+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగాయి. విశ్రాంత భారత ఎన్నికల కమీషనర్ శ్రీ జి.వి.జి.కృష్ణమూర్తిగారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతకాన్ని ఎగురవేసి గౌరవవందనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశమనీ, మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా విద్యార్థులుండాలనీ హితవు పలికారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన జిల్లెళ్ళమూడిలో తాను ఈ రోజు పతాకావిష్కరణ చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, మేనేజింగ్ ట్రస్టీ యమ్. దినకర్గారు, శ్రీరామమూర్తిగారు, బి.రామచంద్రగారు, చక్కా శ్రీమన్నారాయణగారు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవవందనం చేసి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి పెంపొందించే పాటలతో, మాటలతో అందరినీ అ లరించారు. విద్యార్థుల దేశభక్తి పూర్వక క్రీడావిన్యాసం అందరినీ అ లరించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రేమకుమార్ గారు తమ సందేశాన్ని అందించారు. తెలుగు అధ్యాపకులు పి.మధుసూదన్ గారు రాజ్యాంగాన్ని గూర్చి సవివరంగా తెలియజేశారు. అనంతరం మిఠాయి పంపిణీ జరిగింది.