+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

2023 ఆగస్టు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం టిటిడి కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారు, శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు సభ్యులు శ్రీమతి బ్రహ్మాండం హైమ, శ్రీమతి బి.వి. సుబ్బలక్ష్మి గారు, శ్రీ ఎం. దినకర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ కొండముది సుబ్బారావు గారు సంకలనం చేసిన ‘అమ్మ వెలిగించిన దివ్య దీపం’ అనే గ్రంథమును శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారు ఆవిష్కరించారు. శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు, శ్రీ కొండముది సుబ్బారావు గారు, శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు, కాలేజీ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ శ్రీమతి సుబ్బలక్ష్మి అక్కయ్యగారు, ఆల్ ఇండియా రేడియో విశ్రాంత మ్యూజిక్ ప్రొడ్యూసర్ శ్రీ మోదుమూడి సుధాకర్ గారు, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర కుమార్ గారు తమ సందేశాలు అందించారు.
ఈ కళాశాల విశిష్టతను గుర్తించి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా రూపొందాలనీ, ఈ కళాశాల విశ్వ విద్యాలయంగా అభివృద్ధి చెందాలనీ, పూర్వ విద్యార్థుల అపూర్వ కృషి సాటిలేనిదనీ రామకృష్ణన్నయ్య సేవలు మరపురానివనీ ఈ కళాశాలను అభివృద్ధి చేయటమే అమ్మసేవ అనీ వక్తలు వివరించారు.
పెద్దలు శ్రీ తూనుగుంట్ల త్రిలోక అప్పారావు గారిని పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా సత్కరించారు. పూర్వవిద్యార్థి సమితి పక్షాన సర్వశ్రీ కె. శేషాద్రి, డి. భాస్కర రావు, డి.జగదీష్, ఎమ్. శివప్రసాద్, యస్.భవానీశంకర శర్మ గార్లు తమ అనుభవాలను తెలియజేశారు.
మాన్య సోదరులుశ్రీ అప్పారావుగారు సముచితరీతిలో తమ స్పందన తెలియచేశారు. ఈ సందర్భంగా కళాశాలలో వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు సభాకార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్కృత ఉపన్యాసకులు డా. ఆర్. వరప్రసాద్ గారు వందన సమర్పణ చేశారు.
సాయంత్రం విద్యార్థులు సమర్పించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విశిష్ట అతిథి శ్రీ మోదుమూడి సుధాకర్ గారి సంగీత విభావరి రసరంజకంగా సాగాయి.
శ్రీ సుధాకర్ దంపతులకు సహకార వాద్య బృందానికి పరిషత్తువారు అమ్మ ప్రసాదాన్ని అందించారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.