by admin | Jun 21, 2021 | Yoga
జూన్ 21వ తేదీ బుధవారంనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సభ జరిగింది. ఉదయం 10 గంటలకు కళాశాల ప్రిన్సిపల్(IC) డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు తమ అధ్యక్షోపన్యాసంలో కర్మభూమి అయిన మన భారతదేశంలో మానవుడు చిరంజీవిగా ఉండేందుకు ఋషులు మనకు అందించిన శాస్త్రాలలో యోగ శాస్త్రం ఒకటని తెలిపారు. మానవునిలోని షడ్చక్రాలను చైతన్య పరచడమే దీని లక్ష్యమని అష్టాంగ యోగంలో ప్రధానమైన ఆసన, ప్రాణాయామాల ద్వారా మనో నిగ్రహాన్ని కలిగించుకోగలమని వివరించారు. అనంతరం ఆత్మీయ అతిథి ఓంకారానంద గిరిస్వామి గారు రచించిన *సుగతి యోగం* అనే పుస్తకాన్ని ప్రిన్సిపాల్ గారు ఆవిష్కరించారు.
గారు సుగతి యోగంలోని విషయాలను తెలియపరుస్తూ రచయిత జిల్లెళ్ళమూడి అమ్మ చరిత్రను సంగ్రహించి వ్రాయ తలపెట్టిన తనకు అమ్మ జీవితమే ఒక దివ్య యోగంలా అనిపించి ఆమెను యోగమూర్తిగా దర్శించి దివ్యమైన అనంతమైన జీవిత పరమావధిని తెలుపుతూ ఈ పుస్తకాన్ని రచించినట్లుగా చెప్పారు. *ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచ్యతే* అని చెప్పిన యోగశిఖోపనిషత్తుకు దగ్గరగా అమ్మ ‘ద్వంద్వాల మీదనే ఈ సృష్టి ఆధారపడి ఉంద’ని తెలిపిందన్నారు.
జాండ్రపేట నుంచి ప్రముఖ యోగాచార్యులు శ్రీ పద్మనాభుని తులసీరావు మాధవి దంపతులు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ ఆర్. వరప్రసాద్ గారు విశిష్ట అతిథిని సభకు పరిచయం చేశారు. తులసీ రావు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అందరిలో ఉండే ఉత్సాహమే ఉత్సవంగా మారుతుంది కనుక అందరూ చిన్నచిన్న యోగాసనాల ద్వారా ఆరోగ్యవంతులుగా ఉత్సాహవంతులుగా ఉండవచ్చునని తెలిపారు. యోగ అంటే కలయిక ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ రెండింటిని సమతుల్యం చేసుకోగలిగితే మనలో ఉన్న అనంతమైన శక్తి బయటకు వస్తుందని వివరించారు. పార్టిసిపేటివ్ మెథడ్ అనుసరిస్తూ విద్యార్థులతో మాట్లాడిస్తూ చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం ద్వారా వచ్చే శక్తిని ప్రత్యక్షంగా అనుభవించేలా చేశారు. మన ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉండగలదని తెలిపారు. కార్యక్రమంలో సత్యమూర్తి గారికి తులసిరావు, మాధవి దంపతులకు అమ్మ ప్రసాదాన్ని అందించి సత్కరించారు. కార్యక్రమం ఆసాంతం తెలుగు ఉపన్యాసకులు శ్రీ బి.వి. శక్తిధర్ గారు సభా నిర్వహణ చేయగా డాక్టర్ యల్. మృదుల గారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వందన సమర్పణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by admin | Dec 2, 2020 | Personality Development
సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన నినాదాలని జి.యల్.మునోహర్ గారు తెలిపారు. ది. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. ఇక్కడ చదివే విద్యార్థులు అమ్మ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందియున్నారని మనోహర్ గారు తెలిపారు. విద్యార్థులతో మమేకమై, పలువిధాలుగా ప్రశ్నించి నిజమైన వ్యక్తిత్వం అంటే ఏమిటో వారి నుంచి రాబట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. వ్యక్తిత్వమనేది మానవునికి కనిపించని భూషణమనీ, మనలోని ఆలోచనలకి, భావాలకి, ప్రవర్తనకి సంబంధించినదే వ్యక్తిత్వమనీ వివరించారు. ఈ కార్యక్రమం చివరిలో మనోహర్ గారిని ప్రిన్సిపాల్ తో పాటు సంస్థ పెద్దలు శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో అధ్యాపకులు, విద్యార్థులు, సంస్థపెద్దలు పాల్గొన్నారు.
