Republic Day

Republic Day

Republic Day

జనవరి 26, 2025 ఆదివారం ఉదయం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ గోలి లక్ష్మయ్య (గుంటూరు డి.యస్.పి, క్రైమ్ బ్రాంచ్) గారు విశిష్ఠాతిథిగా మరియు శ్రీమన్నారాయణ (పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్) ముఖ్య అతిథిగా విచ్చేశారు. SVJP TRUST Temples Trusty శ్రీ యమ్. సాయిబాబా గారు Trust Member  శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గోలి లక్ష్మయ్య గారు జెండావందనం చేసి జ్ఞానంతో నిండిన విద్యను అభ్యసిస్తూ ప్రతి పనిలో ముందడుగు వేయాలని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ స్వీయ రాజ్యాంగాన్ని లిఖించుకొని సరైన మార్గంలో నడిస్తే మన భారతదేశం మరింత పురోగతిని సాధించగలదని వివరించారు.

ఇదే వేదికపై అమ్మభక్తులు శ్రీ తంగిరాల కేశవమూర్తి మరియు శారద గార్ల స్మృత్యర్థం వారి కుమారులు శ్రీ తంగిరాల తేజోమూర్తి గారు వేదం,సంస్కృతం మరియు తెలుగు విభాగాలలో ఉత్తమ ప్రదర్శన కనబరచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ బహుమతులను వారి సోదరి శ్రీమతి హైమ దంపతులు స్వయంగా విచ్చేసి పోటీ ప్రపంచానికి అనుగుణంగా మన కళాశాల విద్యార్థులు కూడా తయారవ్వాలని సూచించారు.

75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విద్యార్థులకు 23 వ తేదీ శుక్రవారం నాడు క్విజ్ వ్యాసరచన మరియు గ్రూప్ డిస్కర్షన్ పోటీలు  నిర్వహించబడ్డాయి. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మిఠాయి పంపిణీ తో కార్యక్రమం ముగిసింది.

On Sunday, January 26, 2025, Matrusri Oriental College celebrated the 76th Republic Day with great enthusiasm. The event was presided over by Principal Dr. Annadanam Hanumath Prasad. The Chief Guest was Sri Goli Lakshmaiah (DSP, Crime Branch, Guntur), and the Special Guest was Sri Mannara Narayana, renowned Personality Development Motivator.

Sri Goli Lakshmiya addressed gathering emphasizing the importance of acquiring knowledge and striving for excellence in every endeavor. Srimannarayana inspired the students by highlighting the need for individuals to create their own path and contribute to India’s progress.

As part of the celebrations, Sri Tangirala Kesavamurthy’s son, Sri Tangirala Tejomurthy presented awards to students who excelled in Vedas, Sanskrit, and Telugu. The awards were handed out by his sister Smt. Hyma and her husband, emphasizing the importance of preparing for a competitive world.

To commemorate 75 years of the college, a series of events, including quiz, Essay writing and group discussion competitions were organized on 24th January. The Republic Day celebration concluded with vibrant cultural programs performed by students promoting patriotism, followed by distribution sweets.

 

National Voters Day

National Voters Day

జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు జిల్లెళ్ళమూడి గ్రామసమీపంలో ఉన్న అప్పాపురం గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు, యువతకు ఓటు యొక్క ప్రాధాన్యత తెలుసుకొని అందరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని ప్రజాస్వామ్యంలో ఇది తప్పనిసరి అని అందరికీ అవగాహన కల్పించారు.అప్పాపురం గ్రామ సచివాలయం నుండి మాతృశ్రీ ఓరియంటల్  కళాశాల విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని అన్ని వార్డులను సందర్శించి  గ్రామస్థులకు ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అంతేకాక యువత అందరూ కూడా దేశ భవిష్యత్తు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారు కనుక అందరిని ఓటు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ సచివాలయం కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించారు. అప్పాపురం గ్రామ సర్పంచ్ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అందిస్తున్న సామాజిక స్పృహను అభినందిస్తూ కళాశాల వాలంటీర్స్ అందరిని కూడా అభినందించారు.

