అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

అంబేద్కర్ జయంతి వారోత్సవాలు

అంబేద్కర్ 134వ జయంతి వారోత్సవాలు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర’ అనే అంశంపై వక్తృత్వం, వ్యాసరచన పోటీలు జరిగాయి. అనంతరం జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎ. హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే అందరూ ఐకమత్యంతో ఉండాలని,  కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో జాతి సమైక్యతకు పాటుపడాలని వివరించారు.  ఇదే సభలో సంస్కృత శాఖాధ్యాక్షలు డాక్టర్.ఆర్.వరప్రసాద్ విద్య అనేది ఒక శక్తి అనీ, దానిని అంబేద్కర్ ఒక ఆయుధంగా మార్చుకొని  అణగారిన వర్గాల కోసం క్రొత్తదారులను ఎలా సృష్టించారో తెలియజేశారు. ఈ సమావేశంలో కళాశాల చరిత్ర ఉపన్యాసకులు శ్రీ పి.సుందరరావు గారు అంబేద్కర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, విద్యాశక్తితో తన జీవితం మార్చుకొని కోట్లాది మందికి ఎలా ఆదర్శంగా నిలిచారో వివరించి, రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ యొక్క ముఖ్యమైన పాత్రను విద్యార్థులందరికీ తెలియజేశారు. అనంతరం శాంతి మంత్రంతో  ఈ సమావేశం ముగిసింది.

CAREER OPPORTUNITIES AND STRATEGIES  FOR UPSC AND COMPITATIVE EXAMS

CAREER OPPORTUNITIES AND STRATEGIES FOR UPSC AND COMPITATIVE EXAMS

ది 07.04.2025 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి లో IQAC, Career guidance and placement cell ఆధ్వర్యంలో “CAREER OPPRTUNITIES AND STRATEGIES FOR UPSC AND COMPITATIVE EXAMS” అనే అంశంపై ప్రముఖ IAS OFFICER శ్రీ హెచ్.పీ. రాజు గారు మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు సభను ప్రారంభించి విశిష్ట అతిథిని పరిచయం చేశారు. ధాత్రి ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది. College Management Committee సభ్యులు శ్రీమతి హైమ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు చేశారు.

H. P. రాజు గారు ముఖ్యంగా All India Services గురించి వివరించి వాటి ప్రాధాన్యం మరియు సామాజిక బాధ్యతలపై వివరణాత్మకంగా మాట్లాడారు. తెలుగు, సంస్కృతం వంటి సాంప్రదాయ భాషలు చదివిన విద్యార్థులకు UPSC లో ఉన్న అవకాశాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో జరిగిన Interaction session లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

Management Committee సభ్యులు మాధవీలత గారు, విశిష్ట అతిథి చెప్పినట్లు కళాశాల విద్యార్థులను UPSC పరీక్షల వైపు ఆకర్షితులయ్యేలా అధ్యాపకులు(UPSC examination point of View) syllabus ను బోధించాలని, మరింత ప్రోత్సాహం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కొంతమంది విద్యార్థులు ఈ యేడాది Preliminary Exam వ్రాయడానికి సుముఖత వ్యక్తం చేశారు.

