+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కళాశాల పునఃప్రారంభం : 2023-24 విద్యా సంవత్సరంకి గాను 5-06-2023 సోమవారం ఉదయం అమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్వజననీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర కుమార్ గారు, టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ యమ్. దినకర్ గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారు మరియు అధ్యాపక బృందం విద్యార్థినీ విద్యార్థులతో కలిసి లలితా సహస్రనామ పారాయణ చేశారు. అమ్మ తీర్థప్రసాదాలు స్వీకరించి కళాశాల పురోభివృద్ధికి అందరి తోడ్పాటు అవసరమని ప్రిన్సిపాల్గారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ : జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6వ తేదీ మంగళవారం ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ అనే నినాదంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల NSS UNIT తరపున జరిగిన ఈ సభను NSS కో ఆర్డినేటర్ జి. రాంబాబు గారు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్గారు అధ్యక్ష భాషణను చేస్తూ పాంచభౌతికమైన ఈ శరీరం ప్రకృతితో మమేకమై ఉన్నదని కనుక ప్రకృతి పరిరక్షణ మనందరి కర్తవ్యం అని తెలిపారు. శ్రీ జి. రాంబాబు, శ్రీ కె.సత్యమూర్తి, డా.యల్.మృదుల, శ్రీమతి ఎమ్.కవిత, శ్రీ ఆర్.వరప్రసాద్ ప్రభృతులు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను విశదీకరించారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ నినాదాలతో కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లెళ్ళమూడి గ్రామ ప్రజలకు చైతన్యాన్ని కలిగించేలా ముందుకు సాగారు