+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

15.02.2019 న సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రముఖకవి విశ్రాంత జిల్లా ప్రభుత్వ ఖజానా సహాయాధికారి అల్లం జగపతిబాబు వివరించారు. శుక్రవారం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో ప్రజాజీవితం ప్రతిబింబించాలని తెలిపారు. కాళాశాల ప్రిన్సిపాల్ డా॥ సుధామ వంశీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా “షోడశి” తదితర గ్రంథాలను విద్యార్థులకు బహూకరించారు. ఉత్తమ సాహిత్యానికి దిశా నిర్దేశం చేసే శక్తి ఉంటుందని అల్లం జగపతిబాబు సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై విద్యార్థులకు వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం జరిగింది. “అమ్మ సందేశం సమాజాభ్యుదయం” సమాజ ప్రగతిలో విద్యార్థుల పాత్ర, “మాతృభాషా మాధుర్యము”, “విశ్వజనిగా అమ్మ” అనే అంశాలపై వివిధ స్థాయిలలో వక్తృత్వపు పోటీ జరిగింది. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.