by MOC IQAC | Sep 5, 2024 | National Commemorative Days, Teachers Day
ఉపాధ్యాయదినోత్సవం
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల లో 2024, సెప్టెంబర్ 5 వ తేదీ గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వినూత్నమైన విద్యాబోధనను అందించడానికి విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు చొరవ చూపించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉపాధ్యాయపాత్రలను పోషించి తమ జూనియర్ విద్యార్థులకు బోధించడానికి అవకాశం ఇవ్వబడింది. ఈ విధంగా participative learning ద్వారా విద్యార్థులు విద్యాబోధనకు ముందుగా planning, presentation, communication, and interaction వంటి చర్యలలో కావలసిన నైపుణ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులను ఉపాధ్యాయుల పాత్రలను పోషించేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే collaborative learning మరియు Peer to peer interaction పై దృష్టి సారించేందుకు ఎంతగానో ఉపకరించింది. విద్యార్థులు తమ గురుభక్తిని తెలుపుతూ గురువులను అందరినీ సత్కరించారు. విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంత్యుత్సవాన్ని తమ చేతుల మీదుగా నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తరగతి గదులలో విద్యాబోధన జరుగుతున్న విధానం నుంచి సాయంత్రం సభానిర్వహణ వరకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డా. యల్. మృదుల గారి పర్యవేక్షణలో జరిగింది. అధ్యాపకులందరూ విద్యార్థులకు ఆశీర్వాద వచనాలను అందించారు.
by admin | Sep 5, 2018 | Teachers Day
సమాజాన్ని సంస్కారవంతముగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానందగిరిస్వామి తెలిపారు. 5-9-2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుపూజా మహోత్సవంలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువనీ, తాను ఆచరిస్తూ ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురుప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమములో సంస్థపెద్దలు సిబ్బంది పాల్గొన్నారు.
by admin | Jul 27, 2018 | National Commemorative Days, Teachers Day
సుప్రసిద్ధ ఉపన్యాసకుడు, ‘ప్రవచన సమ్రాట్’, ‘రామాయణరసభారతి’, ‘ప్రసన్నవ్యాస’గా లోకంలో ప్రసిద్ధులైన ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారిని 27.7.2018 వ్యాసపూర్ణిమ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజించటం జరిగింది.
ఆ సందర్భంగా జరిగిన సభలో శ్రీ విశ్వజననీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యం. దినకర్, కాలేజి కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణ శ్రీమన్నారాయణమూర్తి విశిష్టతను గూర్చి ప్రసంగించారు. డాక్టర్ శిష్ట్లా ప్రసాద్ సభాహ్వానం పలుకగా శ్రీ సత్యనారాయణమూర్తి వందన సమర్పణ చేశారు.
శ్రీశ్రీమన్నారాయణమూర్తిగారు వ్యాసుని విశిష్టతను, గురువు యొక్క అవసరాన్ని, వ్యాసుడు పలికిన సూత్రాలలోని గొప్పతనాన్ని అమ్మ ఏలా అనుభవంలో అందరికీ అందించిందీ చెప్పిన మహాద్భుత సమన్వయసారం అందరినీ ముగ్ధులను చేసింది. అమ్మ ఏకాదశినాడు అవతరించిందని, వ్యాసుడు ఆదిముని లోకరక్షణ చేయటానికి పూర్ణిమనాడు ఉద్భవించాడనీ, ఇద్దరూ లోకానికి అందించిన సూత్రాలూ, సంస్కారాలు జగజ్జాగృతికి ఉపయోగపడుతున్నాయని వ్యాసహృదయాన్ని, అమ్మ అనుభవ వేదాంత నిధులను రంగరించి అందించారు సంస్థ సముచితరీతిని సత్కరించింది.
తదనంతరం వాత్సల్యాలయ ప్రాంగణంలో సామూహికంగా డాక్టర్ బి.యల్.సుగుణగారి నేతృత్వంలో ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ పారాయణ చేశారు. సాయంకాలం సోదరి ఎమ్.వి. సుబ్బలక్ష్మి గారి కృషితో జ్యోతిస్వరూపిణి, జ్ఞానరూపిణి అమ్మ శ్రీ చరణాల చెంత అసంఖ్యాకంగా దీపాలను వెలిగించి భక్తితో అమ్మ నామ సంకీర్తన చేసి మంగళహారతి నిచ్చారు.