DRUG AWARENESS PROGRAM

DRUG AWARENESS PROGRAM

DRUG AWARENESS PROGRAM

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి లో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో March 19 20 25 న డ్రగ్ పై అవగాహన మరియు దుర్వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సభలో ప్రిన్సిపల్ డా. A.హనుమత్ ప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్థుల మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ Academic Excellence పై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం EAGLE CLUB CO ORDINATOR B.సుకన్య నోరులేని జంతువులు కూడా దూరంగా ఉంచే పొగాకు లాంటి హానికారకాలకు మనం దూరంగా ఉంటూ మన చుట్టూ పక్కల వారికి అందరికీ దీని గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సభకు అతిథిగా విచ్చేసిన మూలపాలెం సచివాలయం మహిళా పోలీస్ అధికారి Zion Perpetua Nathala ప్రతి ఒక్క విద్యార్థి సమాజం పట్ల బాధ్యత వహించి తాను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా ఇతరులకు దీనిపై అవగాహన కలిగించేలా సామర్థ్యాన్ని కలిగి ఉండాలని వివరించారు. 80 మంది విద్యార్థినులు 22 మంది విద్యార్థులు 10 మంది అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల మాదకద్రవ్యాల దుర్వినియోగం ద్వారా కలిగే ప్రమాదాలను గురించి అవగాహన కల్పించడంలో ఎంతగానో తోడ్పడింది. EAGLE CLUB CO ORDINATOR  B.సుకన్య అధ్యాపకులకు అతిథులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.

 

 

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

COMMISSIONER OF COLLEGIATE EDUCATION మంగళగిరి వారి ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 15.03.2025 శనివారం AVOID SUPs PROMOTE REUSABLES ప్రోత్సహించండి అనే అంశం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A.హనుమత్ ప్రసాద్ గారు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. తెలుగు అధ్యాపకురాలు డా. L. మృదుల గారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను ఉపయోగించకూడదని, RE USE PLASTIC పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. PLASTIC ను ఉపయోగించడం పై కలుగుతున్న అనారోగ్యాలను గురించి తెలియజేశారు. అనంతరం NSS CO ORDINATOR T. జయకృష్ణ గారు ఒకరోజు మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల భూమిపై ఉన్న పొరలలోని చేరి అవి కరిగిపోకుండా అలాగే ఉండి ఎన్నో వ్యాధులకు లోనవ్వడానికి మూల కారణం అవుతుంది. కనుక మనము సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ని ఉపయోగించ వద్దని తెలియజేశారు. తరువాత సాయంత్రం 5 గంటలకు కళాశాల మైదానంలో విద్యార్థులు అధ్యాపకులు అందరూ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు. తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి కళాశాల ఆవరణను శుభ్రపరిచారు. అనంతరం PLASTIC AVOID పై నినాదాలతో జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 72 మంది విద్యార్థినులు 20 మంది విద్యార్థులు 15 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం | International Women’s Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం | International Women’s Day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

            అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది 7.3.2025 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభా కార్యక్రమం జరిగింది. ఈ సభకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ Dr. L. మృదుల అధ్యక్షత వహించారు. మహిళా సాధికారతను గురించి వివరించారు. ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి మరియు లాల్ బహదూర్ శాస్త్రి కేంద్రీయ విశ్వవిద్యాలయం Assistant professor Dr. B. కామాక్షమ్మ గారు ఆన్లైన్ లో స్టూడెంట్స్ కి వేదకాలం మరియు నేటి కాలం యొక్క మహిళల గురించి వివరించారు. తెలుగు అధ్యాపకులు వీరాంజనేయులు గారు మహిళలను గురించిన ప్రేరణదాయకమైన గీతాన్ని ఆలపించారు. కళాశాల ప్రాచార్యులు Dr అన్నదానం. హనుమత్ ప్రసాద్ గారు ఆయా యుగాలలో జన్మించిన మహిళా మణులను వారి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సభకు ఆత్మీయ అతిథి Dr. J. Gnana prasuna గారు గొప్ప గొప్ప మహిళల గురించి వివరించారు. మహిళా దినోత్సవ సందర్భముగా జరిపిన రంగవల్లుల పోటీలలో విజేతలైన విద్యార్థులకు, మహిళా అధ్యాపకులకు బహుమతి ప్రదానం జరిగింది.

     సంస్కృత అధ్యాపకులు డా. R.వరప్రసాద్ గారి పర్యవేక్షణలో కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక అధ్యాపకేతర మహిళామణులకు సన్మాన కార్యక్రమం జరిగింది, ఈ సభను ఆంగ్ల అధ్యాపకులు శ్రీమతి M. కవిత చక్కగా నిర్వహించారు, శాంతి మంత్రంతో సభ ముగిసింది.