by admin | Jun 3, 2019 | Orientation Programm
విద్యారంగం పురోగతిలో నాక్ (NAAC) పాత్ర ప్రగతి ప్రదాయకమని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.ఎన్.బాబు వివరించారు. ఓరియంటేషన్ కార్యక్రమం జూన్ 3 వ తేది సోమవారంగుంటూరులోని హిందూ కళాశాలలో జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, గుంటూరు హిందూ కళాశాలలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యాపకులు శ్రీ కె.వి.ఎస్.దుర్గాప్రసాద్ (హిందూ కళాశాల), డా॥ కె.విజయబాబు, IQAC కో-ఆర్డినేటర్, ప్రభుత్వ మహిళా కళాశాల, ఎమ్. వేనుబాబు తాడికొండ, డా|| ఎ. లీలామోహన్ విజ్ఞాన్ యూనివర్సిటీ, డా॥ పి.వేణుగోపాల్ హిందూ కళాశాల, డా॥ డి.ఎన్. దీక్షిత్, డా॥ ఎ.సుధామ వంశీ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ పలువురు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఉభయ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్, పురుషోత్తమ పుత్ర భార్గవ శ్రీ పి.ఎస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్, (విశ్వజననీ సంపాదకులు) మాతృశ్రీ విద్యా పరిషత్ కన్వీనర్ బొప్పూడి. రామబ్రహ్మం గారు, పలువురు అధ్యాపకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనలోను NAAC పాత్ర కీలకమని పలువురు వక్తలు వివరించారు. NAAC న్యూ మెథడాలజి ఓవర్ వ్యూ ను డా॥ విజయాబ్బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేసారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డా॥ ఎ. సుధామ వంశీ NAAC ప్రోగ్రామ్ కై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. NAACకు సంబంధించిన అనేక అంశాలను సోదాహరణంగా వివరించడం పట్ల మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది తమ కృతజ్ఞతలు తెలిపారు.
by admin | Apr 4, 2019 | Faculty Achievements
మాతృ శ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ అధ్యాపకులు డాక్టర్ యస్.యల్.ప్రసన్నాంజనేయశర్మ, డాక్టర్ యస్.యల్.నరసింహం గారలు 4-4-19న దేశరాజధాని ఢిల్లీలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాల్ని స్వీకరించారు.
by admin | Feb 23, 2019 | Awarness Programs
23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పేద విద్యార్థులకు ఉచిత విద్య భోజన సదుపాయాలను కల్పించడమే కాకుండా వారికి ఉజ్జ్వలమైన భవిష్యత్తును అందించే విధంగా ప్రయత్నిస్తుంది. విద్యనభ్యసించి పై చదువులు చదవలేని వారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తమ స్వయం ప్రతిపత్తితో చదువుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. దీనిలో భాగంగా గుంటూరు మాస్టర్మైండ్స్ కళాశాల నుండి అకాడమిక్ ఇన్చార్జ్ విజయకుమార్, ప్రిన్సిపాల్ పి.సుబ్రహ్మణ్యం గారు Earn while learning కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులు జూనియర్ కళాశాలలో పనిచేస్తూ పి.జి. చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకుగాను Final year విద్యార్థులను campus selection లా తీసుకోవడం జరుగుతోంది అన్నారు.
by admin | Feb 23, 2019 | Awarness Programs
23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఫిబ్రవరి 23వ తేదీన శనివారం జరిగిన సభలో శ్రీ దినకర్ సంస్థ ప్రెసిడెంట్ బి. రామబ్రహ్మంగారు కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ జయంత్ చక్రవర్తి ఈ సభలో పిల్లలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ ఎ.హనుమత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ డిగ్రీస్థాయి విద్యార్థులు ప్రతీ అంశాన్నీ కంఠస్థం చేస్తేనే దేనికైనా సమాధానాన్ని వ్రాయగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
by admin | Feb 21, 2019 | Uncategorized
21.02.2019 న అమ్మ ఆగమనోత్సవం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలోని విద్యార్థుల వసతి గృహం వద్ద అమ్మ పూజ జరిగింది. సంస్థ పెద్దలు శ్రీ. యమ్. దినకర్, శ్రీ. యమ్. శరచ్చంద్ర, దేశిరాజు కామరాజు, రావూరి ప్రసాద్, బి. రామచంద్ర, డా॥ బి.యల్. సుగుణ, చక్కా శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది.