by MOC IQAC | Jul 27, 2025 | Plastic Awarness
ENDING OF PLASTIC
🌿 ప్లాస్టిక్ నివారణపై సృజనాత్మక కార్యక్రమం
మాతృశ్రీ ఓరియెంటల్ కళాశాలలో “ప్లాస్టిక్ నివారణ” అనే అంశంపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రణాళికలో భాగంగా జూలై 19, 2025న జరిగింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల మధ్య వివిధ పోటీలు నిర్వహించబడ్డాయి:
🔸 చిత్రలేఖనం
🔸 వ్యాసరచన
🔸 క్రాఫ్ట్ వర్క్
🔸 స్లోగన్స్
B. A ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగం పై అవగాహన కలిగించేలా *ఓ నాటిక (స్కిట్)*ను ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. ప్లాస్టిక్ కారణంగా భవిష్యత్ లో ఏర్పడే ప్రమాదాలను అరికట్టేవిధంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని వైస్ ప్రిన్సిపాల్ డా. ఎల్. మృదుల నిర్వహించారు. విద్యార్థుల భాగస్వామ్యం, వారి సృజనాత్మకత మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలిచింది. కార్యక్రమంలో 158 మంది విద్యార్థులు, 12 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.
by MOC IQAC | Jul 3, 2025 | Drug Awareness, International Commemorative Days, Uncategorized
విద్యార్థుల సంక్షేమం, సమాజ పట్ల బాధ్యతను అవగాహన కల్పించేందుకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి వారు 26-06-2025 గురువారం EAGLE CLUB మరియు NSS UNIT సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేటూరు గ్రామ సచివాలయం మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి గారు విచ్చేసి మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన పరిణామాలు, సమాజంపై ప్రభావం వంటి విషయాలను వివరించారు. ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు అధ్యక్షత వహించి, యువత మత్తుమందులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలన్న సందేశాన్ని ఇచ్చారు. సంస్కృత విభాగాధిపతి Dr. RVNSS వరప్రసాద్ గారు విద్యార్థులను ఉద్దేశించి భారతీయ జ్ఞానపరంపరలోని నైతిక విలువలు, మానసిక స్థైర్యం గురించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని NSS Convener శ్రీ T.జయకృష్ణ గారు నిర్వహించారు. NSS స్వచ్ఛంద సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొని మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ఈ అవగాహనను పెంపొందించాలనే ప్రతిజ్ఞ చేశారు. శాంతిమంత్రం తో కార్యక్రమం ముగిసింది.

by MOC IQAC | Jun 5, 2025 | Awarness Programs, Environment, International Commemorative Days
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి NSS UNIT తరఫున అధ్యాపకులు మరియు విద్యార్థులు కలసి జిల్లెళ్ళమూడి గ్రామపరిసర ప్రాంతాలైన జమ్ములపాలెం, రేటూరు, కాకుమాను, అప్పాపురం, కర్లపాలెం,యాజలి గ్రామాలలోని అంగన్‌వాడి కేంద్రాలు, హైస్కూల్స్, పశువైద్యశాలల వద్ద పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నివారించి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జ్యూట్ బ్యాగులు వాడుకోవాలని ప్రజలకు సూచించారు. పర్యావరణాన్ని సంరక్షించడం మన అందరి బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.
అదేవిధంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో Principal డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు, SVJP TRUST MANAGING TRUSTEE శ్రీ వల్లూరి ప్రేమ్ రాజ్ గారు, జిల్లెళ్ళమూడి గ్రామసర్పంచ్, అధ్యాపకులు, విద్యార్థులు పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషించారు.
కళాశాల క్యాంపస్ లో వివిధ రకాల మొక్కలను నాటడం ద్వారా హరిత శోభను పెంచారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించి, సమాజానికి మంచి సందేశాన్ని అందించింది.
by MOC IQAC | Apr 19, 2025 | Awarness Programs
Swachh Andhra Swarna Andhra
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు Commissioner of Collegiate Education (CCE) వారి సూచనల మేరకు ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర” కార్యక్రమంగా జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 2025 నెలకు సంబంధించిన థీమ్ ఈ-వేస్ట్ నిర్వహణ (E-Waste Management)గా నిర్ణయించబడింది.