 

ప్రమాణపత్ర ప్రదానోత్సవం

ప్రమాణపత్ర ప్రదానోత్సవం

ప్రమాణపత్ర ప్రదానోత్సవం
ది. 22-01-2025 బుధవారం నాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల Seminar Hall నందు Functional & Situational language (Spoken English) Certificate Course యొక్క ప్రమాణ పత్ర ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల మరియు Saints & Scientists Society వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కోర్స్ కన్వీనర్ శ్రీమతి మాధవి మధురకవి గారు మరియు Saints & Scientists Society General secretary శ్రీమతి మాధవీలత గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సుమారు 70వేలు విలువ చేసే సంస్కృత ఆంధ్ర గ్రంథాలను కళాశాల లైబ్రరీకి అందించారు. వారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఇలాంటి ఎన్నోవిధాలైన కోర్సులను Saints & Scientists సంస్థ అందించడానికి సిద్ధంగా ఉందనీ, కనుక తప్పనిసరిగా వినియోగించుకొని అన్ని రంగాలలోనూ నిష్ణాతులు కావాలని తెలిపారు. అనంతరం కోర్స్ కన్వీనర్ మాధవి మధురకవి గారు Certificate Course పూర్తి చేసిన విద్యార్థులను అభినందించి మున్ముందు కోర్సులలో మరింత చురుగ్గా పాల్గొని ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించారు. విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ ను అందించారు. చివరిగా అతిథులను అమ్మప్రసాదంతో సత్కరించారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.

 

 

 

 

Guest Lecture by Prof. Vidyananda Aarya

Guest Lecture by Prof. Vidyananda Aarya

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంస్కృతవిభాగం తరుపున 26-12-2024 గురువారం రోజున అతిథి ఉపన్యాసం ఏర్పాటయింది.  ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం Head of the Department     Prof. విద్యానంద ఆర్య విచ్చేసి సంస్కృతభాష అధ్యయనం – ప్రయోజనాలు అనే అంశంపై ప్రసంగించారు. వీరు ఆధునిక సమాజంలో సంస్కృతభాషపై జరుగుతున్న వివిధ రకాల పరిశోధనలను తెలిపి భావితరాలకు అందబోతున్న సదవకాశాలను గురించి సవివరంగా తెలియజెప్పారు. అంతేకాక లక్షల సంవత్సరాల నుండి ఉనికిని కలిగి ఉన్న సంస్కృత భాష అన్నిభాషలకు మాతృభాష అనీ, సంస్కృతభాషలో ఉచ్చారణ పరంగా, ప్రాంతాల వారీగా, దశాబ్దాలవారీగా గానీ ఏవిధమైన మార్పులు జరగలేదనీ తెలిపారు. ప్రాంతీయ భాషాలు వివిధ దశలలో వివిధ రకాల మార్పులు సంతరించుకుంటుంటాయని సకలభాషలకు తల్లివంటిది కనుక ప్రతిభాష సంస్కృతం నుండే పుట్టిందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభను సంస్కృతవిభాగాధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు నిర్వహించగా డా. వి. త్రయంబకం గారు వందన సమర్పణ గావించారు.

 

