+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత భాషా శిబిరం జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంస్కృతపాఠశాల ఉపాధ్యాయులు శ్రీ పోలూరి శ్రీకాంత్ (సంస్కృత భారతి కార్యకర్త) సంస్కృత భాషా బోధకునిగా శిబిర చాలకునిగా బాధ్యతలు నిర్వహించారు. విద్యారంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన సంస్కృత భాషను ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు. మహోన్నతమైన సంస్కృతభాష ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు గౌరవిస్తున్నాయని వివిధ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత అధ్యయన శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇదే వేదికపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేవభాషగా, మధురభాషగా, ప్రపంచభాషగా మహోన్నత స్థానంలో ఉన్న సంస్కృతానికి గత వైభవాన్ని సంతరించే బాధ్యత అందరిదీ అని ఆయన హితవు పలికారు. శ్రీ పోలరి శ్రీకాంత్ అధ్యయనం తరగతులు నిర్వహించారు.