ఈ సందర్భంగా 19-04-2025 శనివారం రోజున మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఈ-వేస్ట్ నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ముందుగా NSS కోఆర్డినేటర్ శ్రీ టి. జయకృష్ణ గారి ఆధ్వర్యంలో E-Waste నిర్వహణపై సెమినార్ నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. హనుమత్ప్రసాద్ విద్యార్థులకు E-Waste అనేది ఏమిటి, దాని వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాలు మరియు E-Waste సరైన నిర్వహణ యొక్క ఆవశ్యకతను గురించి వివరంగా తెలియజేశారు. కళాశాలలోని E-Waste ను సేకరించి E- Wasted వస్తువుల రకాలు, వాటి ద్వారా కలిగే ప్రమాదాలు మరియు సరైన రీతిలో నిర్వహించు పద్ధతుల గురించి వివరించారు. ఇందులో విద్యార్థులు, అధ్యాపకులు చురుకుగా పాల్గొని తమ వద్ద ఉన్న పాడైన లేదా ఉపయోగం లేని ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువచ్చి అందజేశారు. 12 మంది అధ్యాపకులు 40 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతకు సంబంధించి చైతన్యం కలిగించింది.
by MOC IQAC | Mar 19, 2025 | Awarness Programs, Drug Awareness, Extension Activities
DRUG AWARENESS PROGRAM
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి లో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో March 19 20 25 న డ్రగ్ పై అవగాహన మరియు దుర్వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సభలో ప్రిన్సిపల్ డా. A.హనుమత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్థుల మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ Academic Excellence పై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం EAGLE CLUB CO ORDINATOR B.సుకన్య నోరులేని జంతువులు కూడా దూరంగా ఉంచే పొగాకు లాంటి హానికారకాలకు మనం దూరంగా ఉంటూ మన చుట్టూ పక్కల వారికి అందరికీ దీని గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సభకు అతిథిగా విచ్చేసిన మూలపాలెం సచివాలయం మహిళా పోలీస్ అధికారి Zion Perpetua Nathala ప్రతి ఒక్క విద్యార్థి సమాజం పట్ల బాధ్యత వహించి తాను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇతరులకు దీనిపై అవగాహన కలిగించేలా సామర్థ్యాన్ని కలిగి ఉండాలని వివరించారు. 80 మంది విద్యార్థినులు 22 మంది విద్యార్థులు 10 మంది అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల మాదకద్రవ్యాల దుర్వినియోగం ద్వారా కలిగే ప్రమాదాలను గురించి అవగాహన కల్పించడంలో ఎంతగానో తోడ్పడింది. EAGLE CLUB CO ORDINATOR B.సుకన్య అధ్యాపకులకు అతిథులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.
by MOC IQAC | Mar 15, 2025 | Awarness Programs, Extension Activities, Plastic Awarness
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర
COMMISSIONER OF COLLEGIATE EDUCATION మంగళగిరి వారి ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 15.03.2025 శనివారం AVOID SUPs PROMOTE REUSABLES ప్రోత్సహించండి అనే అంశం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A.హనుమత్ ప్రసాద్ గారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. తెలుగు అధ్యాపకురాలు డా. L. మృదుల గారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను ఉపయోగించకూడదని, RE USE PLASTIC పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. PLASTIC ను ఉపయోగించడం పై కలుగుతున్న అనారోగ్యాలను గురించి తెలియజేశారు. అనంతరం NSS CO ORDINATOR T. జయకృష్ణ గారు ఒకరోజు మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల భూమిపై ఉన్న పొరలలోని చేరి అవి కరిగిపోకుండా అలాగే ఉండి ఎన్నో వ్యాధులకు లోనవ్వడానికి మూల కారణం అవుతుంది. కనుక మనము సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ని ఉపయోగించ వద్దని తెలియజేశారు. తరువాత సాయంత్రం 5 గంటలకు కళాశాల మైదానంలో విద్యార్థులు అధ్యాపకులు అందరూ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు. తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి కళాశాల ఆవరణను శుభ్రపరిచారు. అనంతరం PLASTIC AVOID పై నినాదాలతో జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 72 మంది విద్యార్థినులు 20 మంది విద్యార్థులు 15 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.