 మంది విద్యార్థులు అధ్యాపకులు మరియు మెడికల్ సెంటర్ టీమ్ పాల్గొన్నారు. డా. అశోక్ గారు తమ అనుభవంతో కూడిన లెక్చర్ ఇస్తూ రెండు రోజుల పాటు ఉదయం మనం మన చుట్టూ ఉన్న వారిని ఎలాంటి అత్యవసర చికిత్స చేయగలమో తెలిపారు. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి చేత ప్రాక్టికల్ గా ఎలా Cardiac Arrest అయిన వారికి CPR చేయవచ్చో వివరించారు. Heart Attack కి Cardiac Arrest కి మధ్య ఉన్న తేడాను గమనించి ఎలా సరైన సమయంలో స్పందించాలో తెలియజెప్పారు. మనం చేసే ప్రయత్నం ఒక నిండు జీవితాన్ని నిలబెడుతుందనే స్పృహ తో మనం ఆలోచన చెయ్యాలని చెప్పారు. విద్యార్థులందరి చేత ప్రాక్టికల్ గా CPR చేయించి వారిని అభినందిస్తూ CERTIFICATES అందించారు. మాతృశ్రీ మెడికల్ సెంటర్ బృందం Dr. జ్ఞానప్రసూన, Dr. ఇనజ కూమారి గార్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ పెద్దలు శ్రీ యమ్. దినకర్ గారు ఈ కార్యక్రమం లో పాల్గొని ఈ కార్యక్రమం ఏర్పాటు పై తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రామయ్య, భువనేశ్వరి, చాముండేశ్వరి కార్యక్రమంలో పాల్గొన్నారు.
by MOC IQAC | Aug 31, 2024 | Faculty Development Program, Uncategorized
31, ఆగష్టు 2024 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో Student centered teaching methods పై workshop నిర్వహించారు. కమీషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ నుండి డా. కె. విజయబాబు గారు resource person గా విచ్చేశారు. అధ్యాపకులకు రెండు sessions గా ఈ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా తరగతి గదిలో విద్యార్థులు అభ్యాసం చేయడానికి అనుకూలమైన వాతావారణాన్ని ఎలా సృష్టించాలి, విద్యార్థులను ఎలా భాగస్వాములను చేయాలో సవివరంగా తెలిపారు. విద్యార్థి కేంద్రిత అధ్యాపన జరిగినప్పుడే వారికి విమర్శనాత్మక ఆలోచన, సమస్యను పరిష్కరించే విధానం అలవడతాయని తెలిపారు. వీటన్నిటికంటే ముందుగా అధ్యాపకుడు సరైన ప్రణాళికను రూపొందించుకొని విద్యార్థులను ప్రోత్సహించి విద్యావిధానాన్ని మెరుగుపరచుకొని తరగతి గదిలో వర్తింపచేయవలెనని సూచించారు. ఈ వర్క్ షాప్ ద్వారా అధ్యాపకులు తమ బోధనా విలువలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తామని అందుకు ఈ వర్క్ షాప్ మరింతగా ఉపకరించిందని తెలిపారు.
by admin | Jul 10, 2023 | Uncategorized
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 27 వరకు విద్యార్థినీ, విద్యార్థులకు సంగీత శిక్షణా కార్యక్రమం జరిగింది. సంస్థ పెద్దలు, అమ్మభక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాదరావు ఈ సంగీత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా. జూలై 28 వ తేదీన అన్నపూర్ణాలయం సమావేశ మందిరంలో విద్యార్థినీ, విద్యార్థులు సంగీత కార్యక్రమం నిర్వహించి అమ్మ భక్తి గీతాలను గానం చేశారు. సంగీతం శ్రోతలను అలరించడంతో పాటు ఆనందాన్ని అనుభూతిని అందిస్తుందని సంగీత శిక్షకులు రావూరి ప్రసాదరావు వివరించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, సంస్థ పెద్దలు, వసుంధరక్కయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.యల్ సుగుణ, శ్రీ యమ్. దినకర్, శ్రీ వి. రామచంద్ర, కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ శిక్షణ ఇచ్చిన అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాదును “ఘనంగా సత్కరించారు. ఈ సంగీత శిక్షణను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్ సుగుణ, సంస్థ స్థానిక కార్యదర్శి శ్రీ.వి.రావు- “చంద్రను అభినందించి ఘనంగా సత్కరించారు