శబ్దకాలుష్యం నివారించండి – స్వామి ఓంకారానందగిరి పిలుపు

సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో శబ్దకాలుష్యం నానాటికీ అధికమవుతూ అగ్రస్థానంలో ఉందని కాలుష్య నివారణలోనూ, ఆరోగ్య సాధనలోనూ యోగ విభాగానికి ప్రాధాన్యము లభిస్తున్నట్లు వివరించారు. శబ్దం శ్రవణ సుఖంగా సుభగంగా ఉండాలని సంగీతశాస్త్రం మానవజాతి వికాసంలో భాగం కావాలని ఆయన హితవు పలికారు. కర్ణభేరిని బ్రద్దలు చేసే విపరీత శబ్దాలకు మాధుర్యం ఉండదని సోదాహరణంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

భగవద్గీత చెప్పిన జీవిత విలువలు

అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు. “స్వధర్మే నిధనం శ్రేయః” అని
భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు వివరించారు. 22.7.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘భగవద్గీత – లైఫ్ స్కిల్స్’ అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ భగవద్గీతలోని అనేక విషయాలు నిత్యజీవితంలో పాటించగలిగితే జీవనం సుగమం అవుతుందని వివరించారు. భగవద్గీత మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దగలదని, యోగము అనగా సమత్వము అని అది అమ్మ మనకు ఆచరణలో చూపించిందని, విద్యార్థులంతా అమ్మ తత్వాన్ని కూడా అలవర్చుకోవాలని తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశీ గారి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో 1976-78 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు పాల్గొనటం విశేషం.

గురుపౌర్ణమి

సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దడంలో గురువుదే కీలకపాత్ర అని ఉభయపరిషత్తుల జనరల్ సెక్రెటరీ శ్రీదేశిరాజు కామరాజుగారు వివరించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఈ నెల 16వ తేదీ మంగళవారం వాత్సల్యాలయంలో జరిగిన గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన తమ సందేశం అందించారు. ఇదే వేదికపై అమ్మ భక్తులు టి.టి. అప్పారావు గారు అజ్ఞానాన్ని పారద్రోలి సమాజాన్ని జ్ఞానకాంతులతో ప్రకాశింప జేసే గురువుకు సమాజంలో సమున్నత స్థానం లభించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అధ్యాపకులు డాక్టర్ కె.వి.కోటయ్యగారు. మాట్లాడుతూ గురుపౌర్ణమి అందించే సందేశాన్ని విద్యార్థులు త్రికరణశుద్ధిగా పాటించాలని హితవు పలికారు. గురుపౌర్ణమిలో ప్రధాన కార్యక్రమముగా అమ్మ జీవితచరిత్ర పారాయణాన్ని బ్రహ్మాండం వసుంధర అక్కయ్యగారు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవాలని జ్ఞానకాంతులు ప్రకాశించాలని కోరుతూ పెద్ద ఎత్తున అమ్మ భక్తురాలు అయిన సుబ్బలక్ష్మిగారి పర్యవేక్షణలో దీపాలంకరణ నిర్వహించారు.

విజయవంతంగా సంస్కృత సంభాషణ

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సంస్కృత భాషదే అని విశ్వజననీ సంపాదకులు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ పి.యస్.ఆర్ ఆంజనేయులు గారు వివరించారు. జూలై 12 వ తేదీ శుక్రవారం కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సంస్కృత భాషా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ భాషలలో సంస్కృతానికి సముచిత స్థానం లభించడానికి ఆనాటి సంస్కృత వాఙ్మయమే ప్రధాన కారణమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.వి. సుధామ వంశీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబు మాట్లాడుతూ సంస్కృత భాషా శిబిరాలను తరచుగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వేదాలు, ఉపనిషత్తులు, సారస్వత వాఙ్మయం, సంస్కృత భాషలోనే ఉందని వివరించారు. విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో సంస్కృత భాషను సమగ్రంగా నేర్చుకోవడానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంస్కృత అధ్యాపకులు డా అన్నదానం. హమమత్ ప్రసాద్ గారు. స్వాగతం పలుకగా, సంస్కృత అధ్యాపకులు డా. పావని వందన సమర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు సంస్కృతంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

విజయవంతంగా సంస్కృత సంభాషణ శిబిరాలు

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సంస్కృత భాషదే అని విశ్వజననీ సంపాదకులు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులు గారు వివరించారు. జులై 12వ తేది శుక్రవారం కళాశాల ప్రార్థనా మందిరంలో జరిగిన సంస్కృత భాషా విబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ భాషలలో సంస్కృతానికి సముచిత స్థానం లభించడానికి ఆనాటి సంస్కృత వాఙ్మయమే ప్రధాన కారణము అని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ అయిన డాక్టర్ ఎ.వి సుధామవంశీ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్. బాబు మాట్లాడుతూ సంస్కృత భాషా శిబిరాలను తరచుగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రపంచాన్నే ఆకట్టుకన్న వేదాలు, ఉపనిషత్తులు సారస్వత వాఙ్మయం సంస్కృత భాషలోనే ఉందని వివరించారు. విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో సంస్కృతభాషను సమగ్రంగా నేర్చుకోవడానికి కృషి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు సంస్కృతంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తదనంతరం జరిగిన సంస్కృత శిబిర నిర్వహణ సభ్యులు పలువురు అభినందించారు. శిబిరంలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన విద్యార్థులందరికి శ్రీ ఆంజనేయప్రసాద్ గారు నగదు బహుమతి ఇచ్చారు.