+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతి గృహంలో ఫిబ్రవరి 20వ తేదీ సోమవారం అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది. నూతనంగా భవన నిర్మాణం చేసిన ఈ వసతి గృహంలో విద్యార్థినులు పచ్చని తోరణాలతో రంగవల్లులతో పుష్పాలతో అలంకరణలు చేసి అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. కార్యక్రమంలో పలువురు సంస్థ పెద్దలు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.
ఫిబ్రవరి 21వ తేదీ మంగళవారం రోజున విద్యార్థుల వసతిగృహంలో అమ్మ ఆగమన ఉత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మ సంస్థల వారసత్వ ట్రస్టీ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యమ్. దినకర్ గారు మరియు కమిటీ సభ్యులు డి. వి. యన్. కామరాజు గారు, ఐ. రామకృష్ణ గారు, యమ్. సాయిబాబా గారు, వి. బసవరాజు గారు పాల్గొన్నారు. విద్యార్థులు లలితా సహస్రనామ పారాయణ చేశారు.
అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కళాశాల లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సభ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధ్యాపకులు సంస్కృత ఆంధ్రభాషల ప్రాశస్త్యం గురించి వివరించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది. NAAC అవగాహన సదస్సు
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఫిబ్రవరి 13వ తేదీన NAAC విషయంలో పురోగతి సాధించుటకు విద్యార్థులతో, అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో విడివిడిగా” అవగాహన సదస్సులు” ఏర్పాటు చేయుట జరిగింది. ఈ సదస్సులో ప్రధానంగా SVJP Trust సభ్యులు, College Development Committee Member శ్రీ. బొప్పూడి రామబ్రహ్మం గారు SVJP Temple Trust, Managing Trustee, Sri M. దినకర్ గారు, పాల్గొని NAAC ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేయుట జరిగింది.
ధాన్యాభిషేకం
ఆధ్యాత్మిక క్షేత్రమైన జిల్లెళ్ళమూడిలో నాన్నగారి ఆరాధనోత్సవాలు ఫిబ్రవరి 17వ తేదీ. శుక్రవారం రోజున అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ గారు, తదితర ప్రముఖులు విచ్చేసి అమ్మ, నాన్న గార్ల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ విశ్వజననీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు పలువురు దాతలు విద్యార్థులను ప్రోత్సహిస్తూ నగదు బహుమతులను అందించారు. వారి వివరములు……
17th. ఫిబ్రవరి బహుమతుల వివరములు 2023
17-02-2023 వ తేదీన శ్రీ నాన్నగారి ధాన్యాభిషేక మహోత్సవము సందర్భముగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విద్యనభ్యసించు విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధికై ప్రోత్సాహకంగా వివిధ దాతలు ప్రకటించిన విరాళములకు గాను 2022-23 విద్యా సంవత్సరపు విద్యార్థుల ఎంపిక.
1. శ్రీ నండూరి నరసింహారావు రాజ్యలక్ష్మి దంపతుల స్మారక చిహ్నంగా శ్రీ నండూరి గోవిందరావు గారు విద్యార్థులకు ప్రదానము చేయు రజతపతకం తెలుగు మరియు సంస్కృతం డిగ్రీ స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు. (Cell No: 9849801490.)
పేరు : 1.M.Shyamalika BA (OL) – III SKT Rs. 2250/- 2.
2. శ్రీ గుడిపూడి ఉమాశంకర్ తమ తల్లిదండ్రుల స్మారకచిహ్నంగా పాఠశాలనుండి కళాశాలకు వచ్చి P.D.C. 1st Year లో అత్యధిక మార్కులు సాధించిన పేద బ్రాహ్మణ విద్యార్థికి గాని బ్రాహ్మణేతర విద్యార్థికి గాని రూ.35000/- లు నగదు పై వచ్చే వడ్డీ Rs.1784/- (Rs.446+446+446+446).
పేరు : తరగతి :
S.Devi – I – PDC TEI
K.Jhansi – I – PDC TEI
Ch. Kiranmai – PDC TEI
A.Manikumar Reddy – PDC TEI
3. శ్రీ గుడిపూడి పాండురంగ విఠల్ గారు పేద విధేయ విద్యార్థికి ప్రోత్సాహక వేతనముగా ప్రతి సంవత్సరం రూ.30000/- ల పై వచ్చే వడ్డీ Rs.1500/- (Rs.500 +500+500). (Cell No: 944093976)
పేరు : తరగతి :
1 K. Simhareddy – III – BA-SKT
T. Alekhya – III – BA-SKT
K. Sai Sruthi – III – BA-SKT
4. శ్రీ వల్లూరి పార్ధసారధిరావు గారు PDC స్థాయిలో ఇంగ్లీష్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరికి రూ. 558+558 = Rs.1116.
పేరు : తరగతి :
1A.Nitya Santoshini – II – PDC – TEL
2 D.Vani – II – PDC – TEL
5. శ్రీ ప్రసాదవర్మ కామఋషి గారు డిగ్రీ స్థాయిలో మరియు PDC స్థాయిలో ప్రత్యేకంగా తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ప్రధానము చేయు రూ.1116 + 1116 మరియు P.D.C స్థాయిలో 558/- + 558/- ల నగదు బహుమతి. (Cell No:9441274034).
పేరు : తరగతి :
1 S.Usha Rani – III – BA – SKT
2 K. Jeeva Kumar – III – BA – TEL
1 P.Lakshmaiah – I – BA – SKT
2 A. Nitya Santhoshini I – BA – TEL
6. శ్రీ ఐ.హనుమబాబు గారి స్మారక చిహ్నంగా సేవా కార్యక్రమాలలో స్వచ్చందంగా పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు వారి కుమారుడు శ్రీ ఐ.కృష్ణశర్మ గారు అందించే ప్రోత్సాహక నగదు బహుమతి ఇద్దరికి Rs. 2232/- (1,116/- + 1,116/-) Cell No – 9490245437
పేరు : తరగతి :
1K.Bhagavanulu – III – BA – SKT
2 Ch. Raju – III – BA – TEL