by admin | Dec 2, 2019 | Health & Hygeine
“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారాలను సూచించారు.
by admin | Sep 7, 2019 | Personality Development
విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా తమ సృజనాత్మక శక్తిని ఇనుమడింపజేసుకోవాలని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డా. జి. పద్మజ వివరించారు. 07.09.2019 శనివారంనాటి సభలో మానసిక ఒత్తిడిని జయించడానికి ఎలాంటి శాస్త్రీయ పద్ధతులను పాటించాలో సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై కళాశాల కరస్పాండెంట్ జి. వై. యన్. బాబు మాట్లాడుతూ శాస్త్రీయ విధానాలను పాటించి విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించాలని హితవు పలికారు. సంస్థ పెద్దలు బొప్పూడి రామబ్రహ్మంగారు డా. పద్మజ కలము నుండి ఇప్పటికే ఎన్నో వ్యాసాలు మానసిక సమస్యల పరిష్కారంపై వెలువడటం హర్షణీయమని వివరించారు. ఈ సందర్భముగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రశ్నించిన అంశాలపై డా. పద్మజ గారు తగు సమాధానాలు ఇచ్చి అందరి ప్రశంసలు పొందారు. అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
by admin | Aug 29, 2019 | Language & Communication Skills
తెలుగు భాషా సాహిత్యాలు ప్రజల సంపదగా ప్రాచుర్యం పొందాలని ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీగారు ఆగష్టు 29న జరిగిన తెలుగు మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుభాష ప్రజలభాషగా వర్ధిల్లాలని గిడుగు రామమూర్తి పంతులుగారు భాషోద్యమం నిర్వహించినట్లు తెలిపారు. కళాశాల ఆంధ్రశాఖ ప్రతినిధి డా. ఎల్. మృదులగారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. అధ్యాపకులు డా. కె.వి. కోటయ్య, సర్వశ్రీ మడకా సత్యనారాయణ, పి. మధుసూధనరావు, కె. శ్వేత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మాతృభాషా గీతాలను గానం చేశారు. గిడుగు రామమూర్తి చేసిన కృషిని వివరించి శ్రోతల మన్ననలు పొందారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గిడుగు రామమూర్తిపంతులు గారి చిత్రపటానికి పుష్పమాలాలంకరణ నిర్వహించి జేజేలు పలికారు
by admin | Aug 14, 2019 | Human Values
రామాయణంలోని మానవీయ విలువలు నైతిక ఆదర్శాలు సార్వకాలిక, సార్వజనీన లక్షణాలతో వర్ధిల్లుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్ మూర్తి గారు వివరించారు. ఆగష్టు 14 వ తేదీన కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సాహిత్య సమావేశంలో ‘శ్రీమద్రామాయణం – అహల్య’ అనే అంశంపై మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ.సుధామ వంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని హితవు పలికారు. కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీ జి.వై.ఎన్.బాబు. విశ్వజననీ సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్, దర్శనం పత్రిక సంపాదక సభ్యులు శ్రీ ప్రసాదవర్మ కామఋషి, సంస్థ పెద్దలు శ్రీటి.టి. అప్పారావు, శ్రీచక్కా శ్రీమన్నారాయణగారు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పలువురు సందర్శకులు పాల్గొన్నారు.
by admin | Aug 12, 2019 | Human Values
అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వి.యన్.బాబుగారు మరియు ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్యగారు అన్నపూర్ణాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్. దినకర్ గారు పాల్గొన్నారు. కళాశాలను ఒక ఉన్నతమైన లక్ష్యంతో అమ్మ స్థాపించిందని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ విద్య, భోజన, వైద్య సంరక్షణ సదుపాయాలు కొనసాగుతున్నాయని రామబ్రహ్మం గారు తెలియజెప్పారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భగవద్గీత మానవతా.. విలువలను పెంపొందించే ఒక అద్భుతమైన గ్రంథమని పలు ఉదాహరణలతో సవివరంగా తెలియజెప్పారు. కళాశాల పక్షాన డా॥ సుధామవంశి, డా॥ కె.వి.కోటయ్య, డా॥ ఎ.హనుమత్ ప్రసాద్ లు భగవద్గీత ప్రాశస్త్యాన్ని విద్యార్ధులకు వివరించారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లములతో విద్యార్థులు తమకు తెలిసిన విషయాలను చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు పి. మధుసూదన్ గారు నిర్వహించారు. సంస్కృత ఆంధ్రాలను అభ్యసిస్తున్న మనమందరం సంస్కృతిని, భగవద్గీతలోని అంతర్యాన్ని భావితరాలకు వ్యాపింపజేయాలని రామబ్రహ్మంగారు పిలుపునిచ్చారు. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది.
by admin | Jul 22, 2019 | Human Values
అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు. “స్వధర్మే నిధనం శ్రేయః” అని
భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు వివరించారు. 22.7.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ‘భగవద్గీత – లైఫ్ స్కిల్స్’ అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ భగవద్గీతలోని అనేక విషయాలు నిత్యజీవితంలో పాటించగలిగితే జీవనం సుగమం అవుతుందని వివరించారు. భగవద్గీత మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దగలదని, యోగము అనగా సమత్వము అని అది అమ్మ మనకు ఆచరణలో చూపించిందని, విద్యార్థులంతా అమ్మ తత్వాన్ని కూడా అలవర్చుకోవాలని తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశీ గారి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో 1976-78 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు పాల్గొనటం విశేషం.