అభినందన కార్యక్రమము

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నందు లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీమతి యిల్  మృదులగారికి నాగార్జున విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ పట్టాను పంపిణీశారు. శ్రీ కొండముది రామకృష్ణ గారి సాంగత్యం- పరిశీలన అనే అంశంపై ఈ పట్టాను పొందారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు యం. దినకర్ గారు, ప్రిన్సిపాల్ సుదామ వంశీ, అధ్యాపకులు అభినందించారు.  శ్రీ పియస్ఆర్ అంజనేయులు గారు, బాబు గారు  శుభాకాంక్షలను తెలియజేశారు. అమ్మ శేష వస్త్రాలను అందించి సత్కరించారు. కొండముది ప్రేమ కుమార్ గారు రామకృష్ణగారి రచనలపై డాక్టరేట్ పట్టాను పొందటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి పరిశోధనలు మరెన్నో చేయాలని అభిప్రాయపడ్డారు.

STUDENTS’ STRESS COUNSELING

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా తమ సృజనాత్మక శక్తిని ఇనుమడింపజేసుకోవాలని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డా. జి. పద్మజ వివరించారు. 07.09.2019 శనివారంనాటి సభలో మానసిక ఒత్తిడిని జయించడానికి ఎలాంటి శాస్త్రీయ పద్ధతులను పాటించాలో సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై కళాశాల కరస్పాండెంట్ జి. వై. యన్. బాబు మాట్లాడుతూ శాస్త్రీయ విధానాలను పాటించి విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించాలని హితవు పలికారు. సంస్థ పెద్దలు బొప్పూడి రామబ్రహ్మంగారు డా. పద్మజ కలము నుండి ఇప్పటికే ఎన్నో వ్యాసాలు మానసిక సమస్యల పరిష్కారంపై వెలువడటం హర్షణీయమని వివరించారు. ఈ సందర్భముగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రశ్నించిన అంశాలపై డా. పద్మజ గారు తగు సమాధానాలు ఇచ్చి అందరి ప్రశంసలు పొందారు. అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వినాయక చవితి వేడుకలు

మాతృ గణపతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో 2.09.2019 నుండి 4.09 2019 వరకు ఘనంగా జరిగాయి. అధ్యాపకుల సూచనలతో విద్యార్థినీ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో విద్యార్థి గణపతి ప్రతిమకు శాస్త్రోక్త విధానాలతో పూజలు జరిపారు. సంస్థ పెద్దలు పూజా కార్యక్రమములో పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు కళాశాల పూర్వ విద్యార్థి ఉన్నవ గణేష్ శమంతకోపాఖ్యానమును శ్రోతకులకు వినిపించారు. అదేరోజు పోలూరి శ్రీకాంత్(పూర్వ విదార్థి) తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకొన్నారు. రెండవ రోజు కార్యక్రమంలో భరద్వాజ్ నృత్యాలు ప్రదర్శించి చూపరులను అలరించారు. అలాగే కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన దూరదర్శన్ దూకుడు, బాల్యవివాహాలు, తెలివైన యజమాని తింగరి పనిమనిషి, భాషతెచ్చిన తంటాలు, మూకీ డ్రామా, జై జవాన్ జై కిసాన్ మొదలైన హాస్య నాటికలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. సినీ పాటల నృత్యాలు విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శించారు. పూర్వ విద్యార్థి దామోదర గణపతి తన జానపద పాటలతో పిల్లలలో ఉత్సాహాన్ని నింపారు. మూడవ రోజు గణపతిబప్పా మోరియా అంటూ గణేష్ నినాదాలతో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఎంతో క్రమశిక్షణతో, ఐకమత్యముతో వినాయకచవితి వేడుకలను జయప్రదం చేశారు.

గణపతి ఉత్సవాలు

గణపతి ఉత్సవాలు తిరుమల తిరుపతి సంస్థానం కళ్యాణ మండపంలో 2.09.2019 నుండి 409 2019 వరకు ఘనంగా జరిగాయి. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ. సుదామ వంశీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యాపకుల సూచనలలో విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి ప్రతిమకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సంస్థ పెద్దలు పూజా కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పలు కార్యక్రమాలు నిర్వహించారు.

కొండముది రామకృష్ణ గారి 21వ సంస్కరణ సభ

“నీ సేవలోనే నా జీవితం సాగనీ నీధ్యాసలోనే నాశ్వాస ఆగనీ ” అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ గారి 21 వ సంస్మరణ సభ 31-8-2019 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్ధనా మందిరంలో రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ వంశీ అధ్యక్షత వహించారు.  సభలో రామకృష్ణ అన్నయ్య పెద్ద కుమారుడు కొండముది సుబ్బారావు, సంస్థ రెసిడెన్సియల్ సెక్రటరి రావూరి ప్రసాద్, కమిటీ సభ్యులు చక్కా శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ అన్నయ్య ఒక అడ్మినిస్ట్రేటర్ గా తన బాధ్యతలను సజావుగా నెరవేర్చారని కళాశాల ప్రిన్సిపాల్ కొనియాడారు. ఆర్. ప్రసాద్ అన్నయ్య మాట్లాడుతూ అమ్మ ఆంతరంగిక కార్యదర్శిగా, కవిగా, తత్వ ప్రచారకునిగా నిర్విరామంగా  కృషి చేశారని వివరించారు. చక్కా శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ అన్నయ్యతో గల అనుబంధాన్ని, ఆదరణను, అన్నయ్యలోని కార్యదీక్ష, అంకిత భావాన్ని గుర్తు చేసుకున్నారు. కొండముది సుభారావు గారు మాట్లాడుతూ రచయితగా అనేక ప్రక్రియలను, అమ్మ సాహిత్యాన్ని ముందు తరాలవారికి అందించారని తెలియజెప్పారు. లెక్చరర్ గా పనిచేస్తున్న మృదులగారిని సభాముఖంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కొండముది ప్రేమ కుమార్ మాట్లాడుతూ అన్నయ్య నిర్వహించిన సేవా కార్యక్రమలలో తాము కూడా పాల్గొని సంస్థ అభివృద్ధికై తమ వంతు కృషిచేస్తామని తెలియజెప్పారు. కొండముది రవి అన్నయ్య రాసిన పాటలను గానం చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్. ప్రవీణ్, దుర్గా ప్రసాద్ లకు  ఒక్కొక్కరికి 1,116 చొప్పున నగదు మరియు కొండముది స్మారక పురస్కారం అందించారు. ఇదే వేడుకలో చక్కా శ్రీమన్నారాయణ గారు ఫైనల్ ఇయర్ చదువుతున్న వి.శ్రావణి, కృష్ణ లకు బహుమతులను అందజేసారు. అంతేకాక సంబూరి చిరంజీవిగారు హైస్కూల్లో చదువుతున్న యమ్.నవ్య, భరత్ సాయిలకు బహుమతులను అందజేసారు. డా.యల్.మృదులగారు సభను నిర్వహించారు. అనంతరం సభలోని వారంతా కొండముది రామకృష్ణగారికి నివాళులర్పించారు.