by MOC IQAC | Apr 2, 2026 | Kalidasu Jayanthi, Special Days
World Sanskrit Day
శ్రావణ పూర్ణిమ సందర్భంగా 09.08.25 వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విశ్వ సంస్కృత భాషా దినోత్సవము ను జరుపుకొనుట జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ C.H.పవన్ కుమార్ గారు Guest Faculty in Sanskrit Dept , Acharya Nagarjuna University నుండి విచ్చేసియున్నారు. కార్యక్రమంలో భాగంగా సభా అధ్యక్షత వహించిన కళాశాల సంస్కృత విభాగాధిపతి తో Dr. R V N S S వరప్రసాద్ గారు సంస్కృత భాష మహాత్యమును గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ గౌరవనీయులు సిహెచ్ పవన్ కుమార్ గారు సంస్కృత భాష ప్రాశస్త్యం మరియు ఆధునిక కాలంలో పరిరక్షణ విధానాలను ప్రతిపాదించడం జరిగింది కార్యక్రమంలో సభా నిర్వహణ సంస్కృత అధ్యాపకులు Dr. V.త్రయంబకం గారు నిర్వహించగా వందన సమర్పణ శ్రీమతి బి సుకన్య గారునిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు సంస్కృత భాష గురించి తమ అభిప్రాయంను వ్యక్తపరిచడం, సంస్కృత గీతాలాపన చేయడం జరిగింది. అంతిమంగా వందన సమర్పణ కార్యక్రమం ముగిసింది.
by MOC IQAC | Apr 2, 2026 | Special Days
తెలుగు భాషా దినోత్సవం
ఆగస్టు 29.2025 శుక్రవారం నాడు మాత్యశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి తి.తి.దే కళ్యాణ మండపంలో తెలుగు భాషా దినోత్సవం జరిగింది. వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి గారి 162 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటైన ఈ సభకు ఆంధ్ర ఉపన్యాసకులు డా॥ నారాయణం శేషుబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభా కార్యక్రమలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జన్నాభట్ల కుమార చంద్రశేఖర గారు, జి. గోవిందరాజు గారు, యమ్. దినకర్ గారు వి. ప్రేమరాజు గారు పాల్గొన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు నృత్య ప్రదర్శనలను, లఘు నాటికలను, గీతాలను ఆలపించి తెలుగు వైభవాన్ని చాటి చెప్పారు. తెలుగుశాఖ అధ్యాపకులు జి. వీరాంజనేయులు గారు సభాకార్యక్రమాన్ని నిర్వహించగా పి. సుందరరావు గారు వందన సమర్పణ గావించారు
by MOC IQAC | Apr 2, 2026 | Cultural, Vinayaka Chavithi Celebrations
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విద్యార్థుల చేత వినాయకచవిత పండుగ 27/8/2025 నుండి 30/8/25 అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. వినాయక చవిత మహాత్సవాలలో భాగంగా మొదటి రోజున వినాయకుని షోడ శోపచార అష్టోత్తర శతనామాదులలో శాస్త్రోక్తంగా పూజించి శమంతకోపాఖ్యానం శ్రవణం జరిగింది. అనంతరం విద్యార్థులు లఘు నాటికలు నృత్య ప్రదర్శన, గీత గానం వంటి సాంస్కతిక కారక్రమాలలో విద్యార్థ గణపతికి కళార్చన సమర్పించారు. విద్యార్థులు రెండు మరియు మూడవ రోజులు గణపతికి శస్త్రోక్తంగా పూజించి అనంతరం సాంస్కతిక కార్యక్ర మాలు నిర్వహించారు పండుగ మూడు రోజులు జరిగిన సాంస్కతిక కార్యక్రమాలను వరుసగా తెలుగు, సంస్కృతం, ఆంగ్లం మరిشه టెక్నాలజీ విభాగం వారి పర్యవేక్షణలో సాగింది నాల్గవ రోజు వినాయనికి శస్త్రోక్తంగా పూజ ఉద్యాసన మరియు నిమర్జనం కార్యక్రమాలు జరినాయి.
by MOC IQAC | Apr 2, 2026 | Independence Day, National Commemorative Days
79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెలమూడి లో ఆగస్టు 16వ తేదీన ఘనముగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా SVJP Trust Honorary chairman శ్రీ M. దినకర్ గారు విచ్చేసి పతాకావిష్కరణ చేయడం జరిగింది. సభాధ్యక్షులైన కళాశాల అకడమిక్ & అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ శ్రీ జి. గోవిందరాజులు గారు మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల త్యాగాలను కొనియాడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ ఎం. దినకర్ గారు తమ ప్రసంగంలో ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న విధానాన్ని కొనియాడారు .అనంతరం విద్యార్థిని విద్యార్థులు స్వీయ స్వాతంత్ర దినోత్సవ అభిప్రాయాలను తెలియజేశారు. కళాశాల చారిత్రక అధ్యాపకులు శ్రీ పి సుందర్ రావు గారు భారత దేశం స్వాతంత్ర్యమును పొందిన విధానాన్ని వివరించారు. అనంతరం ఎకడమిక్ పరంగా ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు దాతలు అందించిన నగదు పురస్కారములను అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో SVJP Trust managing Trustee శ్రీ V. ప్రేమ్ రాజుగారు , SVJP ట్రస్ట్ పూర్వ సభ్యులు శ్రీ డి కామరాజు గారు, శ్రీ I .రామకృష్ణ గారు, జిల్లెలమూడి ex VRO శ్రీ డి. శ్యాం ప్రసాద్ గారు, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సబానిర్వహణ సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ RVNSS వరప్రసాద్ గారు నిర్వహించగా వందన సమర్పణ తెలుగు అధ్యాపకులు శ్రీ టి. జయకృష్ణ గారు నిర్వహించగా శాంతి మంత్రముతో కార్యక్రమం జరిగింది.
by MOC IQAC | Apr 2, 2026 | Uncategorized
అమ్మ అమృత హస్తాల తో స్థాపించబడిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల 6/8/2025 బుధవారం నాడు 55 వ్యస్థాపక దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిగాయఈ వేడుకలలో భాగంగా టీ టీ డీ కళ్యాణ మండపం ప్రాంగణం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభకుమాతృశ్రీ ప్రాచ్య కళాశాల కరస్పాండెంట్ శ్రీజన్నాభట్ల కుమార చంద్రశేఖర్ గారు అధ్యక్షోపన్యాసం లో 1971 ఆగష్టు 6 ప్రారంభించబడి ఎన్నో ఘన విజయాలు సాధించినది.ఆనాటి గురు శిష్యుల సంబంధాలను గురించి పిల్లలకు తెలియజేశారు .కాలేజీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్డా. బొడ్డపాటి సుబ్బలక్ష్మి గారు మునుముందు సంస్కృతం, తెలుగు భాషలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. తన ఎదుగుదలకు కారకులైన అమ్మ గురించి, తన గురువు శ్రీ కొండమూది శ్రీహర్ష గురించి విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ మరకాని దినకర్ గారు మాట్లాడుతూ తాను జిల్లెళ్లమూడి వచ్చిన మరునాడే కళాశాల ప్రారంభమైనదనీ,అప్పటి స్థితిగతులను వివరించారు. శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు బాగా శ్రద్ధగా చదువుకోవాలని తెలియజేశారు. మన కళాశాల విద్యార్థులు ఎక్కడ ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో , విద్యార్థులు ఎలా ఉండాలో తెలియజేశారు పూర్వ విద్యార్థిసమితి కార్య నిర్వాహక సభ్యులు శ్రీ కాసులనాటి శేషాద్రి గారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్ గారు కళాశాల (2024 – 25 ). వార్షిక నివేదిక ను అందించారు ఈ సందర్భంగావిద్యార్థినులు గీతాలాపన చేశారు ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వక్తృత్వం, వ్యాసరచన, శ్లోకపఠనం, పద్య పఠనం, గద్య పఠనం,అంత్యాక్షరి(శ్లోకాలు,పద్యాలు)పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు ఎంతో విలువైన పుస్తకాలను పూర్వ విద్యార్థుల సమితి పక్షాన అందించటం జరిగింది. పూర్వ విదార్థి డాక్టర్ జయంతి చక్రవర్తి ఈ సభా నిర్వహణ చేశారు. డా. వి. త్రియంబకం వందన సమర్పణ చేశారు. శాంతి మంత్రం తో కార్యక్రమం ముగిసింది. వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.