by MOC IQAC | Nov 12, 2024 | Special Days
కాళిదాస జయంతి
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 12.11. 24 వ తేదీన “కాళిదాస జయంతి”ని పురస్కరించుకుని సంస్కృత విభాగం వారు సభను నిర్వహించడం జరిగింది. తొలుత ఈసభకు అధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.AVNG హనుమత్ ప్రసాద్ గారు కాళిదాసు రచన వైశిష్ట్యాన్ని వివరించారు. సభకు విశిష్టాతిథి, ప్రధాన వక్తగా పాల్గొన్న శ్రీమతి Dr. SVSL ఫణి కామేశ్వరి గారు తమ ప్రసంగం లో కాళిదాసు రచనలు, వర్ణనా నైపుణ్యం,శైలి, ఉపమాలంకార ప్రయోగములు, మొదలగు విషయములను ఉదాహరణలతో వివరించడం జరిగింది. కార్యక్రమంలో పి. డి. సి. ఫస్టియర్ విద్యార్థిని వి. మీనాక్షి, BA OL తృతీయ సంవత్సరము విద్యార్థి పి. లక్ష్మయ్య మహాకవి కాళిదాసు గురించి మాట్లాడటం జరిగింది. ఎస్. దేవి బృందం సంస్కృత గీతమును ఆలపించారు .సభా కార్యక్రమంలో చివర విశిష్టాతిథిని ‘అమ్మ ప్రసాదం’తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు సభా నిర్వహణ కళాశాల IQAC Coordinator Dr.V.పావని గారు నిర్వహించగా, సంస్కృత అధ్యాపకులు Dr.V. త్రయంబకం గారు, వందన సమర్పణ చేయగా శాంతి మంత్రంతో సభను ముగించటం జరిగింది.
by MOC IQAC | Oct 19, 2024 | Faculty Development Program, Skill Programmes
A faculty development program in communication skills was started on 16th October 2024 at Matrusri Oriental College, Jillellamudi. Smt. Anuradha was the resource person. All teaching and non-teaching staff participated in this program. Smt. Anuradha explained the objectives and outcomes of the program. On 19th October 2024, she addressed MOC students. With renewed confidence, some of the staff members gave feedback in English. All staff members felicitated Smt. Anuradha with Amma prasadam. By the end of this program, Smt. Anuradha announced these communication classes would be continued online from 23rd October onwards. The program was concluded with the Santhi mantra.
by MOC IQAC | Oct 17, 2024 | Special Days
వాల్మీకి జయంతి
17-10-2024, గురువారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వాల్మీకి జయంతి ని పురస్కరించుకొని ప్రత్యేక సభ ఏర్పాటు చేయబడింది. కళాశాల పూర్వ చరిత్ర అధ్యాపకులు, రామాయణ రసభారతి బిరుదాంకితులు, విశ్వజనని మాసపత్రిక సంపాదకులైన శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు కళాశాల విద్యార్థులకు,అధ్యాపకులకు రామాయణ ప్రాశస్త్యాన్ని తెలియజేసారు. సాహితీలోకానికి మార్గదర్శకుడైన వాల్మీకి మహర్షి భావుకతనూ, రచనా వైచిత్రినీ, శబ్ద గాంభీర్యమునూ శ్రీమల్లాప్రగడ వారు సభలో ఆవిష్కరించారు. వీరి ప్రసంగం విన్న విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో రామాయణం లోని లౌకిక, అలౌకిక అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలనే కుతూహలాన్ని కనబరిచారు. కళాశాల సంస్కృతవిభాగం పక్షాన జరిగిన ఈ సభకు ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించి వాల్మీకి మహర్షికి పుష్పాంజలి ఘటించారు. విభాగాధిపతి డా. ఆర్. వరప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆత్మీయ అతిథి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
by MOC IQAC | Sep 28, 2024 | Special Days
28-9-2024 న గుఱ్ఱం జాషువా జయంతి నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱంజాషువా జయంతి సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గుఱ్ఱం జాషువా జయంతి సభ ఏర్పాటు చేయబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహించగా తెలుగు విభాగాధిపతి శ్రీమతి యల్ మృదుల సభా ప్రాతినిధ్యాన్ని వహించారు. తెలుగు అధ్యాపకులు శ్రీ టి. జయకృష్ణ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సమకాలీన కవిత్వ ఒరవడియైన భావకవిత్వరీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన మహనీయుడు జాషువా అని ఆయన రచనలను, వైశిష్ట్యాన్ని, వారి కవితా మాధుర్యాన్ని చవిచూపారు. తెలుగు విభాగ అధ్యక్షురాలు డా. యల్. మృదుల మాట్లాడుతూ అవమానాలు పొందిన చోటే సత్కారాలను పొందిన జాషువా జీవితవిశేషాలను తెలియజేశారు. అనంతరం తెలుగు అధ్యాపకులు శ్రీ జి. వీరాంజనేయులు జాషువా రచనలలోని దేశభక్తి పాటతో విద్యార్థులలో చైతన్యాన్ని కలిగించారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
by MOC IQAC | Sep 23, 2024 | Orientation Programmes
Orientation program on Institutional Values and Best Practices
ది. 23 – 9 – 2024 సోమవారం కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. డాక్టర్ బి వరలక్ష్మి గారు రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. డాక్టర్ వరలక్ష్మి గారు సంస్థాగత విలువలను పాటించడము మరియు ఉత్తమ విధివిధానాలను ఏర్పాటు చేసుకోవడం, వాటి ప్రాముఖ్యతను గురించి కీలకమైన ప్రసంగాన్ని చేశారు. అనంతరం కళాశాల అభివృద్ధిలో నిరంతరం పాలుపంచుకుంటున్న బొప్పూడి రామబ్రహ్మంగారు విద్యాపరమైన పురోగతిని సాధించడంలో సంస్థ యొక్క విధివిధానాలను ఎలా రూపొందించుకోవాలో సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమము కళాశాల IQAC ద్వారా విజయవంతంగా నిర్వహించబడింది.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారు బి వరలక్ష్మి గారిని మరియు బొప్పూడి రామబ్రహ్మం గారిని కళాశాలకు స్వాగతించారు. వరలక్ష్మి గారు విద్యార్థులతో మాట్లాడుతూ సంస్థ యొక్క విలువలను పెంచే మార్గాలను అనుసరిస్తూ సంస్థ అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని ఆశీర్వదించారు. అనంతరం బి. వరలక్ష్మి, శ్రీరామచంద్ర మూర్తి దంపతులకు అమ్మ ప్రసాదంతో అధ్యాపకులందరూ సత్కరించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.