గీతాజయంతి ఉత్సవాలు | Gita Jayanthi Celebrations

గీతాజయంతి ఉత్సవాలు

11.12.2024, బుధవారం మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కలశాలతో MOU కుదుర్చుకున్న వివిధ పాఠశాల, కళాశాలల విద్యార్దులకు సెమినార్ హాల్‌లో భగవద్గీత పోటీలు నిర్వహించబడ్డాయి. మధ్యాహ్నం అందరింటి ఆవరణలో ఉన్న తి.తి.దే కళ్యాణమండపం లో ఏర్పాటు చేయబడిన సమావేశంలో ముఖ్య అతిథి గా డా. ఉషారాణి సంకా, ఆత్మీయ అతిథి బొప్పూడి రామబ్రహ్మంగారు, కరస్పాండెంట్ జి. రాఘవేంద్రరావు గారు, సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్, గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల యాజమాన్యం వారు పాల్గొన్నారు.  సభాధ్యక్షులు, కరస్పాండెంట్ గోగినేని రాఘవేంద్రరావు గారు వచ్చే ఏడాది భగవద్గీత పోటీలు మండల స్థాయి జిల్లా స్థాయిలలో నిర్వహించే ప్రయత్నం చేస్తామని తద్ద్వారా సంస్కత భాషా సేవతో పాటు ఉత్తమ సంస్కారాలు కలిగిన పౌరులను తయారు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ భగవద్గీత ఎప్పుడు పుట్టింది? ఎందుకు మనం ఇంత వైభవంగా ఒక గ్రంథాన్ని జయంతి గా ఏర్పాటు చేసుకున్నాము? అని సవివరంగా చెప్పారు.  అనంతరం ముఖ్య అతిథి డా. ఉషారాణి గారు మాట్లాడుతూ విద్యార్ధులందరూ భగవద్గీత నేర్చుకొని భావితరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందజేయాలని ఈ గ్రంథం మనల్ని సన్మార్గంలో నడిపించే సూచిక అని వివరించారు. అనంతరం ఆత్మీయ అతిథి బొప్పూడి రామబ్రహ్మం గారు భగవద్గీత 18 అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అస్త్రం లాంటిది అనీ, స్థితప్రజ్ఞత అంటే ఏమిటో ఆధార శ్లోకాలతో తెలియజేశారు. గీతా జయంతి సందర్భంగా వివిధ పాఠశాలల్లో మరియ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం జరిగింది. పోటీలలో పాల్గొనడానికి విద్యార్థులను ఉత్సాహపరిచి ఆ యా పాఠశాల మరియు కళాశాలల నుండి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి SVJP Trust ఎంతో సహాయ సహకారాలను అందించింది. రామబ్రహ్మం గారు ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచిన వారికి గీతా మకరందాన్ని అందించారు. అలాగే ప్రతి విద్యార్థికి భగవద్గీత పుస్తకాలను అందించారు. SVJP Temples Trusty శ్రీ కె. సాయిబాబా గారు అతిథులను అమ్మ ప్రసాదం తో సత్కరించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంస్కృత విభాగ అధ్యక్షులు డా. ఆర్. వరప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్కృత ఉపన్యాసకులు వల్లూరి త్రయంబకం గారు వందన సమర్పణ చేశారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.

 On December 11, 2024, Wednesday, on the occasion of Githa jayanthi (Margashira Shuddha Ekadashi), Matrusri Oriental College organized Bhagavad Gita competitions for students from various schools and colleges with which it has MOUs. The morning session was held in the seminar hall. The afternoon session took place at TTD Kalyanamandapam, with Dr. Usharani Sanka as the chief guest, and esteemed guests including Boppoodi Ramabrahmam, Correspondent G. Raghavendra Rao, and management representatives from Siddhartha English Medium High School and Gorantla Venkanna Oriental College.

Correspondent Gogineni Raghavendra Rao highlighted plans to expand the Bhagavad Gita competitions to mandal and district levels next year, emphasizing the importance of promoting Sanskrit and nurturing cultured citizens. Principal Dr. Annadanam Hanumath Prasad delivered a detailed address on the origin and significance of celebrating the Bhagavad Gita Jayanti.

Dr. Usharani encouraged students to learn and uphold the cultural heritage through the teachings of the Bhagavad Gita. Boppoodi Ramabrahmam explained the importance of each verse in the 18 chapters of the Gita, equating each to a powerful weapon and elaborating on “sthitaprajna”.

Prizes were awarded to winners from various schools and colleges. The event was supported by SVJP Trust, and Dr. Ramabrahmam distributed copies of the Bhagavad Gita to all participants. SVJP Temples Trustee K. Saibaba honored guests with prasadam. The program, organized by Dr. R. Varaprasad, concluded with a peace chant.