+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

నాన్నగారికి ఎంతో ఇష్టమైన క్రీడలను ప్రతి ఏడాది కళాశాలలో నిర్వహిస్తూ ఉండడం విదితమే. అందులో భాగంగా  ఈ సంవత్సరం జనవరి 7,8,9 తేదీలలో ఆటలపోటీలు జరిగాయి. ఈ పోటీలను సంస్థ కార్యదర్శి దేశరాజు కామరాజు గారు, వై.వి. శ్రీరామ్మూర్తి గారు ప్రారంభించారు.  కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు ఆధ్వర్యం వహించారు.నెల్లూరు- ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణరాజు పోటీ విధానాలను సూచించారు. ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాయులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు విజేతలైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులందరూ ఆటలలో పాల్గొనాలని చెప్పారు. మానసిక, శారీరక ఆరోగ్యం క్రీడల వల్ల పెంపొందుతుందని తెలిపారు.