విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా తమ సృజనాత్మక శక్తిని ఇనుమడింపజేసుకోవాలని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డా. జి. పద్మజ వివరించారు. 07.09.2019 శనివారంనాటి సభలో మానసిక ఒత్తిడిని జయించడానికి ఎలాంటి శాస్త్రీయ పద్ధతులను పాటించాలో సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై కళాశాల కరస్పాండెంట్ జి. వై. యన్. బాబు మాట్లాడుతూ శాస్త్రీయ విధానాలను పాటించి విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించాలని హితవు పలికారు. సంస్థ పెద్దలు బొప్పూడి రామబ్రహ్మంగారు డా. పద్మజ కలము నుండి ఇప్పటికే ఎన్నో వ్యాసాలు మానసిక సమస్యల పరిష్కారంపై వెలువడటం హర్షణీయమని వివరించారు. ఈ సందర్భముగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రశ్నించిన అంశాలపై డా. పద్మజ గారు తగు సమాధానాలు ఇచ్చి అందరి ప్రశంసలు పొందారు. అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.