by admin | Jul 27, 2018 | National Commemorative Days, Teachers Day
సుప్రసిద్ధ ఉపన్యాసకుడు, ‘ప్రవచన సమ్రాట్’, ‘రామాయణరసభారతి’, ‘ప్రసన్నవ్యాస’గా లోకంలో ప్రసిద్ధులైన ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారిని 27.7.2018 వ్యాసపూర్ణిమ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజించటం జరిగింది.
ఆ సందర్భంగా జరిగిన సభలో శ్రీ విశ్వజననీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యం. దినకర్, కాలేజి కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణ శ్రీమన్నారాయణమూర్తి విశిష్టతను గూర్చి ప్రసంగించారు. డాక్టర్ శిష్ట్లా ప్రసాద్ సభాహ్వానం పలుకగా శ్రీ సత్యనారాయణమూర్తి వందన సమర్పణ చేశారు.
శ్రీశ్రీమన్నారాయణమూర్తిగారు వ్యాసుని విశిష్టతను, గురువు యొక్క అవసరాన్ని, వ్యాసుడు పలికిన సూత్రాలలోని గొప్పతనాన్ని అమ్మ ఏలా అనుభవంలో అందరికీ అందించిందీ చెప్పిన మహాద్భుత సమన్వయసారం అందరినీ ముగ్ధులను చేసింది. అమ్మ ఏకాదశినాడు అవతరించిందని, వ్యాసుడు ఆదిముని లోకరక్షణ చేయటానికి పూర్ణిమనాడు ఉద్భవించాడనీ, ఇద్దరూ లోకానికి అందించిన సూత్రాలూ, సంస్కారాలు జగజ్జాగృతికి ఉపయోగపడుతున్నాయని వ్యాసహృదయాన్ని, అమ్మ అనుభవ వేదాంత నిధులను రంగరించి అందించారు సంస్థ సముచితరీతిని సత్కరించింది.
తదనంతరం వాత్సల్యాలయ ప్రాంగణంలో సామూహికంగా డాక్టర్ బి.యల్.సుగుణగారి నేతృత్వంలో ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ పారాయణ చేశారు. సాయంకాలం సోదరి ఎమ్.వి. సుబ్బలక్ష్మి గారి కృషితో జ్యోతిస్వరూపిణి, జ్ఞానరూపిణి అమ్మ శ్రీ చరణాల చెంత అసంఖ్యాకంగా దీపాలను వెలిగించి భక్తితో అమ్మ నామ సంకీర్తన చేసి మంగళహారతి నిచ్చారు.
by admin | Jul 24, 2018 | Samskrutha Sibhiram
గతంలో రాజభాషగా, దేశభాషగా వర్థిల్లిన సంస్కృత భాషను ఆదరించాలని నంబూరు జడ్.పి. హైస్కూల్ ఉపాధ్యాయులు శేషాద్రి వివరించారు. జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 24వ తేదీన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దేశంలోని సకల శాస్త్రాలు, సంస్కృతంలోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించడంతో సంస్కృతానిదే కీలక పాత్ర అని సోదాహరణంగా వివరించారు.
by admin | Jul 16, 2018 | Awarness Programs
మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఉపగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరాఘవ మూర్తిగారు వివరించారు. జులై 16వ తేదీన కళాశాల ప్రార్థనామందిరంలో ఆయన మాట్లాడుతూ ఏ దేశానికి తీసిపోని విధంగా అంతరిక్షప్రయోగాలలో భారతదేశం తన ప్రత్యేకతను నిలుపుకున్నట్లు ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్.సుగణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఉపగ్రహప్రయోగాల తీరుతెన్నులను సోదాహరణంగా ప్రదర్శించారు. అలాగే రాఘవమూర్తిగారు శిక్షణ ఇచ్చిన ఫైనలియర్ విద్యార్థినులు ఎ. మనీషా, టి. నాగలక్ష్మి పవర్ పాయింట్ ప్రజంటేషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రిన్సిపాల్ డా|| బి.యల్.సుగుణగారు, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయక విద్యలతోపాటు శాస్త్రీయ, సాంకేతిక రంగాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం లభించడం ఎంతో అవసరమని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య రాఘవమూర్తిగారు ప్రకటించారు. ఈ రంగాలలో భారతదేశానికి సముచితస్థానం లభించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే వేదికపై తాను శిక్షణ యిచ్చిన విద్యార్థినులు సమర్ధవంతంగా పవర్పాయింట్ ప్రజంటేషన్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగదు బహుమతితో అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, సంస్థ పెద్దలు శ్రీ ఎమ్. దినకర్, శ్రీ ఎన్. లక్ష్మణరావు, శ్రీ ఎమ్. శరచ్చంద్రకుమార్, శ్రీ రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
by admin | Jul 16, 2018 | Awarness Programs
మానవ జీవితం సుసంపన్నం కావడానికి ఉపగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయని ఇస్రో ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీ రాఘవమూర్తిగారు వివరించారు. జులై 16వ తేదీన కళాశాల ప్రార్థనా మందిరంలో ఆయన మాట్లాడుతూ మన దేశం, ఏదేశానికీ తీసిపోనిదన్నారు. అంతరిక్ష ప్రయోగాలలో భారతదేశం తన ప్రత్యేకతను నిలుపుకున్నట్లు ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యల్.సుగుణగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉపగ్రహ ప్రయోగాల తీరు తెన్నులను సోదాహరణంగా ప్రదర్శించారు. అలాగే రాఘవమూర్తిగారు శిక్షణ ఇచ్చిన చివరి సంవత్సరం విద్యార్థినులు మనిషా, నాగలక్ష్మి పవర్ పాయింట్ ప్రజంటేషన్ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్ సుగుణ గారు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయాలతోపాటు శాస్త్రీయ, సాంకేతిక రంగాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం లభించడం. అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో భారత దేశానికి సముచిత స్థానం దక్కినట్లు చెప్పారు. వేదికపై తాను శిక్షణ యిచ్చిన విద్యార్థినులు స్టేజీపై సమర్థవంతంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. వారికి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్రగారు, సంస్థ పెద్దలుచేస్తూ నగదు బహుమతితో ఫోన్ కమ్మా రవింద్ర రావు గారు, సంస్థపెద్దలు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
by admin | Jul 10, 2018 | Programs
జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 29 వరకు విద్యార్థినీ విద్యార్థులకు సంగీత శిక్షణ కార్యక్రమం జరిగింది. సంస్థపెద్దలు, అమ్మ భక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాద్ రావు ఈ సంగీత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జూలై 28 వ తేదీన అన్నపూర్ణాలయం సమావేశ మందిరంలో విద్యార్థినీ విద్యార్థులు సంగీత కార్యక్రమం నిర్వహించి అమ్మ భక్తి గీతాలను గానం చేశారు. సంగీతం శ్రోతలను అలరించడంతో పాటు ఆనందాన్ని, అనుభూతిని అందిస్తుందని సంగీత శిక్షకులు రావూరి ప్రసాదావు వివరించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు సంస్థ పెద్దలు బ్రహ్మాండం వసుంధరక్కయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్. సుగుణ, శ్రీ యమ్. దినకర్, శ్రీ బి. రామచంద్ర కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమశిక్షణ ఇచ్చిన అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాదును ఘనంగా సత్కరించారు. శ్రీ ప్రసాద్ ఈ సంగీత శిక్షణను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్. సుగుణ, సంస్థ స్థానిక కార్యదర్శి శ్రీ బి. రామచంద్రను అభినందించి ఘనంగా సత్కరించారు.