by admin | Feb 12, 2020 | Personality Development
సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన క్రోధాన్ని విడనాడాలని శ్రీ జి.యల్. మనోహర్ గారు తెలిపారు. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న విద్యార్థులు అధ్యాపకులు అమ్మ సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగి ఉన్నారని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. విద్యార్థులతో మమేకమై పలువిధాలుగా ప్రశ్నలు వేసి వారి నుండే నిజమైన వ్యక్తిత్వం అంటే ఏమిటో చెప్పే విధంగా వారిని ఉత్తేజపరిచారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్ష భాషణం చేస్తూ వ్యక్తిత్వమనేది మానవునికి కనిపించని భూషణమనీ, మనలోని ఆలోచనలకు భావాలకు ప్రవర్తనకు సంబంధించిందే వ్యక్తిత్వమని వివరించారు.
by admin | Dec 16, 2019 | Human Values
చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం ‘ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న’ అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు మానవతా విలువలకు అద్దం పట్టేవనేకం జిల్లెళ్ళమూడిలో దర్శనమిస్తుంటాయి
by admin | Dec 16, 2019 | Human Values
చేతికి గాయమైన కారణంగా అన్నం తినలేని అభిలాష్ (8వ తరగతి) కి గత కొద్ది వారాలుగా హనుమాన్ (బి.ఏ మొదటి సం॥) విద్యార్థి ఆప్యాయంగా నోట్లో ముద్దను పెట్టి తినిపిస్తున్న సన్నివేశం ‘ఆకలిగావున్న వారికి అన్నం పెట్టమన్న’ అమ్మ మూల సిద్ధాంతానికి ఈ చిత్రం నిదర్శనం. ఇలాంటి దృశ్యాలు మానవతా విలువలకు అద్దం పట్టేవనేకం జిల్లెళ్ళమూడిలో దర్శనమిస్తుంటాయి.
by admin | Dec 8, 2019 | Human Values
“యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు | యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖహా”|| అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వి.యన్.బాబుగారు మరియు ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్యగారు అన్నపూర్ణాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్. దినకర్ గారు పాల్గొన్నారు. కళాశాలను ఒక ఉన్నతమైన లక్ష్యంతో అమ్మ స్థాపించిందని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ విద్య, భోజన, వైద్య సంరక్షణ సదుపాయాలు కొనసాగుతున్నాయని రామబ్రహ్మం గారు తెలియజెప్పారు. సంస్థ ప్రెసిడెంట్ యమ్. దినకర్ గారు మాట్లాడుతూ భగవద్గీత మానవతా.. విలువలను పెంపొందించే ఒక అద్భుతమైన గ్రంథమని పలు ఉదాహరణలతో సవివరంగా తెలియజెప్పారు. కళాశాల పక్షాన డా॥ సుధామవంశి, డా॥ కె.వి.కోటయ్య, డా॥ ఎ.హనుమత్ ప్రసాద్ లు భగవద్గీత ప్రాశస్త్యాన్ని విద్యార్ధులకు వివరించారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లములతో విద్యార్థులు తమకు తెలిసిన విషయాలను చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు అధ్యాపకులు పి. మధుసూదన్ గారు నిర్వహించారు. సంస్కృత ఆంధ్రాలను అభ్యసిస్తున్న మనమందరం సంస్కృతిని, భగవద్గీతలోని అంతర్యాన్ని భావితరాలకు వ్యాపింపజేయాలని రామబ్రహ్మంగారు పిలుపునిచ్చారు. శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిసింది.