by MOC IQAC | Dec 7, 2024 | Uncategorized
BASIC LIFE SUPPORT
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సమాజంలో తాము ఒకరమని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని బాధ్యత కలిగి ప్రవర్తించాలనే ఉద్దేశంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో మాతృశ్రీ మెడికల్ సెంటర్ మరియు శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వారు 7-12-2024 , 8-12-2024 శని ఆదివారాలలో రెండు రోజుల పాటు Basic Life Support అనే అంశంపై వర్క్ షాప్ జరిగింది. Assistant Professor Dr. Y Ashok (Anesthesiology) Educational Consultant, Ramesh Hospitals and team ఈ వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ వర్క షాప్ లో 120 మంది విద్యార్థులు అధ్యాపకులు మరియు మెడికల్ సెంటర్ టీమ్ పాల్గొన్నారు. డా. అశోక్ గారు తమ అనుభవంతో కూడిన లెక్చర్ ఇస్తూ రెండు రోజుల పాటు ఉదయం మనం మన చుట్టూ ఉన్న వారిని ఎలాంటి అత్యవసర చికిత్స చేయగలమో తెలిపారు. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి చేత ప్రాక్టికల్ గా ఎలా Cardiac Arrest అయిన వారికి CPR చేయవచ్చో వివరించారు. Heart Attack కి Cardiac Arrest కి మధ్య ఉన్న తేడాను గమనించి ఎలా సరైన సమయంలో స్పందించాలో తెలియజెప్పారు. మనం చేసే ప్రయత్నం ఒక నిండు జీవితాన్ని నిలబెడుతుందనే స్పృహ తో మనం ఆలోచన చెయ్యాలని చెప్పారు. విద్యార్థులందరి చేత ప్రాక్టికల్ గా CPR చేయించి వారిని అభినందిస్తూ CERTIFICATES అందించారు. మాతృశ్రీ మెడికల్ సెంటర్ బృందం Dr. జ్ఞానప్రసూన, Dr. ఇనజ కూమారి గార్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ పెద్దలు శ్రీ యమ్. దినకర్ గారు ఈ కార్యక్రమం లో పాల్గొని ఈ కార్యక్రమం ఏర్పాటు పై తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రామయ్య, భువనేశ్వరి, చాముండేశ్వరి కార్యక్రమంలో పాల్గొన్నారు.
by MOC IQAC | Dec 1, 2024 | Cultural
కార్తీక వన సమారాధన
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ప్రతి ఒక్కరూ మైత్రీ భావంతో మెలిగేందుకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ పలు క్రీడా , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ యేడాది డిసెంబరు 1, ఆదివారం నాడు కార్తీక వనసమారాధన ను ఏర్పాటు చేశారు. ప్రాచీన కవుల కావ్యాలలో మనం చూసే ప్రకృతి వర్ణనలు పరిశీలించినట్లయితే వారు భావితరాలకు అందించిన దివ్యౌషధాల సమాహారం తెలుస్తుందని కనుక ఈ సమారాధన లో ఎన్నో ఆరోగ్య సంబంధ విషయాలు
ఇమిడి ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ విద్యార్థులకు తెలియజెప్పారు. సామూహికంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులను సమైక్యంగా ఉంచడం, చైతన్య వంతులుగా చేయడమే లక్ష్యమని వివరించారు. కార్యక్రమంలో SVJP TRUST పెద్దలు సాయిబాబా గారు, దినకర్ గారు పాల్గొన్నారు. పూజానంతరం అధ్యాపకులు విద్యార్థులు స్నేహపూరిత వాతావరణంలో భోజనాలు పూర్తి చేశారు. సాయంత్రం విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు.
by MOC IQAC | Dec 1, 2024 | AIDS, Awarness Programs
WORLD AIDS DAY
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో డిసెంబరు 1వ తేదీ ఆదివారం సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభాధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఎయిడ్స్ రావడానికి కారణాలు, నివారణమార్గాలు విద్యార్థులకు తెలిపారు. అనంతరం చరిత్ర ఉపన్యాసకులు పి. సుందరరావు గారు ఎయిడ్స్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఎలా వ్యాపించి ఉందో గణాంకాలతో తెలిపి అతి త్వరలో ఎయిడ్స రహిత ప్రపంచంగా మారడానికి అందరూ కృషి చేయాలని, ఆ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని భయపడకుండా నివారణోపాయాలను తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు సాహిత్, మీనాక్షి, శ్రీలక్ష్మి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలను చక్కగా వివరించారు. అనంతరం కళాశాల మైదానం లో విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి మానవహారం నిర్వహించారు. అంతే కాక జిల్లెళ్ళమూడి గ్రామప్రజలకు అవగాహన కల్పించేందుకు అందరూ ర్యాలీ గా గ్రామంలో పర్యటించి గ్రామస్థులకు అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కమీషనరేట్ ఆప్ కాలేజియేట్ వారి ఆదేశాల మేరకు విద్యార్థులకు పోష్టర్ పెయింటింగ్, పెయింటిగ్, రంగవల్లుల పోటీలు ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలన ప్రతిబింబించేవిధంగా పోటీలు నిర్వహించబడ్డాయి.
by MOC IQAC | Nov 30, 2024 | Career Guidence
A career guidance Program is conducted by Matrusri Oriental College, convened by Principal Dr A Hanumath Prasad Garu. Key Resource person, Dr Sushama garu from IKS MITADT, PUNE delivered an enlightening lecture on “Global opportunities for traditional students: significance of Indian knowledge systems and its relevance to Sanskrit students”. She gave an insight on the various projects offered by IKS. Dr. Sushama reinforced the importance and necessity of the study of Sastras in depth.
She emphasized the role of Sanskrit and Sanskrit students in transferring knowledge from ancient relevant texts to Doctors, Engineers, Psychologists etc.
She has also reiterated the importance of building a perspective towards every situation from the Shastras point of view.
Significance of Interdisciplinary approach has also been highlighted
An interactive session was conducted, in which all students shared their thoughts with the resource person. 58 students participated in the session.
The session was well received by the students
by MOC IQAC | Nov 14, 2024 | National Commemorative Days
గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందించి వారిలో ఆలోచనా పరిధిని విస్తృతం చేసేందుకు గాను 14,15,16 తేదీలలో ఈ కార్యక్రమాలు జరిపారు.
మొదటి రోజు శ్రీ M. S. శరచ్చంద్రగారు ఆన్ లైన్ ద్వారా ప్రసంగిస్తూ విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను మరియు మన కళాశాలలో ఉన్న అమూల్యమైన సంస్కృతాంధ్ర గ్రంథాలను వినియోగించుకోవాలని తెలియజేశారు. అనంతరం సంస్కృతాంధ్ర గ్రంథాల ప్రదర్శన విద్యార్థులకు విశేషంగా ఆకట్టుకుంది. వివిధ గ్రంథాలను పరిశీలించడం ద్వారా వారు కొత్త విజ్ఞానాన్ని పొందగలిగారు.
రెండవ రోజు విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్త్రత్వ పోటీలు జరిగాయి. PDC మరియు DEGREE స్థాయిలలో జరిగిన ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మూడవ రోజు సాయంత్రం కళాశాల ఉప ప్రాచార్యురాలు శ్రీమతి L. మృదుల గారి ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ సభలో వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతో పాటు BEST LIBRARY USER AWARD అందించారు. Librarian R. రమ్య మూడురోజులపాటు విద్యార్థులను ఉత్సాహపరచి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పుస్తక పఠనంతో జ్ఞానాభివృద్ధిని పెంపొందించుకోవాలని అధ్యాపకులు సూచించారు.